త్వరలో సేవా బ్రహ్మోత్సవం | seva brahmmostavam | Sakshi
Sakshi News home page

త్వరలో సేవా బ్రహ్మోత్సవం

Published Sat, Aug 27 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

seva brahmmostavam

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: 
లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఒకే రోజు రూ. కోటి వ్యయంతో సేవా బ్రహ్మోత్సవాన్ని త్వరలో నిర్వహించబోతున్నట్లు క్లబ్‌ జిల్లా గవర్నర్‌ మూల్పూరి ఉపేంద్ర తెలిపారు. స్ధానిక ఏలూరురోడ్డులోని ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలలో లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ గొల్లపూడి కీర్తి ఆధ్వర్యంలో మదర్‌ «థెరెసా జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మదర్‌ చిత్రపటానికి ఉపేంద్ర పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆశాజ్యోతి ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం 100 పండ్ల మొక్కలను ఉచితంగా పంపీణీ చేశారు.  లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ గొల్లపూడి కీర్తి తరుపున ఆశాజ్యోతి వికలాంగుల సొసైటీకి రూ 1.25 లక్షల విరాళాన్ని వ్యవస్థాపకుడు మరీదు వెంకటస్వామికి అందజేశారు.  గొల్లపూడి కీర్తి క్లబ్‌ అధ్యక్షురాలు శారదా వాణి, బాపులపాడు సర్పంచ్‌ కాకాని అరుణ, అక్కినేని శ్రీనివాస ఫణీంధ్ర, డాక్టర్‌ కడియాల రామారావు, ఎం.మాధవీలత పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement