సాక్షి, విజయవాడ : తలకిందులుగా తపస్సుచేసి అయినా రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ నాగాయలంకలో గురువారం జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పలువురు తలకిందులుగా నిలబడి జైసమైక్యాంధ్ర, తెలంగాణ వద్దు-సమైక్యాంధ్రముద్దు అంటూ నినాదాలు చేశారు. విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద జోరువానలో ఎన్‌జీవోలు, ఇరిగేషన్ ఉద్యోగులు భోజనవిరామ సమయంలో ధర్నా చేశారు. కైకలూరు వెలంపేటకు చెందిన మహిళా కార్యకర్తలు రిలే దీక్షల్లో కూర్చున్నారు.
నందివాడ మండలం టెలిఫోన్ నగర్‌లో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు హైస్కూల్ విరామ సమయంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. తిరువూరులో సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు 21వ రోజు కొనసాగాయి. చల్లపల్లిలో 76వరోజుకు దీక్షలు చేరాయి. చల్లపల్లి మండలంలోని మాజేరుకు చెందిన మహిళలు దీక్ష చేశారు.
అవనిగడ్డలో 63వరోజు చేరుకున్నాయి. అవనిగడ్డలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ యూత్‌కు చెందిన వేకనూరు యువకులు దీక్ష చేశారు. వైఎస్సార్‌సీపీ యూత్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. యూత్ మండల కన్వీన ర్ చామల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు, వివిధ మండలాల కన్వీనర్లు, నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, పాఠశాలల ముందు రాష్ట్ర విభజనకు నిరసనగా నినాదాలు చేశారు. ఆగిరిపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 32వ రోజూ రిలే నిరహార దీక్షలు జోరువానలో కొనసాగాయి.పామర్రు ఏపీఎన్‌జీవో సంఘం పిలుపు మేరకు . పామర్రు కంచర్ల రామారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మధ్నాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేశారు.
చిన్నగాంధీబొమ్మ సెంటరులో జేఏసీ ఆధ్వర్యంలోని రిలేదీక్ష శిబిరాన్ని విశాలాంధ్రమహాసభ రాష్ట్రఅధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ శిబిరంలో పట్టణంలోని శారదా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు, త్రివిధ, కుమార్, విజేత ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. సెయింట్‌జోన్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు చిన్నగాంధీబొమ్మ సెంటరులో వర్షం పడుతున్నా గొడుగులు వేసుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 59వ రోజుకు చేరాయి.
పట్టణంలోని బాపునగర్‌కు చెందిన కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఏపీఎన్జీవోల అధ్వర్యంలో మైలవరం పంచాయతీ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మైలవరం నియోజక వర్గ సమన్వయ కర్త జోగిరమేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగుసెంటర్‌లో వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఏపీ ఎన్జీవో రాష్ట్ర నాయకులు అశోక్‌బాబు పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నభోజన సమయంలో నిరసన వ్యక్తం చేశారు. నందివాడ మండలంలోని టెలిఫోన్ నగర్ కాలనీలోని సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు గురువారంతో 54వ రోజుకు చేరుకున్నాయి. అరిపిరాల గ్రామానికి చెందిన రైతులు దీక్షలో కూర్చున్నారు.
జోరువానలోనూ సమైక్య హోరు
Published Fri, Oct 25 2013 1:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
Advertisement
Advertisement