రక్తదానం చేసి మానవత్వం చాటాలి | Blood donation Humanity catali | Sakshi
Sakshi News home page

రక్తదానం చేసి మానవత్వం చాటాలి

Published Wed, Sep 25 2013 1:17 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

Blood donation Humanity catali

ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రక్తదానం చేసి మానవత్వం చాటాలని అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటయ్య సూచించారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడంలో ఉన్న సంతృప్తి మరే పనిలో ఉండదని, సమాజానికి ఉపయోగపడే రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. రక్తదానంతో శరీరం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. శిబిరంలో 85 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు విఠల్‌రావు దేశ్‌పాండే, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పశు సంవర్ధక శాఖ అధికారులు సుధాకర్, రామారావు, మజీద్, కుమారస్వామి, దూద్‌రాం రాథోడ్, రిమ్స్ సిబ్బంది బిపాష, విజయ్‌కుమార్, సత్యనారాయణ, విలాస్, మోహన్‌నాయక్, పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement