సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
-
ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు
-
ఆర్‌కేపీలో లయన్స్ క్లబ్ పట్టణ శాఖ ప్రారంభం
రామకృష్ణాపూర్ : సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. తోటి వారికి సహాయం చేయాలన్న మంచి గుణం అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. పట్టణంలోని ఆర్‌కేసీవోఏ క్లబ్‌లో మంగళవారం రాత్రి లయన్స్ క్లబ్ పట్టణ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్స్ క్లబ్ సభ్యులు ఆయా ప్రాంతాల్లో చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని అన్నారు.
లయన్స్ క్లబ్ గవర్నర్ సురేశ్ మాట్లాడుతూ ఆర్‌కేపీ శాఖకు తమ పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అన్నారు. పట్టణానికి చెందిన ఇరుకుల ఆనంద్, పందెన కృష్ణ, కల్కూరి సత్యనారాయణ రూ.60వేలు అందించారు. అనంతరం క్లబ్ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కంభగోని సుదర్శన్‌గౌడ్, ఎంపీపీ బొలిశెట్టి కనకయ్య, క్యాతనపల్లి సర్పంచ్ జాడి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ శివప్రసాద్, రీజినల్ చైర్మన్ నారాయణరావు, లయన్స్ సిరిపురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ పట్టణ కమిటీ..
ఆర్‌కేపీ లయన్స్‌క్లబ్ నూతన కమిటీని గవర్నర్ సురేశ్ ప్రకటించారు. క్లబ్ అధ్యక్షుడిగా కంభగోని సుదర్శన్‌గౌడ్, కార్యదర్శిగా కట్కం నాగరాజు, కోశాధికారిగా ఆడెపు కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా వనం సత్యం, ఉపాధ్యక్షులుగా అరికొళ్ల సంపత్, బొలిశెట్టి కనకయ్య, ప్రభాకర్, మెంబర్‌షిప్ డైరెక్టర్‌గా సలీం పాషా, పీఆర్‌వోగా మహేందర్, పమేర్‌గా ఎల్లంకి గోపాల్, డైరెక్టర్లుగా బత్తుల శ్రీనివాస్, అమర్‌నాథ్‌రెడ్డి, వెంకటేశ్, రఘు, రాజబాబు, మల్లేశ్ , శ్రీనివాసులు, సత్యం, రాజేశ్, శ్రీనివాస్‌లను నియమించినట్లు తెలిపారు.