రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం | blood donation camp held in kagaz nagar | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Published Mon, Jul 25 2016 11:47 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

blood donation camp held in kagaz nagar

కాగజ్‌నగర్‌ : కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సోమవారం ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన  శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తనయుడు కోనేరు వంశీ పాల్గొన్నారు. సొసైటీ ఆసిఫాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఈర్ల సునీల్‌ కుమార్, కో ఆర్డినేటర్‌ పోతుల కల్యాణ్, కోశాధికారి బుక్క బాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో సుమారు 51 మంది యువకులు రక్తదానం చేశారు.
          కోనేరు వంశీ కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎస్‌ఐ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దశరథరాం, డాక్టర్‌ రావుజీ, నాయకులు అంజనేయులు గౌడ్, లంక సునీల్, శ్రీరామ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement