దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండటంతో చలి మరింతగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో విరివిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇంతేకాదు డిసెంబర్ 12 నుండి పశ్చిమ బెంగాల్, సిక్కింలోని వివిధ ప్రాంతాలలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ)హెచ్చరిక జారీ చేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాతావరణ స్థితిగతుల విషయానికి వస్తే ఉష్ణోగ్రతలో నిరంతరం క్షీణత కనిపిస్తోంది. ఆదివారం (డిసెంబర్ 10) రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని, ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. సోమవారం (డిసెంబర్ 11) గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత పేలవమైన విభాగంలోనే కొనసాగుతోంది. అంతే కాదు రాబోయే మూడు రోజుల్లో రాజధానిలో కాలుష్య సమస్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. కాగా డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని చోట్ల, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 4.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్‌మార్గ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 4.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: ఈ మూడు కారణాలే బాబాను సీఎం రేసు నుంచి తప్పించాయా?
Comments
Please login to add a commentAdd a comment