లోక్‌సభ ఎన్నికల్లో 272+ సీట్లే లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 272కన్నా ఎక్కువ సీట్ల లక్ష్యసాధనపై ప్రధానంగా దృష్టిసారించాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. యూపీఏ పాలనలో అవి నీతి, కుంభకోణాలు, అధిక ధరలు, నిరుద్యోగంతో విసుగుచెందిన ప్రజలు బీజేపీ నాయకత్వం, మోడీ సారథ్యం వైపు చూస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరూ యత్నించాలని సూచించారు. గురువారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీ య పదాధికారుల సమావేశంలో రాజ్‌నాథ్‌తోపాటు అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు.
శుక్రవారం నుంచి మొదలవనున్న జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది.
కార్యవర్గ భేటీలో ఆర్థిక తీర్మానాన్ని జవదేకర్, రాజకీయ తీర్మానాన్ని రవిశంకర్ ప్రసాద్, జాతీయ కౌన్సిల్‌లో ఆర్థిక తీర్మానాన్ని జైట్లీ, రాజకీయ తీర్మానాన్ని సుష్వా స్వరాజ్ ప్రవేశపెట్టాలని నిర్ణయం.
ఎన్నికల విరాళాల సేకరణకు ఇటీవల ఆవిష్కరించిన ‘ప్రధానిగా మోడీ’ నిధికి దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల మంది పార్టీ ప్రజా ప్రతినిధులు నెల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయం.