National council meetings
-
Bjp National Council 2024: కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
సాక్షి,ఢిల్లీ: బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండోరోజు ఆదివారం అమిత్ షా ప్రసంగించారు. వారసత్వ, అవినీతి, సంతుష్టీకరణ రాజకీయాల సంస్కృతి కలిగిందే ఇండియా కూటమి అని విమర్శించారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వ హాయంలో ఉగ్రవాదం, నక్సలిజం కొనఊపిరితో ఉంది. రానున్న మోదీ 3.0 ప్రభుత్వంలో ఉగ్రవాదం నక్సలిజం పూర్తిగా లేకుండా పోతుంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న మాపై విపక్షాలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేకపోయాయి. ఏడు కుటుంబ పార్టీల సమాహారమే ఇండియా కూటమి. డైనాస్టీ ఆలయన్స్ వర్సెస్ డెమొక్రటిక్ అలయెన్స్‌గా రానున్న ఎన్నికల్లో యుద్ధం జరగనుంది. ఇండియా కూటమి అధికారంలో ఉన్న కేరళ, పశ్చిమబెంగాల్లో హింసాత్మక రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆర్టికల్ 370పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్ళింది. ఈ వ్యాఖ్యలు దేశ ద్రోహ చర్యలే. అన్ని ప్రొఫెషనల్ కోర్సులలో ఓబిసి రిజర్వేషన్ అమలు చేశాం. ఇండియా కూటమికి కనుచూపుమేరలో కూడా అధికారం కనిపించడం లేదు. 17 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర బీజేపీది’ అని అమిత్ షా తెలిపారు. #WATCH | Delhi: Union HM Amit Shah says, "What is their (INDIA alliance) objective in politics? PM Modi aims at self-reliant India. Sonia Gandhi's aim is to make Rahul Gandhi the PM , Pawar Saheb's aim is to make his daughter the CM, Mamata Banerjee's aim is to make her nephew… pic.twitter.com/lyx6slNRac — ANI (@ANI) February 18, 2024 ఇదీ చదవండి..అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలు ఎవరో -
డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్సింగ్ను తప్పించి పార్టీ అధ్యక్ష పగ్గాలను సీఎం నితీశ్‌కుమార్ లాంఛనంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ భేటీ ఇందుకు వేదికైంది. పార్టీ అధ్యక్షునిగా నితీశ్ పేరును సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థించారు. ఆ వెంటనే లలన్ రాజీనామా, అధ్యక్షునిగా నితీశ్ బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు! కొద్ది నెలల క్రితం నుంచే... ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్‌తో లలన్‌సింగ్ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్బంధన్ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. లాలు–లలన్ ప్లాన్ నితీశ్ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్‌లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు. కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగింది. ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్ అప్రమత్తమయ్యారు. సైలెంట్‌గా వారం క్రితం ‘ఆపరేషన్ లాలన్’కు తెర తీశారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వారంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలా పావులు కదుపుతూ శుక్రవారం కథను క్లైమాక్స్‌కు తెచ్చారు. విషయం అర్థమైన లాలన్‌సింగ్ అస్త్రసన్యాసం చేశారు. అధ్యక్ష పదవికి తానే నితీశ్ పేరును సూచించి తప్పుకున్నారు! -
దురాక్రమణదారు చైనా నుంచి దిగుమతులా?
న్యూఢిల్లీ: భారత్‌పై దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా నుంచి దిగుమతులకు కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల గౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. ధైర్యంగా చైనా దిగుమతులను నిలిపివేసి మత సత్తా చాటాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చౌకగా దొరికేవే అయినా చైనా వస్తువులను మానేసి, ఖరీదైనా దేశీయంగా తయారైన వాటినే కొనాలని కోరారు. ఎద్దు నుంచి పాలు పితికాం గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకోవడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, గుజరాత్లో మేం ఎద్దు నుంచి పాలు పితికాం. అతికష్టమ్మీద 5 సీట్లు గెలుచుకున్నాం’ అని అన్నారు. -
మజ్బూత్? మజ్బూర్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘నిజాయితీపరుడు, కష్టించి పనిచేసే వ్యక్తా? లేక దేశంలో ఉండాల్సిన సమయంలో విదేశాలకు వెళ్లే అవినీతిపరుడా? ప్రధానిగా ఎవరు కావాలో ప్రజలు ఎన్నుకోవాలి’ అని బీజేపీ జాతీయ మండలి సమావేశాల వేదికగా ప్రధాని మోదీ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. విపక్షాలు ఏర్పాటుచేయాలనుకుంటున్న మహాకూటమి విఫల ప్రయోగమవుతుందని ఎద్దేవా చేశారు. బంధుప్రీతి, అవినీతి కోసం నిస్సహాయ, బలహీన(మజ్బూర్) ప్రభుత్వం ఏర్పడాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆరోపించారు. కానీ దేశ సమగ్రాభివృద్ధి కోసం బలమైన(మజ్బూత్) ప్రభుత్వం ఉండాలని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం ముగిసిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించిన మోదీ..సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం కాకుండా కాంగ్రెస్ తన లాయర్ల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా కల్పించడం వల్ల ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతినవని చెప్పారు. అవినీతి లేని ఏకైక ప్రభుత్వమిదే.. దేశ చరిత్రలో అవినీతి ఆరోపణలు రాని ఏకైక ప్రభుత్వం తమదేనని మోదీ చాటిచెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడమే ప్రాథమిక లక్ష్యంగా ఏర్పడిన పార్టీలు ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపాయని పరోక్షంగా విపక్షాల సిద్ధాంతాల్ని తప్పుపట్టారు. ‘ కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడొచ్చని, తమ బంధువులు, మిత్రులకు దోచిపెట్టొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నల్లధనం, అవినీతిపై చౌకీదార్ సాగించిన పోరాటంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. ‘ ఇంట్లో పని ఉన్న సమయంలో విహారయాత్రలకు వెళ్లే పనివాడిని ఎవరైనా కావాలనుకుంటారా? ఆయన (పరోక్షంగా రాహుల్ గాంధీ) అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. మరి ఈ దేశానికి ఎలాంటి పనివాడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. రైతులే నవభారత చోదక శక్తులు.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం పగలూ రాత్రి కష్టపడుతోందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలకు రైతులంటే కేవలం ఓటర్లేనని, కానీ తమ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందని అన్నారు. ‘స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేసింది బీజేపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగానే రైతులు ఈరోజు దుర్భర స్థితిలో ఉన్నారు. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్ల కనీస మద్దతు ధర అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మోదీ అన్నారు. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నవభారతం విశ్వాసం పెంపొందుతుందని మోదీ అన్నారు. కొత్త కోటా వల్ల ఇతరుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లదని హామీ ఇచ్చారు. ఆ ఓటమితో ఢీలా పడొద్దు: షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తూ..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం పట్ల ఢీలా పడొద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా కూడా తమ పార్టీ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. కులతత్వం, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెసే కారణమని, ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడి, అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ప్రచార సమయంలో దేశంలోని ప్రతి ఓటరుకు చేరువకావాలని సూచించారు. పోలింగ్ రోజున తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఉదయం 10.30 గంటల లోపే ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలు నియంతృత్వం, ప్రజాస్వామ్యం మధ్యే జరుగుతాయని కాంగ్రెస్ పేర్కొంది. స్థిరత్వమా? అస్థిరతా? రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు..స్థిరత్వం, అస్థిరతలలో ఒకదాన్ని ఎన్నుకోవాలని, నిజాయితీ, ధైర్యశాలి నాయకుడైన మోదీకి..నాయకుడు తెలియని అవకాశవాద కూటమికి మధ్య పోటీ అని శనివారం ఆమోదించిన తీర్మానంలో బీజేపీ పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పార్టీ కార్యకర్తలు పాఠాలు నేర్చుకుని, లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేయాలని సూచించింది. ఈ తీర్మానం వివరాల్ని కేంద్ర మంత్రి రవిశంకర్ వెల్లడిస్తూ..మోదీపై విద్వేషమే విపక్షాలను ఒకటి చేస్తోందన్నారు. ఎన్డీయే హయాంలో భారత్ వర్ధమాన ప్రపంచ శక్తిగా, మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రతిపాదిత విపక్ష కూటమి అధికారంలోకి వస్తే 1990ల నాటి అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని హెచ్చరించింది. -
పార్టీ కోరితే పోటీకి సిద్ధం: కృష్ణం రాజు
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వం ఆదేశిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీమంత్రి, నటుడు కృష్ణం రాజు తెలిపారు. తిరిగి మోదీయే ప్రధాని కావాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాననీ, ప్రజల్లో మోదీ పట్ల అనూహ్య మద్దతు పెరుగుతోందని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న కృష్ణం రాజు అనంతరం మీడియాతో మాట్లాడారు. సేవకుడంటే మోదీలా ఉండాలని, ఆయన ప్రసంగం వింటే మరోసారి గెలిచినంత సంతోషంగా ఉందన్నారు. అగ్రవర్ణలకు 10 శాతం రిజర్వేషన్లపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. కొందరు మాత్రం నిధులు రావట్లేదంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మేరా బూత్ మాజ్బూత్ నినాదంతో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలతో కార్యకర్తలకు మార్గదర్శకం చేశారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోసం కూటమి కడుతున్న పార్టీలకు నాయకుడెవరనీ, మోదీకి సరితూగే నేత కూటమిలో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎజెండా, నాయకత్వం లేని కూటమని విమర్శించారు. దేశంలో అవినీతిలేని పాలనను మోదీ అందిస్తున్నారనీ, మేరా బూత్ మాజ్బూత్ నినాదంతో ప్రతీ కార్యకర్త పార్టీని గెలిపించిందేకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2014 ఫలితాలే పునారావృత్తం.. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. గతంలో కంటే రెట్టింపు ఉత్సహంతో పార్టీ శ్రేణులు ఉన్నారని, 2014 ఫలితాలే మరలా పునారావృత్తం అవుతాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికల గురించి సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. దేశం అభివృద్ధిలో వేగంగా సాగాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమని వ్యాఖ్యానించారు. -
మందిర నిర్మాణం తథ్యం
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశ చరిత్రను మలుపు తిప్పిన మూడో పానిపట్ యుద్ధం వంటివన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ సాంస్కృతిక జాతీయ వాదానికీ, ప్రతిపక్షాల అధికార దాహానికి మధ్యనే జరగనున్నాయని తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. ‘అయోధ్యలో తొందరగా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలని పార్టీ పట్టుదలతో ఉండగా కాంగ్రెస్ అడ్డంకులు కల్పిస్తోంది. అయితే, బీజేపీ రామ మందిరాన్ని నిర్మించి తీరుతుంది’ అని అన్నారు. మందిర నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరేంటో స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, అద్భుతమైన, పారదర్శక, కష్టపడి పనిచేసే నేత బీజేపీకి ఉన్నారు. 1987 నుంచి ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ప్రతిపక్షంలో ఆయనకు సరితూగగల నేత లేరు. మోదీ మాదిరిగా మరెవ్వరూ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు’ అని పేర్కొన్నారు. వారంలో రెండు కీలక నిర్ణయాలు మోదీ ప్రభుత్వం ఈ వారంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుందని అమిత్ చెప్పారు. ఒకటి.. జనరల్ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం. రెండోది జీఎస్టీ మినహాయింపు పరిమితిని పెంచడం. జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ల ద్వారా కోట్లాది మంది యువత ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. దీంతోపాటు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. దీని ప్రకారం రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వారు 1 శాతం పన్ను చెల్లించేలా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. అక్రమాలకు పాల్పడిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీవంటి వారు కాంగ్రెస్ హయాంలో దేశం విడిచి ఎందుకు పారిపోలేదు? కాంగ్రెస్ దేశంలో అవినీతిని ఎలా పెంచి పోషించిందో దీన్నిబట్టి స్పష్టమవుతుంది అని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలోనే ఈ ఆర్థిక నేరగాళ్లంతా ఎందుకు పారిపోయారు? ప్రధాని మోదీ చౌకీదార్ మాదిరిగా ఇలాంటి వారిని ఉపేక్షించబోరని అన్నారు.రైతులకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్న మోదీ సర్కారును ‘రైతు హిత’ ప్రభుత్వంగా పేర్కొంటూ బీజేపీ జాతీయ కౌన్సిల్ ఒక తీర్మానం ఆమోదించింది. దీంతోపాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మరో తీర్మానం చేసింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లోని పార్టీ నేతలు కలిపి 14వేల మంది వరకు హాజరయ్యారు. మోదీకి, మిగతా వారికి మధ్యనే పోటీ ప్రధాని మోదీని ఓడించాలనే చౌకబారు ఎత్తుగడతోనే మహా కూటమి ఏర్పడుతోందనీ, ఈ కూటమికి ఒక విధానం కానీ, నాయకుడు గానీ లేరని అమిత్ అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసిన మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘వచ్చే సాధారణ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటంగా సాగనున్నాయి. సాంస్కృతిక జాతీయ వాదం, పేదల అభ్యున్నతే బీజేపీ పార్టీ లక్ష్యం కాగా, ప్రతిపక్షాలు అధికారమే పరమావధిగా ఏకమవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ‘కూటమిలోని పార్టీలన్నీ 2014 ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైనవే. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ 2014 ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాలు సాధించడం ఖాయం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. -
పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు బీజేపీ చీఫ్ అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు తలపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యువత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను దేశం నలుచెరుగులా తీసుకువెళ్లాలని పార్టీ యంత్రాంగానికి అమిత్ షా సూచించారు. అభివృద్ధి, సంక్షేమానికి పాలక బీజేపీ పాటుపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గతంలో బీజేపీ ఉనికి లేని రాష్ట్రాల్లోనూ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న మహాకూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. గతంలో ఒకరినొకరు చూసుకునేందుకూ ఇష్టపడని పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచి పనులను సహించలేని పార్టీలు ఆయనను ఓడించేందుకే సిద్ధాంతాలు పక్కనపెట్టి ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. మోదీ ఓటమే వారి ఏకైక అజెండాగా మారిందని దుయ్యబట్టారు. -
బీజేపీ నేతల్లో మార్పు శుభపరిణామం: సబ్బంహరి
సాక్షి,విశాఖపట్నం: బీజేపీలో మార్పు శుభపరిణా మని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి అన్నారు. విశాఖలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు అన్ని పార్టీలూ రాజకీయలబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. యూపీఏకు పార్లమెంటులో మెజార్టీ లేదు. బిల్లుపై నిర్ణయం తీసుకునే బలం లేదు. బీజేపీ మద్దతిస్తుం దనే నమ్మకంతో యూపీఏ తెలంగాణపై ముందకెళుతోందన్నారు. అయితే బీజేపీ వైఖరి తాజాగా ఆ పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌తో తేలిపోయిందని, ఆ పార్టీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, నరేంద్రమోడి కూడా ఈ విభజన ప్రతిపాదనలు రాజకీయ లబ్ధికోసమే చేశారని అంగీకరించారని చెప్పారు. ఇదే సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై పలు విమర్శలు చేశారు. తన దిష్టిబొమ్మలు తగుల బెట్టడం వంటివి చేస్తున్నారని, తాను కూడా ఆ పని చేయగలనని సబ్బం అన్నారు. ‘దిష్టిబొమ్మలు తగులబెట్టే కార్యక్రమాన్ని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేస్తాను. 175 నియోజకవర్గాల్లో నీ దిష్టి బొమ్మలు తగలబెడతాను’ అని ఆయన పేర్కొన్నారు. ప్రెస్‌మీట్ పెట్టి ఎవరిపైనైనా చెడుమాట్లాడే అలవాటు తనకు లేదంటూనే ఆయన విమర్శలు కొనసాగించారు. -
లోక్‌సభ ఎన్నికల్లో 272+ సీట్లే లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 272కన్నా ఎక్కువ సీట్ల లక్ష్యసాధనపై ప్రధానంగా దృష్టిసారించాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. యూపీఏ పాలనలో అవి నీతి, కుంభకోణాలు, అధిక ధరలు, నిరుద్యోగంతో విసుగుచెందిన ప్రజలు బీజేపీ నాయకత్వం, మోడీ సారథ్యం వైపు చూస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరూ యత్నించాలని సూచించారు. గురువారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీ య పదాధికారుల సమావేశంలో రాజ్‌నాథ్‌తోపాటు అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. శుక్రవారం నుంచి మొదలవనున్న జాతీయ కార్యవర్గం, జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. కార్యవర్గ భేటీలో ఆర్థిక తీర్మానాన్ని జవదేకర్, రాజకీయ తీర్మానాన్ని రవిశంకర్ ప్రసాద్, జాతీయ కౌన్సిల్లో ఆర్థిక తీర్మానాన్ని జైట్లీ, రాజకీయ తీర్మానాన్ని సుష్వా స్వరాజ్ ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఎన్నికల విరాళాల సేకరణకు ఇటీవల ఆవిష్కరించిన ‘ప్రధానిగా మోడీ’ నిధికి దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల మంది పార్టీ ప్రజా ప్రతినిధులు నెల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయం.