Bjp National Council 2024: కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఫైర్‌ | Amit Shah Comments In BJP National Council Meeting | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌వి బుజ్జగింపు రాజకీయాలు: బీజేపీ జాతీయ కౌన్సిల్‌లో అమిత్‌ షా

Published Sun, Feb 18 2024 12:45 PM | Last Updated on Sun, Feb 18 2024 1:25 PM

Amit Sha Comments In Bjp National Council Meeting - Sakshi

సాక్షి,ఢిల్లీ: బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దుయ్యబట్టారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు ఆదివారం అమిత్‌ షా ప్రసంగించారు. వారసత్వ, అవినీతి, సంతుష్టీకరణ రాజకీయాల సంస్కృతి కలిగిందే ఇండియా కూటమి అని విమర్శించారు.  

‘నరేంద్ర మోదీ ప్రభుత్వ హాయంలో ఉగ్రవాదం, నక్సలిజం కొనఊపిరితో ఉంది. రానున్న మోదీ 3.0 ప్రభుత్వంలో ఉగ్రవాదం నక్సలిజం పూర్తిగా లేకుండా పోతుంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న మాపై విపక్షాలు ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేకపోయాయి. ఏడు కుటుంబ పార్టీల సమాహారమే ఇండియా కూటమి. 

డైనాస్టీ ఆలయన్స్ వర్సెస్ డెమొక్రటిక్ అలయెన్స్‌గా రానున్న ఎన్నికల్లో యుద్ధం జరగనుంది. ఇండియా కూటమి అధికారంలో ఉన్న కేరళ, పశ్చిమబెంగాల్లో హింసాత్మక రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆర్టికల్ 370పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్ళింది. ఈ వ్యాఖ్యలు దేశ ద్రోహ చర్యలే. 

అన్ని ప్రొఫెషనల్ కోర్సులలో ఓబిసి రిజర్వేషన్ అమలు చేశాం. ఇండియా కూటమికి కనుచూపుమేరలో కూడా అధికారం కనిపించడం లేదు. 17 రాష్ట్రాల్లో  ఎన్డీఏ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన చరిత్ర బీజేపీది’ అని అమిత్‌ షా తెలిపారు. 

ఇదీ చదవండి..అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలు ఎవరో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement