మైనార్టీల రక్షణకు ఎందాకైనా వెళ్తాం: రాజ్నాథ్ | we will do any thing for minorities security | Sakshi
Sakshi News home page

మైనార్టీల రక్షణకు ఎందాకైనా వెళ్తాం: రాజ్నాథ్

Published Mon, Mar 23 2015 12:03 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

మైనార్టీల రక్షణకు ఎందాకైనా వెళ్తాం: రాజ్నాథ్

మైనార్టీల రక్షణకు ఎందాకైనా వెళ్తాం: రాజ్నాథ్

న్యూఢిల్లీ: మైనార్టీల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. అందుకోసం తాను ఎందాకైనా వెళతానని, మైనార్టీల సంరక్షణే తమ ధ్యేయం అని చెప్పారు. వారిలో భయాందోళనలు తొలిగిపోయేందుకు ఏం చేయాలంటే అది చేస్తానని హామీ ఇచ్చారు.

ఇటీవల కాలంలో, దేశంలోని పలు మతాల ప్రార్థన సంస్థలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హర్యానాలో ఓ చర్చిపై అక్కడి విద్యాసంస్థలపై దాడులకు పాల్పడటం, బెంగాల్లో 71 ఏళ్ల నన్పై అత్యాచారానికి పాల్పడి నగదు దోచుకెళ్లడం వంటి ఘటనలు జరగడంతో వారి భద్రత విషయంలో ఆయన ప్రతిచోట హామీ ఇస్తున్నారు. రక్షణ కల్పించడంలో మత పరమైన వివక్షకు అవకాశం లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement