ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం కేసీఆర్ తో పాటు సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు రాజ్ నాథ్ తో సమావేశమయ్యారు.
తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని వారు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు విన్నవించారు. దీంతో పాటు పునర్ విభజన చట్టంలోని హామీల అమలకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ రాజ్ నాథ్ ను కోరారు.