లక్నో: భారతదేశ మిలిటరీ సైనికులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ రక్షణకు కృషి చేస్తారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పొరుగుదేశంలో ఇటువంటి పరిస్థితి లేదని పాకిస్తాన్ ఆర్మీపై పరోక్షంగా ఆయన విమర్శలు గుప్పించారు. 76వ ‘ఆర్మీ డే’ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ సోమవారం లక్నోలో నిర్వహించిన ‘శౌర్య సంధ్య’ కార్యక్రమంలో మాట్లాడారు.
మన పొరుగు దేశంలో మిలిటరీకి, దేశ రాజ్యాంగం విలువలకు అసలు సంబంధం ఉండదని తెలిపారు. సైనికులు కూడా దేశ రాజ్యాంగ విలువల పట్ల గౌరవం, అంకితభావం చూపారని పేర్కొన్నారు. కానీ, భారత దేశంలో మాత్రం అలా కాదన్నారు. దేశ రాజ్యాంగ విలువల పట్ల భారత ఆర్మీ సైనికుల అకింతభావం సాటిలేదని కొనియాడారు. సైనికులు చూపించే గౌరవం దేశ ప్రజలంతా గుర్తించదగినది పేర్కొన్నారు.
భారతీయ సైనికులు దేశం పట్ల ప్రత్యేకమైన ప్రేమతో మెలుగుతారని అన్నారు. సైనికులు దేశం పట్ల అంకితభావాన్ని సంస్కృతి విలువల మూలాల నుంచి అలవర్చుకున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల.. దేశభక్తి, ధైర్యం, మానవత్వం, విధేయత అనే నాలుగు ముఖ్యమైన లక్షణాలు ప్రతి భారత సైనికుడిలో కనిపిస్తాయని చెప్పారు. ఏ సైనికుడు అయితే తన మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయడో అతనే నిజమైన దేశభక్తుడని అన్నారు. ఇటువంటి దేశభక్తి మాత్రమే ప్రతి సైనికుడిలో మరింత ధైర్యాన్ని నింపుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment