army day
-
పాక్ ఆర్మీపై రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు
లక్నో: భారతదేశ మిలిటరీ సైనికులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ రక్షణకు కృషి చేస్తారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పొరుగుదేశంలో ఇటువంటి పరిస్థితి లేదని పాకిస్తాన్ ఆర్మీపై పరోక్షంగా ఆయన విమర్శలు గుప్పించారు. 76వ ‘ఆర్మీ డే’ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ సోమవారం లక్నోలో నిర్వహించిన ‘శౌర్య సంధ్య’ కార్యక్రమంలో మాట్లాడారు. మన పొరుగు దేశంలో మిలిటరీకి, దేశ రాజ్యాంగం విలువలకు అసలు సంబంధం ఉండదని తెలిపారు. సైనికులు కూడా దేశ రాజ్యాంగ విలువల పట్ల గౌరవం, అంకితభావం చూపారని పేర్కొన్నారు. కానీ, భారత దేశంలో మాత్రం అలా కాదన్నారు. దేశ రాజ్యాంగ విలువల పట్ల భారత ఆర్మీ సైనికుల అకింతభావం సాటిలేదని కొనియాడారు. సైనికులు చూపించే గౌరవం దేశ ప్రజలంతా గుర్తించదగినది పేర్కొన్నారు. భారతీయ సైనికులు దేశం పట్ల ప్రత్యేకమైన ప్రేమతో మెలుగుతారని అన్నారు. సైనికులు దేశం పట్ల అంకితభావాన్ని సంస్కృతి విలువల మూలాల నుంచి అలవర్చుకున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల.. దేశభక్తి, ధైర్యం, మానవత్వం, విధేయత అనే నాలుగు ముఖ్యమైన లక్షణాలు ప్రతి భారత సైనికుడిలో కనిపిస్తాయని చెప్పారు. ఏ సైనికుడు అయితే తన మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయడో అతనే నిజమైన దేశభక్తుడని అన్నారు. ఇటువంటి దేశభక్తి మాత్రమే ప్రతి సైనికుడిలో మరింత ధైర్యాన్ని నింపుతుందని తెలిపారు. చదవండి: రాముని గుడి బయట గొడవ.. కాంగ్రెస్ జెండా చించివేత -
Annual Army Day Parade 2024: మన దేశ బలానికి వారే ఆధారం: వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ: జనవరి 15వ తేదీన ఆర్మీ డే సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. సైనికులకు హ్యాట్సాఫ్ చెబుతూ ఓ వీడియో సందేశాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. సైనికుల త్యాగం, ధైర్యానికి దేశం గర్విస్తోంది. దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో వారి అంకితభావం ఎనలేనిది. మన దేశ బలానికి వారే ఆధారం అంటూ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారాయన. On Army Day, we honour the extraordinary courage, unwavering commitment and sacrifices of our Army personnel. Their relentless dedication in protecting our nation and upholding our sovereignty is a testament to their bravery. They are pillars of strength and resilience. pic.twitter.com/jD6FbM1Gkr — Narendra Modi (@narendramodi) January 15, 2024 -
Indian Army Day: సెల్యూట్..సైనికుడా..!
తమ బతుకునే ఫణంగా పెట్టి తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా దేశం కోసం ఉద్యోగం చేస్తుంటారు కొందరు. పుట్టిన ఊరికి దూరంగా, కన్నవారికి, కట్టుకున్న వారికి కనపడకుండా ఎండా, వానను లెక్క చేయకుండా చలికి వణుకుతూ అనుక్షణం ఎదురయ్యే ప్రమాదాలతో సహజీవనం చేస్తూ దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుంటారు. వారే మన భారత సైనికులు. త్యాగానికి నిదర్శనంగా నిలుస్తున్న నిజమైన దేశ భక్తులు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఏటా జనవరి 15వ తేదీన ఆర్మీ డే జరుపుకుంటాం. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎందరో యువకులు ఆర్మీలో పనిచేస్తున్నారు. అనేక మంది రిటైర్డ్ అయి సమాజ సేవలో ఉన్నారు. నేడు సైనిక దినోత్సవం సందర్భంగా.. వారిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1300 మంది వరకు త్రివిధ దళాల్లో పనిచేశారు. వీరిలో ఎయిర్‌ఫోర్స్‌లో 50 మంది, నేవీలో 20 మంది వరకు పని చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు దాదాపు 400 మంది వరకు జవాన్ స్థాయి నుంచి కల్నల్ హోదా వరకు సైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక సంక్షేమ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1300 మందిలో కొంతమంది యుద్ధంలో వీరమరణం పొందారు. వివిధ కారణాలతో మరో 350 చనిపోయారు. మన జిల్లాకు చెందిన పలువురు సైనికులు 1965లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో, 1977లో జరిగిన బంగ్లాదేశ్ విభజన సమయంలో, 1999 కార్గిల్ యుద్ధంలో, 2021లో చైనా బలగాలను నిలువరించిన ఘటనలో పాల్గొన్నారు. నల్లగొండ, సూర్యాపేట ప్రాంతానికన్నా భువనగిరి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో సైన్యంలో చేరుతున్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెంలో 15 మంది మాజీ సైనికులు ఉన్నారు. ముగ్గురు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా.. త్రివిధ దళాల్లో పనిచేసిన పలువురు రిటైర్డ్ అయిన తరువాత ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా పనిచేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారత వాయుసేనలో మిగ్ యుద్ధవిమానం ఫైలెట్‌గా పనిచేశారు. శాలిగౌరారం మండలం ఇటుకులపహాడ్ సర్పంచ్ సైదులు సైన్యంలో పనిచేసినవాడే. హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సుధాకర్ కూడా సైన్యంలో పనిచేశారు. ఇలా చాలా మంది ఉన్నారు. అల్లి గంగరాజు, అల్లి సైదులు, అల్లి వెంకటేశ్వర్లు దేశసేవకు ఆ కుటుంబం అంకితం ఆర్మీలో ఉద్యోగం అంటేనే బయపడే కాలంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మారుమూల గ్రామంలో పుట్టిపెరిగి, ఒకే ఇంటి నుంచి ముగ్గురు అన్నదమ్ములు దేశసేవ కోసం సైన్యంలో చేరి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగ విరమణ పొందగా మరొకరు దేశమాత సేవలోనే ఉన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపçహాడ్ గ్రామానికి చెందిన అల్లి రామచంద్రయ్య– లక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు సైదులు, వెంకటేశ్వర్లు, గంగరాజు, సురేష్ ఉన్నారు. పెద్ద కుమారుడు సైదులు 1998లో తొలిప్రయత్నంలోనే ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. అన్నను స్పూర్తిగా తీసుకొని తమ్ముళ్లు వెంకటేశ్వర్లు 2005లో గంగరాజు 2011లో సైన్యంలో చేరారు. నాలుగవవాడైన సురేష్ అన్ని రకాల పరీక్షలు పాసై ఆర్మీలో చేరుదామనుకొనే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉద్యోగంలో చేరలేకపోయాడు. అతను ఇంటి వద్ద ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 1998లో ఉద్యోగంలో చేరిన సైదులు 2014లో నాయక్ హోదాలో ఉద్యోగ విరమణ పొందాడు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై సేవలందిస్తున్నాడు. వెంకటేశ్వర్లు 2022లో లాన్స్‌నాయక్ హోదాలో రిటైర్ అయ్యాడు. గ్రామంలోనే ఉండి సైన్యంలో చేరాలనుకుంటున్న వారికి శిక్షణ ఇస్తున్నాడు. గంగరాజు ప్రస్తుతం హవాల్దార్ హోదాలో జమూకశ్మీర్‌లో పనిచేస్తున్నాడు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి చెందిన మరో ఐదుగురు యువకులు సైన్యంలో చేరారు. క్రమశిక్షణ అలవడుతుంది ఆర్మీ ఉద్యోగం అంటేనే క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు మారుపేరు. సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరూ కఠోర శిక్షణతో పాటు శరీరదారుఢ్యం, మానసికస్థైర్యం, ఆత్మరక్షణలో రాటుదేలుతారు. నేడు సైన్యంలో చేరేందుకు యువత ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఇది దేశరక్షణకు మంచి పరిణామంగానే భావించవచ్చు. నాడు సైన్యంలో చేరేందుకు ఒక్క ఉద్యోగానికి 10 మంది పోటీపడితే నేడు సైన్యంలో ఒక్క ఉద్యోగానికి వందల సంఖ్యలో పోటీపడుతున్నారు. – అల్లి సైదులు, మాజీ సైనికుడు, ఇటుకులపహాడ్ సర్పంచ్ సైనిక నియామకాల కోసం ప్రభుత్వం ఇటీవల కొత్తగా ‘అగ్నిపథ్’ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో చేరడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి దాదాపు 7000 మంది యువకులు ముందుకొచ్చారు. వీరికి ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు పూర్తి కాగా త్వరలో రాత పరీక్ష జరుగుతుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురానికి చెందిన మాజీ సైనికుడు కల్నల్ డాక్టర్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘ది షోల్జర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో వివిధ అంశాలలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. 2020 సంవత్సరం జూన్‌లో చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు ఆదుకుంటున్నామా.. యుక్త వయస్సులో అన్నీ వదులుకొని దేశసేవ కోసం పనిచేసిన సైనికులు రిటైర్డ్ అయిన తరువాత వారికి అందాల్సిన సౌకర్యాలు సక్రమంగా అందడం లేదనే విమర్శలున్నాయి. మాజీ సైనికుల డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయి. చాలా మంది తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ సైనికుల డిమాండ్స్ ఇవీ.. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 2 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి. మాజీ సైనికులకు కేటాయించిన ఉద్యోగాలు ఒకసారి భర్తీ కాకుంటే వాటిని బ్యాక్లాగ్ చేసి మళ్లీ మాజీ సైనికులకే కేటాయించాలి. మాజీ సైనికుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలి. ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించాలి. రాయితీ మీద మాజీ సైనికులకు ఇచ్చే సరుకుల కోసం ఉమ్మడి జిల్లాలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. సరుకుల కోసం హైదరాబాద్‌కు వెళ్లి రావడం ఇబ్బందిగా ఉంది. ఉమ్మడి జిల్లాలో మాజీ సైనికులకు స్మారక చిహ్నం నిర్మించాలి. మాజీ సైనికులకు జీఓ నంబర్ 69 ప్రకారం సత్వరమే అన్ని సౌకర్యాలు కల్పించాలి. దేశసేవకు మించిన తృప్తి మరొకటి లేదు దేశం కోసం పనిచేయడానికి మించిన తృప్తి దేనిలోనూ ఉండదు. ఇటీవల ఆగ్నిపథ్ నియామకాల కోసం సూర్యాపేట జిల్లా నుంచి నేను ఏర్పాటు చేసిన ‘ది షోల్జర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సహకారంతో 225 మందికి శిక్షణ ఇవ్వగా తుది రాత పరీక్షకు 167 మంది ఎంపికయ్యారు. ఇది ఆనందించదగ్గ విషయం. యువత ఇంకా ముందుకు రావాలి. – రిటైర్డ్ కల్నల్ సుంకర శ్రీనివాసరావు, విజయరాఘవాపురం, మునగాల దేశం రుణం తీర్చుకున్నా సైన్యంలో పనిచేసి దేశం రుణం తీర్చుకున్న తృప్తి మిగిలింది. నేను చదువుకునే రోజుల్లో సికింద్రాబాద్ వెళ్లాను. అక్కడ మిలటరీ వారిని చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నాను. 20 సంవత్సరాల వయస్సులో 1962లో సైన్యంలో చేరాను. 1965లో పాకిస్తాన్ యుద్ధంలో, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నా. 1977లో రిటైర్డ్ అయ్యాను. తరువాత ఫైర్ ఆఫీసర్‌గా పనిచేశాను. రెండు యుద్ధాల్లో పాల్గొని దేశం కోసం పనిచేసిన తృప్తి ఎప్పటికీ ఉంటుంది. యువత కూడా దేశం కోసం పనిచేయడానికి ముందుకు రావాలి. – సంధి పాపిరెడ్డి, అయిటిపాముల, కట్టంగూర్ మండలం (చదవండి: టోల్ ప్లాజాకు ‘పండుగ’) -
‘ఆర్మీ డే’ వేడుకలకు అతిథిగా ఏడున్నరేళ్ల న్యోరా
సాక్షి, కంటోన్మెంట్ (హైదరాబాద్): ఓ చిన్నారికి ప్రధానమంత్రి కార్యాలయం మరచిపోలేని బహుమతిని అందజేసింది. మన ఆర్మీ ప్రత్యేక గౌరవం ప్రదర్శించింది. సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఆర్మీ డే వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. చిన్నారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. వివరాలు... నగరానికి చెందిన సమీర్ పాత్ర, వర్ష పాత్రల కుమార్తె న్యోరా పాత్ర గతేడాది రిపబ్లిక్ డే వేడుకలను టీవీల్లో చూసి ఆర్మీ పట్ల అభిమానాన్ని పెంచుకుంది. ఆర్మీ దుస్తులు ధరించి తనను తాను సైనికురాలిగా ఊహించుకునేది. ఆర్మీకి సంబంధించి వందలాది పెయింటింగ్‌లు వేస్తూ గడిపేది. అంతటితో ఆగకుండా తాను ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని తల్లిదండ్రులను కోరుతూ వచ్చింది. తల్లిదండ్రులు ఆమె కోరికను వ్యక్తపరుస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ మెయిల్స్, లేఖలు రాశారు. న్యోరాకు ఇండిపెండెంట్ డే లేదా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు ప్రధాన మంత్రి కార్యాలయ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. పీఎంవో ఆదేశాల మేరకు శుక్రవారం జరిగిన ఆర్మీ డే, ఆర్మీ వెటరన్స్ డే వేడుకలకు ఆర్మీ అధికారులు న్యోరాను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. కల్నల్ ర్యాంకు అధికారి, ఇద్దరు సోల్జర్స్ ఆధ్వర్యంలో న్యోరాకు భద్రత కల్పిస్తూ ఆమెను సికింద్రాబాద్‌లోని వీరుల సైనిక స్మారకం వార్ మెమోరియల్‌కు తీసుకొచ్చారు. ఓ యువరాణిలా న్యోరాను గౌరవిస్తూ ఆప్యాయ పలకరింపులు, ఆమెతో ఫొటోలు దిగుతూ మరింత ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా న్యోరాతో కలసి ఆర్మీ ఉన్నతాధికారులు అమరవీరులకు సైనిక వందనం సమర్పించారు. -
మా ఓపికను పరీక్షించొద్దు!
న్యూఢిల్లీ: భారత్ ఓపికను పరీక్షించే సాహసం చేయవద్దని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. ఉత్తర సరిహద్దులో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని వ్యాఖ్యానించారు. లద్దాఖ్ లో చైనాతో ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితుల్లో జనరల్ నరవణె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్లో శుక్రవారం జరిగిన ఆర్మీ డే పరేడ్ కార్యక్రమంలో జనరల్ నరవణె పాల్గొన్నారు. గత సంవత్సరం జూన్‌లో లద్దాఖ్‌లో ‘గల్వాన్ హీరోలు’ చేసిన ప్రాణత్యాగం వృధా పోదని, దేశ సమగ్రత, సార్వభౌమత్వం, రక్షణకు ప్రమాదం వాటిల్లనివ్వబోమని స్పష్టం చేశారు. ‘తీవ్రమైన చలి పరిస్థితుల్లోనూ తూర్పు లద్దాఖ్‌ల్లో విధుల్లో ఉన్న భారత సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతినలేదు. అక్కడి పర్వతాల కన్నా ఎత్తుగా వారి ధైర్య, సాహసాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘చర్చలు, రాజకీయ ప్రయత్నాల ద్వారా సమస్యలు పరిష్కారమవ్వాలనే మేం కోరుకుంటాం. అయితే, మా ఓపికను పరీక్షించే తప్పు ఎవరూ చేయవద్దు’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉందని పాకిస్తాన్‌పై ఆయన మండిపడ్డారు. -
కరోనా: ఇరాన్ పరేడ్
టెహరాన్: అవసరమైన ఆయుధం ఏదో, అహంకార ప్రదర్శన ఏదో ప్రపంచానికి ఇప్పుడు తెలిసి వస్తోంది. అసలైన శత్రువులు విపత్తులేనని సాటి దేశాలు కాదని గుర్తిస్తున్నాయి. అందుకు నిదర్శనమే శనివారం (ఏప్రిల్ 18) నాడు జరిగిన ఇరాన్ ఆర్మీ డే పరేడ్. ఆయుధ సంపత్తిని ప్రదర్శించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఇరాన్ రోగ క్రిమి సంహారక వాహనాలు, సంచార ఆసుపత్రులు, వైద్య చికిత్సా పరికరాలను పరేడ్ చేయించింది. ఆర్మీ కమాండర్ లు ముఖాలకు మాస్కులు ధరించి ఈ పరేడ్‌కు హాజరయ్యారు. సాధారణంగా ఆర్మీ డే పరేడ్ లో శతఘ్నులు, సాయుధ కవచ శకటాలు ఉంటాయి. అలా కాకుండా కరోనాపై యుద్ధంలో సైన్యం కీలకమైన పాత్ర పోషించవలసి ఉంటుందని చెప్పడానికి ఇరాన్ ఇలా సంకేతాత్మకంగా ‘ఆరోగ్య అత్యవసర స్థితి’ని ప్రదర్శనకు పెట్టింది. -
షిపబ్లిక్డే
జనవరి పదిహేను మనకు సంక్రాంతి. దేశానికి ఆర్మీ డే. సంక్రాంతికి మకరజ్యోతి కనిపిస్తుంది. ఆర్మీడేకి పరేడ్ గ్రౌండ్ నుంచి పదఘట్టన వినిపిస్తుంది. ఈ ఏడాది ఆ పదఘట్టనల్ని నడిపించిన చోదక జ్యోతి.. తాన్యా షేర్గిల్. ఆర్మీ డేలో తొలి మహిళగా పురుష సైనిక దళాన్ని కవాతు చేయించిన తాన్యా.. ఇప్పుడిక రిపబ్లిక్ డే కవాతుకు తొలి మహిళా ‘పరేడ్ ఆడ్జుటెంట్’గా ముందుండబోతున్నారు. నాన్న ఆర్మీ. తాత ఆర్మీ. ముత్తాత ఆర్మీ. తాన్యా షేర్గిల్ ఆర్మీ. అయితే ఇది కాదు స్టోరీ. పంజాబ్‌లో ఆర్మీవాళ్లు ఎక్కువగానే ఉంటారు. ‘షేర్గిల్’ అనే ఇంటి పేరున్నవాళ్లు కూడా ఎక్కువే. షేర్గిల్ కుటుంబీకులు ప్రపంచంలో ఉన్నత స్థానాలలో ఉన్నారు. అన్నిటికన్నా అత్యున్నత స్థానం.. ఆర్మీ! తాన్యా కూడా ఈ అత్యున్నత స్థానాన్నే కోరుకున్నారు. కోరుకుని, ఆర్మీలో చేరారు కానీ.. బుధవారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్మీ డే’ కవాతులో.. ఆల్–మెన్ కంటింజెంట్ (అందరూ పురుషులే ఉండే సైనికదళం) ను ముందుండి నడిపించే అవకాశం వస్తుందని మాత్రం తాన్యా ఊహించనేలేదు. కోరుకున్నది దొరికితే సంతోషం లభిస్తుంది. ఊహించనిది అందితే..? జాతీయ పతాకంలా మనసు రెపరెపలాడుతుంది. ఆర్మీ డేలో తొలి మహిళ ఏడు దశాబ్దాలుగా ఢిల్లీలో ఆర్మీ డే కవాతు జరుగుతోంది. అన్ని కవాతుల్నీ పురుషులే నడిపించారు. తొలిసారిగా మొన్నటి 72వ ఆర్మీడే కవాతును ఒక మహిళ నడిపించింది. ఆమే తాన్యా షేర్గిల్. అయితే ఇది కూడా కాదు స్టోరీ. ఈ ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాల పెరేడ్‌ను కూడా తాన్యానే లీడ్ చెయ్యబోతున్నారు! తొలి మహిళగా!! గత ఏడాది రిపబ్లిక్ డే కి కూడా ఒక తొలి మహిళ పేరు విన్నాం కదా. మరి ఆమె ఎవరు? లెఫ్ట్‌నెంట్ భావనా కస్తూరి. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆల్–మెన్ ఆర్మీ కంటింజెంట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళ. (ఆర్మీ డేలో ఆల్–మెన్ కంటింజెంట్‌కు సార్థ్యం వహించిన తొలి మహిళ తాన్యా). భావన తొలి మహిళా లెఫ్ట్‌నెంట్‌గా రిపబ్లిక్ డేలో పురుష దళాన్ని ముందుండి నడిపిస్తే.. తాన్యా షేర్గిల్ తొలి మహిళా ‘పరేడ్ ఆడ్జుటెంట్’గా ఈ ఏడాది రిపబ్లిక్ డే కవాతును నిర్వహించబోతున్నారు. భావన ఒక్క రిపబ్లిక్ డే కే తొలి మహిళ. తాన్యా.. ఆర్మీ డేకి, రిపబ్లిక్ డేకి కూడా తొలి మహిళ. ఇదేమీ ఎక్కువ తక్కువల లెక్క కాదు. పోయిన ఏడాదే తొలి మహిళ అన్నారు కదా.. మళ్లీ ఏమిటి ఈ తొలి మహిళ అనే సందేహం రాకుండా ఉండడం కోసం. పరేడ్ ఆడ్జుటెంట్ అంటే కవాతు నిర్వహణ బాధ్యత గల సైనిక అధికారి! రిపబ్లిక్ డేకీ సారథ్యం తాన్యా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లో పట్టభద్రురాలు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాక 2017 మార్చిలో సైనిక దళంలోని ‘ఆర్మీ కోర్స్ ఆఫ్ సిగ్నల్స్’ విభాగంలో చేరారు. ఇప్పుడామె ఆర్మీ కెప్టెన్. కెప్టెన్ తాన్యా షేర్గిల్. ఈ నెల 26 ఆదివారం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్ ఆడ్జుటెంట్ ఆఫీసర్‌గా తాన్యా కవాతు చేయించబోయే దళంలో గొప్పగొప్ప సైనిక వ్యవస్థలే ఉండబోతున్నాయి. అంతకన్నా ముందు ఆమె ఆ కవాతును ఎవరెవరి ముందు నిర్వహిస్తారో చూడండి.కమాండర్–ఇన్– చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్.. మన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఆయన ఉంటారు. త్రివిధ దళాధిపతులు.. జనరల్ మనోజ్ ముకుంద్ నవరణె (ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ (నేవీ), మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా (ఎయిర్ ఫోర్స్).. ఈ ముగ్గురూ ఉంటారు.‘చీఫ్’ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉంటారు. భారత రక్షణ దళంలో ఈ ఏడాది కొత్తగా వచ్చి చేరిన హోదా.. ‘చీఫ్’ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇక ప్రధాని, రక్షణశాఖ మంత్రి ఎలాగూ ఉంటారు. వాళ్లతో పాటు ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో! ఇంతమంది అసామాన్యులు, అతిరథులు ఉన్న పరేడ్‌లో తాన్యా షేర్గిల్ సర్వసత్తాక సార్వభౌమాధికారం గల తన దేశపు శక్తి సామర్థ్యాలు ఎలాంటివో పరేడ్ ఆడ్జుటెంట్గా చూపించబోతున్నారు. అరుదైన అవకాశం! మహిళగా తాన్యాకు గర్వకారణమైన బాధ్యత. ఆమె తండ్రి 101 మీడియం రెజిమెంట్ (ఆర్టిలరీ)లో చేశారు. ఆమె తాత 14వ ఆర్మ్డ్ రెజిమెంట్ (సిందే హార్స్)లో చేశారు. ఆమె ముత్తాత సిక్కు రెజిమెంట్‌లో చేశారు. వాళ్లకంటే ఎలాగూ గర్వకారణమే. తమ వంశంలోని అమ్మాయి.. అని. తాన్యా నడిపించబోతున్న పెరేడ్లో ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్ బి.ఎం.పి–2కె (18 మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ), ధనుష్ గన్ సిస్టమ్, కోర్స్ ఆఫ్ సిగ్నల్స్, సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ, కుమావున్ రెజిమెంట్, గ్రెనడియర్స్, పారాచ్యూట్ రెజిమెంట్ ఉన్నాయి. మనమిక వేచి చూడవలసింది.. ఈ దేశ రక్షణ బలగాలను ఒక యువతి ముందుండి నడిపించే ఒక అపురూపమైన గణతంత్ర దినోత్సవ దృశ్యం కోసం. -
పార్లమెంటు ఓకే అంటే పీఓకేనూ సాధిస్తాం
న్యూఢిల్లీ: ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మొత్తం భారత్‌లో అంతర్భాగమని పార్లమెంటు ఎప్పుడో తీర్మానం చేసింది. ఒకవేళ ఆ భూభాగం మళ్లీ మన స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తే కచ్చితంగా ఆ విషయంపై చర్యలు చేపడతాం’ అని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే స్పష్టం చేశారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 13 లక్షల మంది ఉన్న ఆర్మీ.. రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. పీఠికలోని విషయాలకు లోబడి ఉంటుందన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గ్రేట్.. త్రివిధ దళాలన్నింటినీ సమన్వయ పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నరవాణే చెప్పారు. ఇది విజయవంతం అయ్యేందుకు ఆర్మీ తరఫున సహాయసహకారాలు అందిస్తామన్నారు. భారత సైన్యం పాక్‌లా దొంగ దెబ్బ తీయదని, నైపుణ్యంతోనే పని చేస్తుందని చెప్పారు. నైతిక విలువలకు సైన్యం కట్టుబడి ఉంటుందన్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేలను మూడింటినీ సమన్వయం చేస్తూ.. మిలటరీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఏకైక సలహాదారుగా సీడీఎస్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఓ కన్నేసి ఉంచాలి.. ఆర్మీకి సైనికులే బలమని నరవాణే చెప్పారు. ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, ఎలాంటి వారు ఉన్నారన్నదే తమ మంత్రమని చెప్పారు. ఇదే సైనిక ఆయుధాలకూ వర్తిస్తుందన్నారు. భారత బలగాలు సియాచిన్ ప్రాంతంలో ఓ కన్నేసి ఉంచాలని నరవాణే వ్యాఖ్యానించారు. పాక్, చైనాల మధ్య ఈ ప్రాంతం గురించి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
వారి సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. జవాన్ల ధైర్య, సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. సైనికులకు, వారి కుటుంబ సభ్యలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు భారత జవాన్లకు ఆర్మీడే శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఆర్మీ ‘డే’ నేపథ్యం.. 1948వ సంవత్సరం చిట్టచివరి బ్రిటీష్ కమాండర్ ‘సర్ ఫ్రాన్సిస్ బచ్చర్’ నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కరియప్ప జనవరి 15వ తేదీన దేశ సైనికాధికారి బాధ్యతలు స్వీకరించారు. దీంతో విదేశీ సైనిక పాలన నుంచీ దేశానికి విముక్తి లభించినట్లయింది. అందుకు గుర్తుగా ప్రతి ఏటా ‘జనవరి 15న’ ఆర్మీడే జరుపుకొంటున్నాం. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు సైతం అందజేస్తారు. (సైనికుడా.. వందనం) With deep respect, I extend my heartfelt gratitude towards our brave soldiers & their families and salute their courage and valour#ArmyDay pic.twitter.com/dGym8HT4p5 — KTR (@KTRTRS) 15 January 2019 -
సైనికుడా.. వందనం
భైంసాటౌన్(ముథోల్) : మనం ఈరోజు ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం భారత సైనికులు.. 24 గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, కాశ్మీరు మంచును, మేఘాలయా వర్షాలను లెక్కచేయకుండా దేశరక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు. కోట్లాది భారతీయుల కోసం తమ కుటుంబాలకు దూరంగా మంచుగడ్డల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. కేవలం దేశరక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్నారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్నే అయినా.. దేశాన్ని కాపాడేది సైనికుడు.. అందుకే ముందుగా జై జవాన్, ఆ తరువాతే జై కిసాన్ అన్నారు. దేశసేవ కోసం జిల్లా నుంచి ఎంతోమంది సైనికులు సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 15న సైనిక దినోత్సవం. నిరంతరం దేశానికి కాపలా కాసే సైనికులను స్మరించుకునే రోజు ఇది. ఈ నేపథ్యంలో కథనం.. ఆర్మీ ‘డే’ నేపథ్యం.. అనేక పోరాటాల ఫలితంగా 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు. స్వాతంత్య్ర భారతదేశాన్ని భారత సైనికులు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. 1948లో చివరి బ్రిటిషన్ కమాండర్ జనరల్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారతదేశ మొట్టమొదటి సైనిక కమాండర్‌గా కేఎం కరియప్ప జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఈ రోజున ‘జాతీయ సైనిక దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు సైతం అందజేస్తారు. ప్రభుత్వాలు ప్రోత్సహించాలి దేశరక్షణలో భాగంగా విధులు నిర్వర్తించే జవాన్లకు ప్రభుత్వం వారి పదవీ విరమణ అనంతరం ఐదెకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూమి కేటాయిస్తాయి. అయితే గతంలో పదవీ విరమణకు ముందే జవాన్లకు ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించేది. కానీ 2009 నుంచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆర్మీ జవాన్లకు పదవీ విరమణ తరువాతే భూమి కేటాయించాలని నిర్ణయించింది. దీంతో గతంలో మాదిరే ముందుగానే ప్రభుత్వం భూమిని కేటాయించాలని జవాన్లు కోరుతున్నారు. తమపై ఆధారపడే కుటుంబసభ్యులకు చేదోడువాదోడుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగానే ఐదెకరాల స్థలం కేటాయిస్తే ఎందరో యువకులు దేశరక్షణలో పాలు పంచుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు సైతం యువత దేశరక్షణలో రాణించేలా వారిని ప్రోత్సహించాలని జవాన్లు కోరుతున్నారు. లక్ష్యమే కనిపించింది మాది భైంసా మండలం లింగా 2 గ్రామం. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పాక్ కాల్పుల్లో నాచేతి నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయమైంది. ఆ రోజు చుట్టూ పొగమంచు ఆవరించి ఉంది. కాసేపు ఏం జరిగిందో తెలియలేదు. శత్రువుల నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తున్నా సుమారు గంటసేపు ఉగ్రమూకలతో పోరాడా. గాయాలు కావడంతో సైనిక అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చారు. చికిత్స పొందాలని సూచించడంతో స్వగ్రామానికి వచ్చా. – దుప్పి విశ్వనాథ్, జవాను, లింగ 2 యూనిఫాం అంటే ఇష్టంతో.. మాది నిర్మల్ జిల్లా ఖానా పూర్లోని శాంతినగర్. అమ్మ లక్ష్మి, నాన్న నర్సయ్య వ్యవసాయం చేస్తారు. నేను కూడా వ్యవసాయంలో నాన్నకు సాయం చేస్తూ చదువుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యూనిఫాం జాబ్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కసి ఉండేది. మొదటగా కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు. అయితే తరువాత కఠోర సాధనతో 2008లో ఆర్మీ రిక్రూట్మెంట్లో మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యాను. ప్రస్తుతం పంజాబ్‌లో విధులు నిర్వర్తిస్తున్నా. – కడుకుంట్ల ప్రవీణ్‌కుమార్, జవాన్ దేశసేవ కోసమే మాది భైంసాలోని కిసాన్‌గల్లి. అమ్మ గంగాబాయి, నాన్న రాములు. పదోతరగతి వరకు భైంసాలోని సరస్వతి శిశుమందిర్‌లో విద్యాభ్యాసం జరిగింది. 2002లో ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యా. ప్రస్తుతం నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. – కార్తీక్, నాయక్, భైంసా జైహింద్ మన నినాదం కావాలి మాది భైంసా పట్టణంలో ని గణేశ్‌నగర్. అమ్మ భూ మాబాయి, నాన్న సాయ న్న. అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నా విద్యాభ్యాసం భైంసాలోని సర స్వతి శిశుమందిర్‌లో సాగింది. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు ఎక్కువ. 2000 సంవత్సరంలో ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యా. ప్రస్తుతం హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. పిల్లలకు గుడ్‌మార్నింగ్, గుడ్నైట్లకు బదులు జైహింద్, జైభారత్ అనే నినాదాలు నేర్పించాలి. దీంతో వారిలో దేశం పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. – ఆకుల దత్తాత్రి, హవల్దార్, భైంసా -
జవాన్ ర్యాంకులు.. దేశ రక్షణకు జేజేలు
సైనికుడు.. 130 కోట్ల మంది భారతీయులకు రక్షణ కవచంలా ఉంటూ.. తన కుటుంబానికి దూరంగా గడిపే శ్రామికుడు. అలాంటి జవాన్ గురించి ఎంత పొగిడినా తక్కువే. ప్రాణాల్ని పణంగా పెడుతూ.. దేశం కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీలో సేవల్ని గుర్తిస్తూ ర్యాంకులు ఇస్తుంటారు.ప్రభుత్వం తరఫున వారు పొందే ర్యాంకులు, పతకాల గురించి ఆర్మీ డే సందర్భంగా తెలుసుకుందాం.. విశాఖపట్నం: దాయాది దేశం పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధానికి ఆర్మీ రంగానికి సారథ్యం వహించిన ఆర్మీ చీఫ్ ఎస్‌హెచ్‌ఎఫ్‌జె మానిక్‌షా. యుద్ధ రంగంలో ఆయన చూపిన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా రక్షణ శాఖలో తొలిసారిగా ఫీల్డ్ మార్షల్ హోదాను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రక్షణ శాఖలో అత్యున్నత స్థానం కూడా ఫీల్డ్ మార్షల్ హోదానే. 1973 జనవరి 1వ తేదీన ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన మానిక్ షా 15 రోజుల తర్వాత పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన కేఎం కరియప్పకు ఈ హోదాను అందించారు. రక్షణ రంగంలో ఆర్మీ విభాగంలో లెఫ్టినెంట్ హోదా నుంచి జనరల్ వరకూ పదోన్నతులు ఉంటాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) ఆర్మీలో ద్వితీయ శ్రేణి ర్యాంకింగ్‌లో మొదటిది జేసీవో. ద్వితీయ శ్రేణి ర్యాంకింగ్‌లో ఉన్న వారందరినీ జేసీవోలుగా పిలుస్తారు. బ్రిటిష్ పాలకులు రాజ్యమేలుతున్న సమయంలో భారతీయ సిపాయిలకు ఆదేశాలు జారీ చేసే విషయంలో తలెత్తిన ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈ క్యాడర్‌ను ప్రవేశపెట్టారు. నాన్ కమిషన్డ్ ఆఫీసర్ (ఎన్సీవో) మూడో శ్రేణి అధికారి స్థాయిలో ఉన్న వారందరినీ నాన్ కమిషన్డ్ ఆఫీసర్లుగా పిలుస్తారు. ప్రతిభావంతులు, సీనియారిటీ ప్రాతిపదికన జవాన్లకు ఎన్సీవో ర్యాంకుని కేటాయిస్తారు. ప్రపంచంలోని కామన్వెల్త్ దేశాలన్నింటిలోనూ ఈ ర్యాంకు ఉంది. కుడి భుజానికి మాత్రమే వారు తమ బ్యాడ్జీలను ధరిస్తారు. ఆ తర్వాత కంపెనీ హవాల్దార్, మేజర్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్, రెజిమెంటల్ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్, రెజిమెంటల్ హవాల్దార్ మేజర్లు బ్యాడ్జీలను ధరిస్తారు. ♦ ఇన్ఫెన్ట్రీ దళాల్లో హవాల్దార్ నాయక్, లాన్స్ నాయక్, సిపాయిలు ఉంటారు. ♦ సాయుధ దళాల్లో దఫేదార్, లాన్స్ దఫేదార్, యాక్టింగ్ లాన్స్ దఫేదార్, సోపర్లు ఉంటారు. ♦ ప్రతి కంపెనీలో సీనియర్ హవాల్దార్లు ఇద్దరు, నాయక్‌లు 10 మంది, హవాల్దార్లు ఐదుగురు, లాన్స్ నాయక్‌లు 15 మంది ఉంటారు. కంపెనీ హవాల్దార్‌గా విధులు నిర్వర్తించే వారు... మేజర్ కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్‌గా పదోన్నతి పొందుతారు. సెల్యూట్‌లోనూ భేదాలు సిపాయిలు చేసే సెల్యూట్‌లోనూ హోదాలు తెలిసిపోతాయి. సమానమైన స్థాయిలో ఉన్న వారికి కేవలం చేతులతోనే సెల్యూట్ చేస్తారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, కెప్టెన్ స్థాయి అధికారులకు రైఫిల్‌తో సెల్యూట్ చేస్తారు. నాన్ కమిషన్డ్ ఆఫీసర్లకు సెల్యూట్ పొందే అవకాశం ఉండదు. మేజర్స్థాయి, ఆపై అధికారులకు మాత్రమే ఆయుధాలతో సెల్యూట్ చేస్తారు. కవాతు సమయంలో కమిషన్డ్ ఆఫీసర్లకు రైఫిల్‌తోనే సెల్యూట్ చెయ్యాలి. బ్రిగేడియర్ స్థాయి అధికారులకు జనరల్ సెల్యూట్, దేశ అధ్యక్షుడు, రాష్ట్ర గవర్నర్లకు జాతీయ పతాకంతో సెల్యూట్ చేస్తారు. ఈ సెల్యూట్‌ను మిలటరీ బ్యాండ్ సమక్షంలోనే చేస్తారు. ఒక్కో సెల్యూట్‌కు ఒక్కో రాగంతో మిలటరీ బ్యాండ్ వాయిస్తారు. ఈ విధంగా దేశ రక్షణ రంగంలో పనిచేసే సోల్జర్లకు, అధికారులకు వారి హోదాలకు తగ్గట్లుగా గౌరవం లభిస్తుంటుంది. -
దేశం గర్వించదగ్గది మన సైన్యం: రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: ఆర్మీ డే సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధనమంత్రి నరేంద్ర మోదిలు సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. పురుష, మహిళా సైన్యానికి, వారి కుటుంబీకులకు, వృద్ధులకు కూడా గ్రీటింగ్స్ తెలిపారు. మీరు దేశం గర్వించదగ్గ వారని, పౌరుల భద్రత పట్ల ఎంతో జాగరూకత వహిస్తారని రాష్ట్రపతి తన ట్విటర్లో కొనియాడారు. దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు సైనికులు కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోదీ తన ట్విటర్లో కొనియాడారు. ఆర్మీ డే సందర్భంగా వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పౌరులు కూడా ఎలాంటి అభిజాత్యం లేకుండా సైన్యం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారన్నారు. మన సైన్యం దేశాన్ని రక్షించడంలోనేగాక ప్రకృతి విలయాలు, ప్రమాదాలు సంభవించినపుడు ముందుండి మానవతా దృక్పథంలో సహాయక చర్యలు చేపడుతుంటుందని అన్నారు. 1949లో భారత్‌లో చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ సర్ ఫ్రాన్సిస్ బచర్ నుంచి మొదటి ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ గుర్తుగా ఏటా ఆర్మీడేను నిర్వహిస్తున్నారు. -
అమర జవాన్లకు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్మీ డే సందర్భంగా అమర జవాన్లకు సోమవారం త్రివిధ దళాధిపతులు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద పుప్పగుచ్ఛాలు ఉంచి అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ సునీల్ లంబా, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనావో తదితరులు అంజలి ఘటించారు. దేశరక్షణలో ప్రాణాలను కోల్పోయిన అమర వీరుల సేవలను స్మరణకు తెచ్చుకున్నారు. 1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ 'సర్ ఫ్రాన్సిస్ బచ్చర్' నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్-చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ కెఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు. అందుకు గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 15న ‘ఆర్మీ డే’ నిర్వహిస్తారు. -
చైనాతో ఎప్పటికైనా ముప్పే!
న్యూఢిల్లీ: ఇన్నాళ్లుగా పాకిస్తాన్ సరిహద్దుపై పెడుతున్న దృష్టిని ఇకపై చైనా సరిహద్దుపైకి మరల్చాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. పొరుగుదేశాలను మంచి చేసుకుని భారత్‌కు ఇబ్బందులు సృష్టించేందుకు చైనా పన్నుతున్న కుయుక్తులను తిప్పికొట్టాల్సి ఉందన్నారు. పొరుగుదేశాలతో సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా దూకుడుగా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆర్మీడే సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘చాలా కాలంగా భారత ప్రభుత్వం పశ్చిమ సరిహద్దులపై దృష్టిపెడుతూ వస్తోంది. ఇప్పుడు ఉత్తరాన ఉన్న చైనా సరిహద్దుపైనా దృష్టి సారించాలి. ఉత్తర ప్రాంతంలో మౌలికవసతుల కల్పన వేగం పెంచాలి. మిలటరీ పరంగా చైనానుంచి ఏనాటికైనా ముప్పు ఉంటుంది. దీనికి దీటైన సమధానమిస్తాం’ అని అన్నారు. ఆ దేశాలకు హృదయపూర్వక మద్దతు ‘నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ చైనాతో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టాలి. ఈ దేశాలు భారత్‌నుంచి దూరంగా వెళ్లేందుకు మనం అనుమతించకూడదు’ అని అన్నారు. డోక్లాంలో చైనా బలగాల మోహరింపు ఉత్తర డోక్లాంలో చైనా సైన్యాన్ని మోహరిస్తోందని ఆయన తెలిపారు. శీతాకాలం తర్వాత చైనా మిగిలిన సరిహద్దు కేంద్రాల్లోనూ బలగాలను మోహరించే అవకాశం ఉందని.. దీనికి అనుగుణంగానే భారత బలగాలు వ్యవహరిస్తాయన్నారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు డ్రాగన్ దే శం ప్రయత్నిస్తే సమర్థవంతంగా తిప్పికొట్టే శక్తి భారత ఆర్మీకి ఉందని పునరుద్ఘాటించారు. మదర్సాలు, మసీదులపై నియంత్రణ కశ్మీర్లో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో విద్యావ్యవస్థలో భారీమార్పులు తీసుకురావటంతోపాటు.. మసీదులు, మదర్సాలపై స్వల్ప నియంత్రణ అవసరమన్నారు. మరికొన్ని వివరాలు.. ► ఉగ్రవాద పోరులో అమరులైన వారి పిల్లల కోసం రెండు పాఠశాలల ఏర్పాటు. 3,4 ఏళ్లలో అమల్లోకి తెస్తాం. ► త్వరలోనే భారత, చైనా అధికారుల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)లు మాట్లాడుకునేందుకు హాట్‌లైన్ ఏర్పాటు. ► ప్రభుత్వం అనుమతిస్తే.. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులున్నాయంటూ చేస్తున్న బుకాయింపునకు సరైన సమాధానమిస్తాం. -
‘మళ్లీ తెగబడితే తగిన బుద్ధి చెబుతాం’
న్యూఢిల్లీ : భారత్ సరిహద్దు వెంట తాము శాంతిని కోరుకుంటున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఆర్మీ డే సందర్భంగా ఆయన సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడి అమరులైన జవాన్లకు సెల్యూట్ అని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడితే తాము తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇక జవాన్ల సమస్యల పరిష్కరానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అసవరం అయితే జవాన్లు తనను నేరుగా కూడా కలవొచ్చని రావత్ తెలిపారు. దివంగత సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్యకు గ్యాలంటరీ అవార్డు ప్రదానం చేశారు. (సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి లాన్స్‌నాయక్ హనుమంతప్ప వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.) అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. -
సైనికులకు మోదీ సెల్యూట్
న్యూఢిల్లీ: దేశం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడని సైనికులను చూస్తే గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత 69వ ఆర్మీడే సందర్భంగా సైనికులు, వారి కుటుంబాలకు మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, విపత్తుల సమయంలో సైన్యం అందించే సేవలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. 1949 జనవరి 15న భారత తొలి కమాండర్ ఇన్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ కేఎమ్ కరియప్ప నియమితులైన సందర్భానికి గుర్తుగా ప్రతియేటా జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. Indian Army always leads from the front, be it in protecting the sovereignty of our nation or helping citizens during natural disasters. — Narendra Modi (@narendramodi) 15 January 2017