సైనికులకు మోదీ సెల్యూట్
న్యూఢిల్లీ: దేశం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడని సైనికులను చూస్తే గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత 69వ ఆర్మీడే సందర్భంగా సైనికులు, వారి కుటుంబాలకు మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, విపత్తుల సమయంలో సైన్యం అందించే సేవలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు.
1949 జనవరి 15న భారత తొలి కమాండర్ ఇన్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ కేఎమ్ కరియప్ప నియమితులైన సందర్భానికి గుర్తుగా ప్రతియేటా జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Indian Army always leads from the front, be it in protecting the sovereignty of our nation or helping citizens during natural disasters.
— Narendra Modi (@narendramodi) 15 January 2017