‘మళ్లీ తెగబడితే తగిన బుద్ధి చెబుతాం’
న్యూఢిల్లీ : భారత్ సరిహద్దు వెంట తాము శాంతిని కోరుకుంటున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఆర్మీ డే సందర్భంగా ఆయన సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడి అమరులైన జవాన్లకు సెల్యూట్ అని అన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడితే తాము తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇక జవాన్ల సమస్యల పరిష్కరానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అసవరం అయితే జవాన్లు తనను నేరుగా కూడా కలవొచ్చని రావత్ తెలిపారు.
దివంగత సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్యకు గ్యాలంటరీ అవార్డు ప్రదానం చేశారు. (సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి లాన్స్‌నాయక్ హనుమంతప్ప వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.) అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు.