ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం
హైదరాబాద్ : ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్న బీజేపీ నేత నరేంద్రమోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని మోడీని కేసీఆర్ కోరగా... తప్పకుండా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కేసీఆర్‌తో నిమ్మగడ్డ భేటీ..
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, జీఎం ఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు కూడా కేసీఆర్ ను కలిసి అభినందించారు. ఇంకా సీనియర్ ఐఏఎస్ అధికారులు వి.నాగిరెడ్డి, బుర్రా వెంకటేశంతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు కలిసి అభినందనలు తెలిపారు.
మరో క్యాంపు కార్యాలయం కోసం అన్వేషణ
ఇప్పుడున్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బదులుగా ప్రత్యామ్నాయ క్యాంపు కార్యాలయం కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. బేగంపేటలో ప్రస్తుతమున్న సీఎం క్యాంపు కార్యాలయంలోకి మారడానికి కేసీఆర్ అయిష్టంగా ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు వెల్లడించారు. కుందన్‌బాగ్‌లో ఉన్న మంత్రుల క్వార్టర్లను రెండు, మూడు కలిపి లేదా లేక్‌వ్యూ అతిథి గృహాన్ని తెలంగాణ సీఎంకు క్యాంపు కార్యాలయంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చిన సంగతి తెలిసిందే.
కేసీఆర్‌కు మోడీ ఫోన్
Published Mon, May 19 2014 1:01 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement