మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి | Sachin pailot fires on modi and kcr | Sakshi
Sakshi News home page

మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి

Published Wed, Nov 18 2015 12:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి - Sakshi

మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి

స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్/జనగామ: ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని, నిరంకుశ పాలన సాగిస్తున్న వారి కళ్లు తెరిపించాలని కేంద్ర మాజీ మంత్రి, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్ అన్నారు. మంగళవారం ఆయన వరంగల్ జిల్లా జనగామలో విలేకరులతో, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక ప్రచార సభలో మాట్లాడారు.  నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూ సోనియూ తెలంగాణ ఇచ్చారన్నారు. చిన్న రాష్ట్రంతో ప్రజల జీవితాలు బాగుంటాయని ఆశించామని, అయితే రాష్ట్రం ఏర్పాటై 18 నెలలు గడుస్తున్నా కేసీఆర్ ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని విమర్శించారు.

ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని కోరారు. వరంగల్ ఉప ఎన్నిక ద్వారా బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు గుణపాఠం చెప్పాలని, ఈ ఎన్నిక దేశప్రజలకు సంకేతంగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయనను పార్టీ నాయకులు గజమాలతో సత్కరించి, గొంగళి, గొర్రెపిల్లను బహూకరించారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు రోజీజాన్ మాట్లాడుతూ.. బీజేపీ పాలన దేశ సమైక్యతను దెబ్బతీసేలా ఉందని, మతతత్వాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, ఓటమి భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు మాట్లాడారు. ఈ సందర్భంగా సభా వేదికపై ఉన్న రైతు కొమురయ్యను అతిథులు అభినందించారు. సభలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ,  కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, మాజీ కేంద్రమంత్రి పోరిక బల రాంనాయక్, నాయకులు గుండె విజయరామారావు, నంది ఎల్లయ్య,  మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మధుయాష్కీ పాల్గొన్నారు.

 ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాలు
 భువనగిరి: బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అతి తక్కువ కాలంలో ప్రజా విశ్వాసం కోల్పోయాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సచిన్‌పైలట్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఇందులో భాగంగానే మేధావులు, కళాకారులు తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారన్నారు. సోనియా, రాహుల్‌గాంధీ నాయకత్వంలో తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement