రిలే నిరాహారదీక్ష శిబిరంలో సంఘీభావం తెలుపుతున్న సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి
గుంతకల్లు టౌన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ పోరాట స్పూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. ఏపీకి హో దాను కాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారానికి 8వ రోజుకు చేరుకున్నాయి. మండలంలోని పాతకొత్తచెరువు, సంగాల, దోసలుడికి గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్యనాయకులు శివశంకర్, సంజప్ప, శివరామిరెడ్డి, సుధీర్, సుంకప్ప, కుమార్‌స్వామి, ఎంపిటీసీ మల్లికార్జున, రంగన్న, మోహన్, వై.నగేష్, కుబేంద్ర, సుధాకర్, బ్రహ్మయ్య, జనార్ధన్, రంగస్వామి, ఎ.మల్లికార్జున, లక్ష్మీనారాయణ, వై.నాగప్ప, సుంకన్న, లాల్‌రెడ్డి, నెట్టికంటయ్య, ఎర్రిస్వామి, శ్రీనివాసులు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వెంకటరామిరెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment