ఉద్యమకారులకు సంఘీభావం తెలుపుతున్నజి.భీమిరెడ్డి
మంత్రాలయం రూరల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని పార్టీ మండల అధ్యక్షుడు జి.భీమిరెడ్డి అన్నారు. హోదా సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజు శనివారం కొనసాగాయి. శనివారం నాటి దీక్షలో మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన దాసు, హనుమంతు, లక్ష్మయ్య, గోపీనాథ్, సత్తిరెడ్డి, మునెప్ప, నాగరాజు, వెంకోబా, సురేష్, వీరనాగుడు, అయ్పప్ప, రామాంజినేయులు, రామయ్య, తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజుతో పాటు మరి కొంత మంది కార్యకర్తలు కూర్చున్నారు. ముందుగా రాఘవేంద్రసర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం రాఘవేంద్రసర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శిబిరం చేరుకొని దీక్షపరులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనన్నారు. సాయంత్రం ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీఏ వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ టి.భీమయ్య, నాయకులు అశోక్‌రెడ్డి, జయరాము, ప్రహ్లాదయ్య శెట్టి, బద్రినాథ్‌శెట్టి, దామోదర్ శెట్టి, వెంకటేష్ శెట్టి, మారెప్ప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment