అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి
పత్తికొండ టౌన్ : దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని వైఎసాస్‌ర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి కోరారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్టీ పిలుపు మేరకు పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద, దీక్షా శిబిరం వద్ద ఆమె మాట్లాడారు. దుర్మార్గ ప్రభుత్వాలను శిక్షించి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. బీజేపీతో కలసి ఎన్నికల్లో పోటీచేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం పాటుపడకుండా నిద్రపోయారన్నారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నందున ప్రజల్లోకి వెళితే తరిమికొడతారనే భయంతో ఇపుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు. అధికారంలో ఉండి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ప్రత్యేక హోదా సాధించడం చేతకాక ధర్నాలు, ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీ, టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెపుతారన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు భీమలింగప్ప దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. సాయంత్రం కంగాటి శ్రీదేవి, సీపీఎం నాయకులు రంగారెడ్డి, వెంకటేశ్వర్లు రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, పత్తికొండ మాజీ సర్పంచ్ జి.సోమశేఖర్, చక్రాళ్ల సర్పంచ్ శ్రీరాములు, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు కారం నాగరాజు, రవికుమార్ నాయుడు, అంజి, రాంమోహన్‌రెడ్డి, నరసింహయ్య, ఆస్పరి రవిచంద్ర, హుసేన్, నజీర్, లాలు, షరీఫ్, బురుజుల భరత్‌రెడ్డి, కారుమంచి, దేవన్న, పెద్దహుల్తి నాగరాజు, పోతుగల్లు వెంకటేశ్, మల్లికార్జునరెడ్డి, రంగానాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
రిలే నిరాహారదీక్షలలో పాల్గొన్నవారు
పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన వై ఎస్సార్‌సీపీ నాయకులు బనగాని శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, జనార్దన్‌నాయుడు, వీరాంజనేయులు, సురేశ్‌బాబు, శాంతిరెడ్డి, వర్ధరాజులు, కృష్ణమూర్తి, కేశప్ప, నాగప్ప, నెట్టికంటయ్య, సిద్దు, విజయ్ దీక్షల్లో కూర్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment