అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నేతలు
డోన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు శనివారం బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి విన్నవించారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరి పోలీసుస్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్టీయూ రాష్ట్రమాజీ అధ్యక్షుడు షన్మూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అఖిలపక్ష నాయకుల సమావేశం...
ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని అఖిలపక్షపార్టీ నేతలు ప్రజలను కోరారు. స్థానిక ఎన్‌జీవోస్ హోంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రఫీ, శీను, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, కాంగ్రెస్ నేతలు ఓంప్రకాశ్, రవి, సీపీఐ నేతలు నక్కిశ్రీకాంత్, మోటారాముడు, శివప్రసాద్, సీపీఎం నాయకులు మద్దయ్య, రామాంజనేయులు, శివరాం, మహిళా సమాఖ్య నాయకురాల్లు సుగుణమ్మ, రహమ్మద్ బీ, మణి, జులేఖ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment