cenrtal government
-
ఏపీకి ప్రత్యేక హోదాపై.. కేంద్రమంత్రి సమాధానం ఇది!
సాక్షి, ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. కాగా, పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్‌సభలో మరోసారి వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీల ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాలు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు వ్యత్యాసం లేదన్నారు. -
ఆత్మనిర్భర్ 2.0
న్యూఢిల్లీ : దేశంలో రెండోసారి విధించిన లాక్‌డౌన్‌తో మందగించిన ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టేందుకు మరోసారి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ , ఆత్మనిర్భర్ 2ని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థికవేత్తలతో మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అవుతున్నారు. ప్యాకేజీ ఎలా ఉండాలి, ఏ రంగాలను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలనే ఈ సమావేశాల్లో చర్చిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ప్యాకేజీ ప్రకటించే విషయంపై ఢిల్లీలో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నది వాస్తవమే అయినా .. ఆత్మనిర్భర్ 2 ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మూడు రంగాలపై ఫోకస్ ఈసారి లాక్డౌన్ కారణంగా ఏవియేషన్, టూరిజం, ఆతిధ్యరంగాలు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగాలను ఆత్మనిర్భర్ 2 ద్వారా ఆదుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీటితో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం తీవ్రంగా నష్టపోయాయని, వీటికి సైతం ఆర్థిక సహకారం అందివ్వాలని నిర్ణయించారు. రుణాల చెల్లింపుల విషయంలో వాణిజ్య, పారిశ్రామిక రంగానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే సూచించింది. ఇప్పుడే కాదు గతేడాది లాక్డౌన్, అన్‌లాక్ ప్రక్రియలను పూర్తిగా కేంద్రమే చేపట్టింది. ఈసారి లాక్డౌన్ విధింపు అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో లాక్డౌన్ విధించింది. కరోనా విలయం అదుపులోకి వచ్చి రాష్ట్రాలన్నీ లాన్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత... జరిగిన నష్టాన్ని అంచనా వేసి అప్పుడు ఆత్మనిర్భర్ 2 ప్యాకేజీని ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. -
11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 11న తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రేపు(గురువారం) సెలవు దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నికల రోజును సెలవు దినంగా ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. -
కేంద్ర ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించండి
డోన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిందని వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి విన్నవించారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వగృహం నుంచి ర్యాలీగా బయల్దేరి పోలీసుస్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్టీయూ రాష్ట్రమాజీ అధ్యక్షుడు షన్మూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష నాయకుల సమావేశం... ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని అఖిలపక్షపార్టీ నేతలు ప్రజలను కోరారు. స్థానిక ఎన్జీవోస్ హోంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రఫీ, శీను, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, కాంగ్రెస్ నేతలు ఓంప్రకాశ్, రవి, సీపీఐ నేతలు నక్కిశ్రీకాంత్, మోటారాముడు, శివప్రసాద్, సీపీఎం నాయకులు మద్దయ్య, రామాంజనేయులు, శివరాం, మహిళా సమాఖ్య నాయకురాల్లు సుగుణమ్మ, రహమ్మద్ బీ, మణి, జులేఖ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గజం భూమికి ఏడాది లీజు ఒక్క రూపాయే
దేశ రాజధానిలో గజం భూమి ఏడాదికి లీజుకు తీసుకుంటే ఎంత అవుతుంది? ఎవరికైనా ఏమో గానీ.. కేజ్రీవాల్ సర్కారుకు మాత్రం ఒక్క రూపాయికే ఇస్తామని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, నైట్ షెల్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఢిల్లీలో తమకు స్థలం దొరకడం లేదంటూ కేజ్రీవాల్ సర్కారు ఆరోపించడంతో.. దానికి సమాధానంగా ఇలాంటి వాటికి డీడీఏ ఏడాదికి గజం భూమికి ఒక్క రూపాయే లీజుకు ఇస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రజోపయోగ సేవల కోసం నామమాత్రపు ధరకే భూములు ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యాడ్స్ మాత్రమే ఇస్తోందని, తాము మాత్రం అభివృద్ధిని యాడ్ చేస్తూ వెళ్తున్నామని ఆయన కేజ్రీవాల్‌కు చురక వేశారు. కనీసం ఆస్పత్రులు కట్టాలన్నా తమకు భూములు దొరకడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. వాణిజ్యపరంగా అయితే చదరపు మీటరుకు లీజు రూ. 1.82 లక్షల నుంచి రూ. 6.72 లక్షల వరకు ఉంది. కనీసం లాభనష్టాలు లేని ప్రాతిపదికన అయినా చదరపు మీటరుకు రూ. 11,745 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో డీడీఏ నుంచి జోనల్ వేరియంట్ రేటు ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి భూములు అందుబాటులోకి వస్తాయి. కేవలం ఆస్పత్రులు, కార్యాలయాలకే కాక సిబ్బంది క్వార్టర్లు, స్కూళ్లు తదితరాలకు కూడా తక్కువ ధరలకే భూములు లీజుకు ఇస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు.