11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు | Central Government Declares Holiday On April 11 In Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

11న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

Published Wed, Apr 10 2019 11:29 AM | Last Updated on Wed, Apr 10 2019 11:29 AM

Central Government Declares Holiday On April 11 In Andhra Pradesh And Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈ నెల 11న తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రేపు(గురువారం) సెలవు దినంగా ప్రకటిస్తూ కేంద్ర ‍ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నికల రోజును సెలవు దినంగా ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement