సాక్షి, బళ్లారి : మహానేత దివంగత డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా బళ్లారిలో ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ జగన్ అభిమానుల నేతృత్వంలో బళ్లారి నగరంలోని విద్యానగర్‌లో నవజీవన బుద్ధిమాంధ్య పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ అభిమానులు కృష్ణారెడ్డి, శేషారెడ్డి, ఉమాకాంతరెడ్డి నేతృత్వంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు వైఎస్‌ఆర్ సేవలను కొనియాడారు. అలాగే బళ్లారి ఆర్‌కే ఆస్పత్రిలో వైఎస్‌ఆర్ వర్ధంతిని జరుపుకున్నారు. ఆస్పత్రిలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిప్రసాద్‌రెడ్డి, వంశీకృష్ణ, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌తో చిన్ననాటి స్నేహం ఉన్న గోన్జాల్వేస్ కుటుంబ సభ్యుల నేతృత్వంలో ఈ ఏడాది కూడా బళ్లారిలో అన్నదానం నిర్వహించారు. మేరిమాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం అన్నదానం చేశారు. వైఎస్‌ఆర్ ఆత్మకు శాంతి కలగాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఘనంగా వైఎస్‌ఆర్‌కు నివాళులు
Published Wed, Sep 3 2014 3:41 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement