సాక్షి, అమరావతి : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు భావి తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. చిత్తశుద్ది, విశ్వాసం, శౌర్యం, ధైర్యం, వారసత్వం టంగుటూరి సొంతం అని ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని, తరతరాలకు ఆయన స్పూర్తిదాయకమని ట్విటర్‌లో పేర్కొన్నారు. (చదవండి : ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ)
అలాంటి దమ్మున్న నాయకుడు సీఎం జగన్ : విజయసాయిరెడ్డి
ప్రకాంశం పంతులు జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళర్పించారు. ‘నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడే నాయకులు రాజకీయాల్లో చాలా అరుదు. అలాంటి దమ్మున్న తొలితరం నాయకుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారైతే, నేటి తరం నాయకుడు ముఖ్యమంత్రి జగన్ గారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
A man of integrity, conviction & valor, whose legacy & narratives of courage continue to inspire generations in Andhra Pradesh; my humble tributes to the great freedom fighter & the first CM of AP, Andhra Kesari Tanguturi Prakasam Panthulu on his 148th birth anniversary.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2020
భావి తరాలకు టంగుటూరి స్ఫూర్తి ప్రదాత
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. భావి తరాలకు టంగుటూరి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. రాజకీయాల్లో విలువల కోసం ప్రజాసేవలో తరించారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment