Tanguturi Prakasam Pantulu
-
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.. సీఎం జగన్ నివాళి
అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొట్టతొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భాంగా ఆ మహనీయుడికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడని కొనియాడుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/oFfEdyidHz — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2023 ఇది కూడా చదవండి: అవును.. సీఎం జగన్ మహిళా పక్షపాతే -
ముఖ్యమంత్రిగా పని చేసి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని స్థితిలో..
స్వాతంత్య్రోద్యమ పోరాటంలో దమ్ముంటే కాల్చండి.. రండిరా అంటూ పోలీసులకే ఎదురెళ్లి చొక్కా విప్పి రొమ్ము చరిచి నిలబడ్డ ఘనుడు టంగుటూరి ప్రకాశం పంతులు. సంతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రజల కోసం తన యావదాస్తిని ఖర్చు చేసిన మహాశిలి ఈ ఆంధ్రకేసరి. కటిక పేదరికంలో జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన పట్టుదలతో బారిష్టర్ చదివి డబ్బు సంపాదించారు. ఆంధ్రరాష్ట తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు తన చివరి రోజుల్లో తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. కటిక పేదరికంలోనే కన్నుమూశారు. నిరుపేదల లాయర్ టంగుటూరి ప్రకాశం చివరి రోజుల్లో ఎంత ఇబ్బందులపాలయ్యాడో వివరించాడు సినీ గేయరచయిత టంగుటూరి వెంకట రామదాస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టంగుటూరి ప్రకాశం గొప్ప లాయర్. ఆయన న్యాయవాదిగా పని చేసేటప్పుడు ధనవంతుల దగ్గర ఎంత డబ్బు తీసుకునేవారో లేనివాళ్ల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు తన ఇంట్లో ఎవరో చనిపోయిన వార్త అందింది. పూలకు బదులు పండ్లు తేవచ్చుగా అయినా సరే ఆయన వెళ్లకపోవడంతో జడ్జి ఇంకా ఇక్కడే ఎందుకున్నావని అడిగారు. దానికాయన.. చనిపోయినవాళ్లను ఎలాగో తిరిగి తీసుకురాలేను. ఈ కేసు ఓడిపోతే వీరి జీవితం అన్యాయం అయిపోతుందని బదులిచ్చారు. అలాంటి నిస్వార్థ వ్యక్తి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని దయనీయస్థితిలో గడిపారు. కటిక దరిద్రంలో ప్రాణాలు విడిచారు. ఒకసారి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానం చేశారు. ఈ పూలకు బదులుగా అర డజను అరటిపండ్లు తెస్తే తినేవాడిని కదరా అన్నారు. ఆ మాటతో ఆయన వాస్తవ స్థితి అర్థమై అక్కడున్నవారంతా ఏడ్చేశారు. అలా సంపాదించిందంతా పోయింది ఈ పరిస్థితికి రావడానికి గల కారణం.. టంగుటూరి ప్రకాశంకు ఉన్న మితిమీరిన జాలి, దయాగుణం. ఎవరైనా సాయమడిగితే తన దగ్గర ఎంతుంటే అంత ఇచ్చేవారు. బీరువాలో ఎంతుంటే అది రెండు చేతులతో తీసిచ్చేవారు. తన కోసం, తన కుటుంబం కోసం ఏదీ దాచుకోలేదు. అలా సంపాదించిందంతా పోయింది' అని పేర్కొన్నారు. కాగా టంగుటూరి వెంకటరామదాస్.. కౌసల్య, గోదావరి, శివలింగాపురం, మహదేవపురం, ఆది నీవే అంతం నీవే, నీకు నేను నాకు నువ్వు వంటి పలు చిత్రాల్లో గేయ రచయితగా పని చేశారు. చదవండి: ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ప్లానింగ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! -
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఆయన వేసిన పునాదులు విశేషమైనవి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర సమరయోధులు, ధీశాలి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2022 -
గురు శిష్యులు ఒకే రోజు...
భారత స్వాతంత్య్ర సమరంలో నిరుపమాన పోరాటాలు చేసిన యోధులు బిపిన్ చంద్ర పాల్, టంగుటూరి ప్రకాశం పంతులు గురుశిష్యులలాంటివారు. వారిరువురూ మే 20వ తేదీనే అసువులు బాయడం కాకతాళీయమే! 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లాలోని వినోదరాయ పాలెంలో జన్మించిన ప్రకాశం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. బారిస్టర్ కోర్సు చదవడం కోసం 1907లో ఇంగ్లండ్ వెళ్లారు. ఇండియా వచ్చి న్యాయవాదిగా మంచి పేరూ, డబ్బూ సంపాదించారు. ఆ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు యువత స్వాతంత్య్ర సమరంలో దూకుతుండేవారు. ప్రకాశం పంతులు పాల్ ఉపన్యాసాలు విని... వేల రూపాయల ఆదాయం ఇచ్చే న్యాయ వాద వృత్తిని వదిలి స్వాతంత్య్రోద్యమంలో అడుగుపెట్టారు. కొన్ని రోజులు ‘స్వరాజ్య’ పత్రిక నడిపారు. గాంధీజీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహిం చారు. 1921 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, ఉపఖండంలో అనేక ప్రాంతాలు సందర్శించారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు మరణిస్తే పోలీసు వాళ్ళు అక్కడికి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రకాశం పంతులు అది చూసి చలించి పోలీసు వలయాలను ఛేదించుకొని అమర వీరుని దగ్గరికి వెళ్తూ చొక్కా గుండీలు తీసి తెల్లోడి తుపాకీ గుండుకు తన గుండెను చూపించి ఇక్కడ కాల్చమని సవాల్ విసిరారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన రాష్ట్ర ప్రజలు ‘ఆంధ్రకేసరి’ బిరుదునిచ్చారు.స్వాతంత్య్రానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1953–1954 మధ్య పని చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటిస్తూ... వడదెబ్బకు గురై హైదరాబాదులో హాస్పిటల్లో చేరి 1957 మే 20న తుది శ్వాస విడిచారు. జాతీయోద్యమంలో ప్రసిద్ధ ‘లాల్, బాల్, పాల్’ త్రయంలో బిపిన్ చంద్రపాల్ ఒకరు. అస్సాంలోని టీ తోటల్లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడంతో బిపిన్ చంద్రపాల్ ఉద్యమ ప్రస్థానం మొదలైంది. ‘వందేమాతరం’ ఉద్యమంలో భాగంగా దక్షిణ భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు. మచిలీపట్నంలో ‘ఆంధ్ర జాతీయ కళాశాల’ బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు, కృషి ఫలితంగానే స్థాపితమైంది. భారత అతివాద ఉద్యమకారుల్లో గ్రగామిగా ప్రసిద్ధి చెందిన బిపిన్ చంద్రపాల్ 1932 మే 20న మరణించారు. ప్రకాశం పంతులు, బిపిన్ చంద్రపాల్‌ల పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శప్రాయం. – కొమ్మాల సంధ్య, హన్మకొండ (మే 20న టంగుటూరి ప్రకాశం పంతులు, బిపిన్ చంద్రపాల్‌ల వర్ధంతి) -
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం టంగుటూరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు(మే 20). ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ‘తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: దావోస్ పర్యటనకు సీఎం వైఎస్ జగన్ తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2022 -
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150 వ జయంతి
-
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. సోమవారం(ఆగస్టు23వ తేదీ) టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించారు. ‘‘తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2021 చదవండి : నవ యుగానికి నాంది పలికిన జగన్ -
రాజకీయ క్షేత్రంలో ఒక కేసరి
ఒక నాయకుడికి ఎన్నో గొప్ప లక్షణాలు ఉండొచ్చు. కానీ ధైర్యం అనేమాటకు సమానార్థకంగా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్ తుపాకీకి ఎదురొడ్డి, చొక్కా విప్పి ఛాతీని చూపిస్తూ, దమ్ముంటే కాల్చమని ఆయన సవాల్ విసిరిన తీరు స్వాతంత్య్ర పోరాటంలో ఒక ఉత్తేజకర ఘట్టం. ప్రజలంటే నేనే, నేనంటేనే ప్రజ అనగలిగిన అతిశయం; తన మాటనే శాసనంగా చలాయించుకోగల అధికార దర్పం ఆయనకే చెల్లాయి. ప్రజల పట్ల ఉన్న షరతులు లేని మమకారమే దానికి కారణం అయ్యుండాలి. ఆంధ్రకేసరి అనేది కేవలం బిరుదనామం కాదు. ప్రజాక్షేత్రంలో సింహంలానే బతికారు. 150వ జయంతి వేడుకల సందర్భంగా ప్రకాశం పంతులుకు భారతరత్న ప్రకటించడమే ఆయనకు ఇవ్వగలిగే సరైన నివాళి. స్వతంత్య్ర భారతావనికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ ఇది. ఈ వేడుకలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్’ 75 వారాల పాటు జరుపు కోవాలని శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలు ముఖ్యంగా అటు పాలకులు, ఇటు పాలితులు మన గొప్ప దేశ భక్తుల జీవితాలను, వారి త్యాగాలను, ధైర్య సాహసాలను, వారి అకుంఠిత దేశభక్తిని స్మరించుకొని ఆచరణలో పెట్టడానికి, వారిలో ఉత్తేజాన్ని నింపడానికి తలపెట్టినవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ మహోత్సవ్‌ని స్వర్గీయ పింగళి వెంకయ్య గడప నుండి శ్రీకారం చుట్టడం హర్షణీయం. ప్రజా అంటే నేనే స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాన బ్రిటిష్సామ్రాజ్యాన్ని ధైర్య సాహసాలతో ఎదురించి గడగడలాడించిన సాహసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. అర్ధ శతాబ్దికి పైగా రాజకీయ, ప్రజా హిత జీవిత రంగంలో ఆయన ఆశాకిరణమై నిలిచారు. దక్షణాన యావత్ ప్రజానీకంతో ప్రకాశం గారికున్న చనువు, చొరవ మరి ఏ నాయకుడికీ లేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో నైనా సరే ప్రజల పక్షాన నిలిచాడు. ఆజన్మాంతం ప్రజా అంటే నేనేరా! నేనంటేనే ప్రజరా! అని నిష్కల్మషంగా అనేవారు. అనేక సందర్భాలలో అది రుజువు చేశారు కూడా. 1928లో మద్రాస్ పట్టణంలో సైమన్‌కు వ్యతిరేకంగా ‘సైమన్ గోబ్యాక్’ హర్తాళ్‌కు భయపడి అందరు అగ్ర నేతలు పట్టణం వదిలిపోయారు. ప్రకాశం ఒక్కడే స్వయంగా నిలబడి హర్తాళ్ జరిపారు. లక్షలమంది పాల్గొన్న ఆ ఉద్యమంలో బ్రిటిష్ తుపాకీకి ఒక యువకుడు బలి అయి రోడ్డు మీద పడిపోయాడు. ప్రకాశం పంతులు ఆవేశంతో ముందుకు దూకాడు. బ్రిటిష్తుపాకీకి తన గుండెను చూపించి ‘‘కాల్చుకోండిరా!’’ అని ఎదిరించిన ధీశాలి. ఆనాటి నుంచే ఆయన ఆంధ్రకేసరిగా ప్రసిద్ధులైనారు. ప్రకాశం గారు నిర్వహించిన ఆ హర్తాళ్ దేశానికే తలమానికైంది. మదరాస్ రాకుమారుడు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమమే ఊపిరిగా జీవించారు. కొన్ని సందర్భాలలో పదవులను తృణపాయంగా వదిలిపెట్టారు. లండన్‌లో బారిష్టర్ చదువుతున్న రోజులలో సిగార్ తాగి చిన్న ఉపన్యాస మివ్వమని చెప్తే, తల్లికిచ్చిన మాట కోసం తాను ఆ పని చేయనని నిశ్చయంగా చెప్పి కాలేజీలో చరిత్ర సృష్టించారు. రాజ మండ్రిలో, కాకినాడలో చదువుకుంటున్న రోజులలో నాటకాలు వేసేవారు. ప్రకాశం నటనా ప్రావీణ్యం చూసి ఆంగ్లబృందం ‘స్టార్ ఆఫ్ ద స్టేజ్’ బిరుదును ఇచ్చారు. వీధి తగాదాలలో పెద్ద పెద్ద రౌడీలను కూడా గడగడలాడించాడు. మద్రాసులో న్యాయవాదిగా పని చేస్తున్నప్పుడు జడ్జీలు సైతం అపసవ్యంగా, అగౌరవంగా వ్యవహరిస్తుంటే ఎదురుతిరిగి సన్మార్గంలో పెట్టేవారు. ఆ రోజులలో రోజుకి 1000 రూపాయల దాకా ఫీజు వసూలు చేసేవారు. ఆనాటికి అది చాలా పెద్ద మొత్తం. అంత ఫీజు తీసుకోవడం తెలుగు లాయర్లు ఎవ్వరు ఎరుగరు. అందుకే ఆయనను (ప్రిన్స్ ఆఫ్మద్రాస్) ‘మదరాస్ రాకుమారుడు’ అని పిలిచేవారు. బీదరికం నుంచి సంపదలోకి... కడు బీద కుటుంబంలో 1872 ఆగస్టు 23న ఒంగోలులోని మారుమూల గ్రామం వినోదరాయుడు పాలెంలో పుట్టారు ప్రకాశం. పట్టుదలతో, నిర్భీతితో, నిరంతర కృషితో బారిస్టరై లక్షలకు లక్షలు సంపాదించారు. తోటలు, భూములు, భవనాలు, ఆభరణాలు కొన్నారు. భోగభాగ్యాలను అనుభవించారు. గాంధీగారి పిలుపు మేరకు అంత సంపాదననూ వదిలి, దేశ దాస్య విమోచనకై త్రికరణ శుద్ధిగా ప్రజాసేవలో దూకిన మొట్టమొదటి తెలుగు లాయర్‌ఆయనే. వృత్తిని వదిలేసే ఒకరోజు ముందు తన క్లయింట్ దగ్గర తీసుకున్న ఫీజును తిరిగి ఇచ్చివేశారు. మాటే శాసనం ఉమ్మడి మద్రాసులో ప్రకాశం పంతులు మంత్రిగా ఉండగా తాను తలపెట్టిన ఒక సంక్షేమ పథకానికి ఒక అధికారి దానికి జీవో తీయాలి, సమయం సందర్భం రావాలి అని అడ్డుపడితే ‘నామాటే ఒక జీవో. తక్షణమే అమలు చేయండి రా!’ అనే ధీమా, దమ్మూ కల జననేత. తాను మంత్రి పదవికి రాజీనామా ఇవ్వాల్సి వస్తే, కార్మికుల, ఉద్యమ కారులతో చర్చలు జరిపి ఒప్పించిన తరువాత సంతకం చేసిన మనిషాయన. సాహసమే ఊపిరి ప్రజల క్షేమం కోసం, వారి సుఖ శాంతుల కోసం పరితపించే వారు. మన రాష్ట్రాలలోనే కాక ఎక్కడ కల్లోలాలు జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. రజాకార్ల దమనకాండను సహించలేక వారిని హెచ్చరించి ప్రజలకు ధైర్యాన్ని నింపి వచ్చారు. కేరళలో మతకల్లోలాలు జరుగుతుండగా ‘కనపడితే కాల్చు’ ఆదేశాలున్నప్పటికీ అక్కడికి వెళ్లారు. అక్కడి ప్రజలు విస్తుపోయి ఒక రాత్రంతా పంతులుగారిని కాపాడి రహస్యంగా బయటకు తీసుకుని వచ్చారు. కొట్లాటలు చంపు కోడాలు ఆగిపోయినాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఒక ఏడాదిపాటు ఉన్నా దశాబ్ది కాలం పట్టే ప్రజారంజక పథకాలను అమలు చేశారు. కృష్ణా బ్యారేజ్, గుంటూరులో హైకోర్టు స్థాపన, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల దేవస్థానాభివృద్ధి, దానికి గానూ ఆర్థిక సహాయం, పన్ను ఎత్తివేత కొన్ని మచ్చుతునకలు. రాష్ట్ర అవతరణ సందర్భంగా అమలుపర్చిన 2,000 మంది ఖైదీల విమోచన పథకం వంటిది దేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని నెహ్రూ కితాబు ఇచ్చారు. తాను మంత్రిగా ఉండగా చేనేత పరిశ్రమ అభివృద్ధి పథకంలో భాగంగా స్పిన్నింగ్స్మిల్లులను కేంద్రానికి తిప్పి పంపిన పదహారణాల గాంధేయవాధి. మహాత్ముడు ప్రవేశపెట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని కాంగ్రెస్‌లోని మహామహులే వ్యతిరేకిస్తే ప్రకాశం పంతులు సెంట్రల్ అసెంబ్లీకి రాజీనామా ఇచ్చి నేరుగా ఎకాఎకిగా సత్యాగ్రహ శిబిరానికి వెళ్లిన నాయకుడాయన. ఒక అధికారి బాపూజీతో, ప్రకాశం పథకాలను కేంద్రంలో నెహ్రూతో అమలు చేయించమని అడిగితే బాపూ చిరునవ్వు నవ్వి ‘‘అది కేసరులకే సాధ్యం, పండితులకు కాదు’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత సద్భావనా యాత్ర చేస్తుండగా వడదెబ్బ తగిలిన ప్రకాశం పంతులు 1957 మే 20న హైదరాబాద్‌లో అనంతజ్యోతిలో కలిసిపోయారు. జీవితాంతం పల్లెలు, గ్రామాలు, మారుమూల తండాలు సైతం అలుపెరుగక తిరిగిన ప్రజల మనిషి. గ్రామాల అభివృద్ధి కోసం పరితపించిన ఆంధ్రకేసరి జన్మదినాన్ని ‘‘గ్రామ స్వరాజ్య దినోత్సవం’’గా ప్రకటించి, ‘భారతరత్న’ బిరుదును ప్రదానం చేయడం దేశం వారికి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. - టంగుటూరి శ్రీరాం వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ. మొబైల్: 99514 17344 (టంగుటూరి ప్రకాశం 150వ జయంతి వేడుకల సందర్భంగా) -
‘ఆంధ్రకేసరి’ నైతిక నిష్ట చిరస్మరణీయం..
సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. న్యాయకోవిదుడిగా, పత్రికా సంపాదకుడిగా ప్రకాశం పంతులు స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపిన తీరు, ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలే గాక ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన నైతిక నిష్ట చిరస్మరణీయం అని ఆయన ట్విటర్లో ప్రస్తుతించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో తుపాకీ గొట్టానికి గుండెను అడ్డుపెట్టి ప్రజలందరి హృదయాల్లో ‘ఆంధ్రకేసరి’గా నిలిచిపోయిన ఆయన జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షిస్తున్నానని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. -
భావితరాలకు స్ఫూర్తి ఆంధ్ర కేసరి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు భావి తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. చిత్తశుద్ది, విశ్వాసం, శౌర్యం, ధైర్యం, వారసత్వం టంగుటూరి సొంతం అని ప్రశంసించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని, తరతరాలకు ఆయన స్పూర్తిదాయకమని ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ) అలాంటి దమ్మున్న నాయకుడు సీఎం జగన్ : విజయసాయిరెడ్డి ప్రకాంశం పంతులు జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళర్పించారు. ‘నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడే నాయకులు రాజకీయాల్లో చాలా అరుదు. అలాంటి దమ్మున్న తొలితరం నాయకుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారైతే, నేటి తరం నాయకుడు ముఖ్యమంత్రి జగన్ గారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. A man of integrity, conviction & valor, whose legacy & narratives of courage continue to inspire generations in Andhra Pradesh; my humble tributes to the great freedom fighter & the first CM of AP, Andhra Kesari Tanguturi Prakasam Panthulu on his 148th birth anniversary. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2020 భావి తరాలకు టంగుటూరి స్ఫూర్తి ప్రదాత ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్,ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. భావి తరాలకు టంగుటూరి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. రాజకీయాల్లో విలువల కోసం ప్రజాసేవలో తరించారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశంసించారు. -
ధైర్యం.. త్యాగం.. ప్రకాశం
సాక్షి, కర్నూలు : స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ తుపాకీకి ఎదురునిలిచి గుండె చూపిన ధైర్యశీలి అతను. వారాలు గడుపుతూ చదివి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మహోన్నతుడు ఆయన. అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శం. శుక్రవారం ఆయన 148వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు 23, 1872లో ప్రకాశం జిల్లా వినోదరాయుని పాలెంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంతపతులకు జన్మించారు. ఆరుగురు సంతానంలో ప్రకాశం ఒకరు. 11 సంవత్సరాలకే తండ్రి మరణించడంతో తల్లి పూట కూళ్ల ఇళ్లు నడుపుతూ తన బిడ్డలను సాకింది. ఈయన కూడా వారాలకు కుదిరి రోజుకో ఇంట్లో అన్నం తింటూ చదువుకున్నారు. నాటకాలంటే పిచ్చి ఉన్న పంతులు అనేక నాటకాల్లో నటించి పేరు పొందారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉంటూ అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకికెదురుగా గుండె నుంచి ‘ఆంధ్రకేసరి’ అని పేరు పొందారు. కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా విశేష సేవలు అందించారు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. 14 నెలలకే అవిశ్వాస తీర్మానంలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆంధ్రకేసరి పాలనలో.. కర్నూలు రాజధాని కావడానికి ఆంధ్రకేసరి టంగుటూరే కారకుడు. కర్నూలులో మెడికల్ కళాశాల, కేవీఆర్ కళాశాలల ఏర్పాటు జరిగింది. కేసీ కెనాల్ నీటి పారుదల వ్యవస్థను మార్చివేశారు. 30 టీఎంసీల నిరక జలాలను సాధించి ఏపీకి కేటాయించి 90 వేల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలకు నీటి వ్యవస్థను పెంచారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. కర్నూలులో ఏబీసీ క్యాంప్‌లు ఆయన చొరవతోనే ఏర్పడ్డాయి. ఏపీపీఎస్ సెకండ్ బెటాలియన్ ఏర్పాటు జరిగింది. 1953– 56 వరకు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు నంద్యాలలో నిర్వహించారు. జిల్లా బోర్డును బనగానపల్లెలో నిర్వహించారు. దాని కోసం మొదట మౌళిక సదుపాయా లు కల్పించారు. తరువాత రోజుల్లో అవి ఉపయోగపడ్డాయి.ముఖ్య మంత్రి ఇళ్లు ఎస్టీబీసీ కళాశాలలో, మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ బిల్డింగ్‌లో సచివాలయం, ప్రభుత్వ టౌన్ జూనియర్ కళాశాల, మెడికల్ కళాశా ల హాస్టల్లో ఎమ్మెల్యేల వసతి గృహాలు, నవరంగ్, అలంకార్ థియేటర్లు, ఫారెస్ట్ కార్యాలయాల్లో మంత్రుల గృహాలు. జిల్లా కోర్టు భవనంలో అసెంబ్లీని నిర్వహించారు. నేడు టంగుటూరి జయంతి రాష్ట్ర స్థాయి ఉత్సవాలు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి రాష్ట్ర స్థాయి ఉత్సవాలను కర్నూలులో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ప్రకాశం పంతులుకు ఘన నివాళి అర్పించి ఆయన జ్ఞాపకాలను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ గురువారం ఓ ప్రటకనలో తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
తరతరాలకు ఆయన స్పూర్తిదాయకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడని, ఉన్నతమైన వ్యక్తని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. ప్రకాశం పంతులు తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని, తరతరాలకు ఆయన స్పూర్తిదాయకమని ట్విటర్లో పేర్కొన్నారు. ప్రజలందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ భగవానుని జన్మదినాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటామన్నారు. పండుగ సందర్భంగా ప్రజలు కోరుకున్నవన్ని వారి సొంతం కావాలని, అన్ని వేళలా సకల సౌభాగ్యాలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. -
తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం’
రండిరా యిదె కాల్చుకొండిరాయని నిండు గుండెనిచ్చిన మహోద్దండ మూర్తి సర్వస్వమూ స్వరాజ్య సమర యజ్ఞం నందు హోమమ్మొనర్చిన సోమయాజి... – ప్రకాశం పంతులు గురించి ప్రముఖ కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రశంస ఇది. సాక్షి, కడప : ఆంధ్రకేసరి.. ఆ పేరులోనే ఓ దర్పం.. ఆయన వర్తనలో కూడా తెలుగు పౌరుషం.. నిరాడంబరత.. నిజాయతీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదురించే గుణం.. నచ్చని ఏ అంశంపైనైనా నిప్పులు చెరిగేతత్వం.. నిజాయితీకి నిలువెత్తు రూపం.. తన గుండెను తూపాకీ గొట్టానికి అడ్డుపెట్టి తెల్ల దొరలను సైతం తెల్లబోయేలా చేసిన సాహస సింహం, తెలుగు విలువల ప్రతాకం ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా కడపతో ఆయనకు గల బంధం గురించి కొన్ని వివరాలు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులు, వారి వారసులు, 80 ఏళ్లకు పైగా వయసు ఉన్న పెద్దలుకు తెలుసు. మొన్నటితరం నేత అయినా ఆయన పేరు వినగానే నిన్నటి తరానికి గర్వంతో గుండె ఉప్పొంగుతుంది. పలువురు పెద్దలు ఆయన గురించి తలుచుకుంటూ.. ప్రతి అడుగు ఓ పిడుగు అని, మాట సింహగర్జన అని, ప్రేమతో పలుకరిస్తే నవనీతంలా ఉంటుందని, ఆగ్రహిస్తే అగ్ని వర్షం కరిసినట్టే ఉంటుందని అభివర్ణిస్తూ మురిసిపోతూ ఉంటారు. వారు అందించిన సమాచారంతోపాటు జిల్లా గెజిట్ ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత ప్రకాశం ► ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23న జన్మించారు. 1957 మే 20న ఈ లోకాన్ని వీడారు. ఆయన నిరుపేద అయినా బాగా చదువుకుని న్యాయవాదిగా పని చేశారు. 1926లో స్వాతంత్య్ర ఉద్యమంలోకి ప్రవేశించారు. ‘స్వరాజ్య’ దినపత్రికను స్థాపించారు. ► 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీషు అధికారులు ఆయనను కడపలో నిర్బంధించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉత్తమమైన పాలన అందించారు. 1972లో ఒంగోలు జిల్లాకు ఆయనపై గౌరవ సూచకంగా ప్రకాశం జిల్లాగా మార్చారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాకు ఒక నాయకుడి పేరు పెట్టడం ఆయనతోనే మొదలైంది. ► కడప నగరంలోని ఏడురోడ్ల కూడలిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాక ఆ కూడలికి ప్రకాశం సర్కిల్‌గా నామకరణం చేశారు. ఆయనపై గౌరవంతో కడప నగరం దొంగల చెరువులోని ఓ ప్రాంతానికి ప్రకాశం నగర్‌గా పేరు పెట్టారు. కడపలో కొన్నాళ్లు.... 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రకాశం పంతులు తన ఎత్తుగడలో భాగంగా కొన్నాళ్లపాటు మన జిల్లాలో ఉన్నారు. అప్పటి మన జిల్లా నాయకులు కడపకోటిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, బసిరెడ్డి తదితరులతో కలిసి ఇక్కడే రాజకీయ మంతనాలు జరిపారు. బ్రిటీషు వారు కడపలోనే ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రకాశం పంతులు శతజయంతి ఉత్సవాలను నిర్వహించిన సందర్భంగా కడప నగరంలోని ఏడురోడ్ల కూడలిలో 1976 ఏప్రిల్ 20న ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, స్థానిక నాయకులు పి.బసిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు, నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
రజాకార్లను ఎదిరించిన ఆంధ్ర కేసరి
రజాకార్ల దురాగతాలు జరుగుతున్న రోజులవి. హైదరాబాద్‌తో సహా పరిసర గ్రామాలు కూడా భయాందోళనలలో గడుపుతున్న చీకటి రోజులవి. రజాకార్ల హింసను భరిం చలేక మునగాల పరగ ణాలలోనూ అల్లర్లు చెలరేగాయి. మునగాల పర గణా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమే. వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ నందిగామ తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రావతరణ జరిగిన తరువాత విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) ఏర్పాటుకు కృషి జరుగుతున్న కాల మది, ప్రకాశం పంతులు గారు జగ్గయ్యపేట చేరుకున్నారు. దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ ప్రకాశం గారికి ఆ ప్రాంత ప్రజల స్థితిగతులు వివరించారు. పంతులుగారు ఆ వివరణతో తృప్తి చెందక మునగాలకు పోదామన్నారు. తాను స్వయంగా అక్కడి వారిని కలిసి బాగోగులు తెలుసుకోవాల న్నారు. ఆ రోజులలో నిజాం రాష్ట్రంలో ప్రయాణ మంటే ఆత్మహత్యే అని, రజాకార్లు దారి దోపిడీ చేస్తారని, హత్యలు కూడా చేస్తారని స్థానిక ఎస్ఐ వచ్చి పంతులు గారిని వారించారు. ఏమి జరిగినా సరే వెళ్లి తీరవలసిందే. అక్కడ మనవాళ్లు అగచాట్లు పడుతూఉంటే మనం ఇక్కడ ఉబసుపోక మాటలు చెప్పుకుంటు ఉంటామా.. వెళ్లి తీరాలి అన్నారు. కారు బయలుదేరి పోలేటి (నిజాం సరిహద్దు) వద్ద ఆగింది. ఆవలివైపు రోడ్డుకు అడ్డంగా పెద్ద మోకు ఉంచారు. రజాకార్లు కత్తులతో పచార్లు చేస్తున్నారు. పంతులుగారు పరిస్థితి అంతా గమనించి డ్రైవర్‌తో ‘నీ నైపుణ్యం చూపవలసిన సమయమిది.. రివ్వున వారి మధ్యనుంచే కారు పోనీ.. నేనున్నానుగా,’ అని గర్జించాడు. డ్రెవరు కూడా సింహం పక్కనుండగా సాహసంతో కారు ను మెరుపులా దూసుకు పోనిచ్చాడు. మోకు తెగి దూరంగా పడిపోయింది. రజాకార్లు హాహాకారాలు చేస్తూ కొద్ది దూరం వెంబడించారు. కారు దూసుకు పోయింది. కోదాడ చేరినారు. మళ్ళీ అక్కడ కూడా రజాకార్లు అడ్డగించారు. కారు దిగమన్నారు. బెది రించారు. పంతులుగారు దిగలేదు. వాళ్ళ ప్రశ్న లకు సమాధానం కూడా చెప్పలేదు.ప్రకాశం గారిని కిందకు లాగడానికి రజాకార్లు యత్నించారు. ఇదంతా గమనించిన కలెక్టరు.. ప్రకాశంగారి దగ్గరకు వచ్చి అయ్యా నేను మీ శిష్యుడ్ని. మాది కర్నూలు, మీరు ప్రాక్టీసు చేస్తుండగా మీ వద్ద పని చేశాను. లోనికి వచ్చి టీ తీసుకోండి అని మర్యా దగా ఆహ్వానించాడు. టీ తాగుతుండగా కలెక్టరు గారు పంతులుగారిని వెనక్కు తిరిగి వెళ్లిపొమ్మని ప్రాధేయపడ్డాడు. మాటతప్పడం, వెనుతిరగడం ప్రకాశం పంతులుగారి నైజం కాదు. ప్రమాదమె క్కడో ప్రకాశం అక్కడ. రజాకార్ల మధ్యనుంచే కారులో పంతులుగారు మునగాల చేరుకుని వారి సమస్యలను తెలుసుకుని. త్వరలో మీ కష్టాలు పోతాయి. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్ర) ఏర్పడబోతోంది. రజాకార్లను పార దోలే రోజులువచ్చాయని వారికి ధైర్యం చెప్పారు. ఇంతటి తెగింపు, సాహసం, ధైర్యంలోనూ ఆయ నలోని శాంతికపోతం, సుస్పష్టంగా గోచరిస్తుంది. బ్రిటిష్ గుండుకు తన గుండె చూపిన, రజా కార్లను ఎదిరించి వారి సెల్యూట్ స్వీకరించిన ఏకైక తెలుగు తేజం ప్రకాశం పంతులు. ఆజన్మాంతం ప్రకాశంగారు ప్రజల క్షేమం, సర్వ తోము ఖాభి వృద్ధిని కోరి సర్వస్వాన్ని త్యాగం చేసిన ధన్య జీవి. అందుకే ఆయన్ని ప్రజల మనిషి ప్రజా బంధు, దీనజనోద్ధారకుడు అని ప్రజలు కొనియాడారు. ఈ చిరస్మరణీయ సాహస కృత్యంలో ప్రకాశంగారితో పాటు స్వయంగా పాల్గొన్న సదా శివేశ్వర ప్రసాద్ గారంటారు ‘‘పంతులుగారి యశస్సు చిరస్థాయి. ఆయన ధన్య జీవి. ప్రకాశం గారి అనుచరుడుగా వర్తించగల భాగ్యం కలిగినందుకు గర్విస్తున్నాను.’’ (23–08–2019న ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా) టంగుటూరి శ్రీరాం వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి, అధ్యయన సంస్థ హైదరాబాద్. మొబైల్ : 9951417344 -
మీ వివేకాన్ని పెంచుకోండి!
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కేవలం బెంగాల్‌కి పరిమితం అయిన వ్యక్తి కాదు. భారతీయ సాంస్కృతిక వికాసోద్యమానికి దారి చూపిన మార్గదర్శకుడు. సంకుచిత భావాలతో కుళ్ళి కంపు కొడుతున్న ఛాందస భావాలను కాదని భావోద్యమాలకి రాచబాట వేసిన సంఘ సంస్కర్త. గ్రాంధిక భాషకి బదులు వాడుక భాషని కొత్త పుంతలు తొక్కించి ప్రజల భాషకి పట్టం కట్టిన రచయిత. సామాజిక చైతన్యాన్ని కలిగించే అనేక రచనలు చేయడంతోపాటూ స్వయంగా అనేక గ్రంథాల్ని ముద్రించినవాడు. వితంతు పునర్వివాహాల కోసం నిరవధిక పోరాటం చేయడమే కాదు, ఏకంగా చట్టం కూడా చేయించేదాకా అలుపెరగని కృషి చేశారు. ఆంధ్రదేశం లోని మన కందుకూరి వీరేశలింగంతో మొదలుపెట్టి దేశంలోని అనేక ప్రాంతాలలో సాంస్కృతిక వికాసానికి దారి చూపిన మహానుభావుడు. విద్యా విధా నం మొదలుకొని వివాహాది విషయాల వరకూ ఆనాడే ఎంతో ప్రగతిశీలంగా ఆలోచించడమే కాదు, అనుకున్న దానిని ఆచరణలో పెట్టిన ఆదర్శవాది. అమిత్ షా యాత్రలో భాగంగా కోల్‌కతాలోని సిటీ కాలేజీ విద్యార్థులపై మతోన్మాదులు అమానుష దాడి చేయడమే కాక ఏకంగా కళాశాల ఆవరణ లోని విద్యాసాగరుడి విగ్రహాన్ని కూల్చ డం మతతత్వశక్తుల అవివేకానికి పరా కాష్ట. సిటీ కాలేజ్ చారిత్రక ప్రాముఖ్యం కలది. తూ.గో.జిల్లాలోని మా పిఠాపురానికి, బెంగాల్‌లోని కోల్‌కతా సిటీ కాలేజీకి అనుబంధం ఉంది. సిటీ కాలేజీ నిర్మాణానికి ఉదారంగా ముందుకొచ్చి స్పందించిన వ్యక్తిగా పిఠాపురం యువ రాజాని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. అటువంటి మహోన్నత కళాశాలపై దాడికి దిగడం మతోన్మాదుల అజ్ఞానానికి చిహ్నం. గాంధీ, అంబేడ్కర్, లెనిన్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్.. ఈనాటికీ మతోన్మాదులను విగ్రహాలుగా సైతం భయ పెడుతున్నారంటే నాటి వాళ్ళ కృషి ఎంతటిదో అర్థం చేసుకోవాల్సిందే. విగ్రహాల్ని కూల్చడం కాదు, వివేకాన్ని పెంచుకోవడమొక్కటే విద్వేష శక్తులకి మిగిలున్న ఏకైక మార్గం. విభేదాలు ఎన్నున్నా ఈశ్వర్‌చంద్ర సాగర్ విగ్రహ కూల్చివేతను అభ్యుదయ శక్తులు, ఆలోచనాపరులంతా ఖండించాలి. మతోన్మాదుల ఆగ డాల్ని ప్రజాస్వామికవాదులంతా నిరసించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్! – గౌరవ్ కృçష్ణ, పిఠాపురం కోల్‌కతా కాలేజీలో ధ్వంసమైన ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం -
అప్పట్లో ఎమ్మెల్యే పదవి ఏడేళ్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 1957లో జరిగిన సాధారణ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర, రాయలసీమ జిల్లాలు కలిసి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడ్డాయి. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులు కాగా.. రాష్ట్రపతి పాలన అనంతరం 1955 మార్చిలో 196 అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. నీలం సంజీవరెడ్డి మొదటి సీఎం అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రాంతంలోని 196 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పటికే మధ్యంతర ఎన్నికలు జరిగినందున తెలంగాణలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆంధ్ర, రాయలసీమకు చెందిన 196 మంది ఎమ్మెల్యేలు 1962 వరకూ ఏడేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. -
ఆంధ్రకేసరికి వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకొని ఆయనకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ గురువారం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను వైఎస్ జగన్ స్మరించుకున్నారు. రాష్ట్రానికి టంగుటూరి చేసిన సేవలను కొనియాడారు. -
నిష్కల్మష ప్రజాబంధు ప్రకాశం
దాదాపు అర్ధశతాబ్ది పాటు దక్షిణాది చరిత్రను ప్రభావితం చేసిన ప్రజానేత టంగుటూరి ప్రకాశం పంతులుగారు దక్షిణాన యావత్ ప్రజానీకంతో ప్రకాశానికున్న చొరవ, చనువు, వాత్సల్యం మరె వరికీ లేదు. పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా, కొన్ని సందర్భాలలో పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టినా ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవిం చాడు. తిరుగుబాటుతనం, అన్యాయాన్ని ఎదిరిం చడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, మనసా క్షిగా వ్యవహరించడం ఆయనకు బాల్యంనుంచే అబ్బిన సహజ లక్షణాలు.లండన్‌లో బారిష్టరు చదువు తున్న రోజులలో సిగార్ తాగి చిన్న ఉపన్యాసం ఇవ్వమని చెప్తే తల్లికిచ్చిన వాగ్దానం కోసం ‘నేను పొగత్రాగి ఈ ఉపన్యాసం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పి ఆ దేశంలోనే చరిత్ర సృష్టిం చాడు. రాజమండ్రిలో ఉద్దండులను ఓడించి ఛైర్మన్ కావడం, మద్రాస్‌లో జడ్జిలను సైతం అప సవ్యంగా వ్యవహరిస్తుంటే ఎదురుతిరిగి సవ్యమా ర్గాన తేవడం, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2,000 మంది ఖైదీలను రాష్ట్ర అవతరణ సంద ర్భంగా అందరినీ విడుదల చేయడం లాంటివి తన సాహసోపేతమైన పనులు. 1907 నుంచి 1921 వరకూ మద్రాస్ న్యాయస్థానంలో తొలి తెలుగు బారిష్టర్‌గా, అయ్యర్ల, అయ్యంగార్ల సామ్రాజ్యాన్ని ఛేదించి వారికి ధీటుగా నిలబడి ‘లాడమ్’ మ్యాగజైన్ కొని న్యాయస్థానంలో జరిగే వక్రమార్గాలను నిర్దాక్షిణ్యంగా విమర్శించి, ప్రచు రించి ప్రిన్స్ ఆఫ్ మద్రాస్‌గా ఖ్యాతి చెందాడు. 1921లో మద్రాస్‌లో లక్షలు సంపాదించే లాయరు వృత్తిని వదిలేసి స్వాతంత్య్రోద్యమంలో దూకిన మొట్టమొదటి ప్రఖ్యాత తెలుగు బారిష్టర్ ప్రకాశం కావడం గమనార్హం. జమీందారీ రద్దుకు ఆయన ఆద్యుడైనారు. తన సంపాదనను తృణప్రాయంగా వదులుకుని స్వరాజ్య పత్రికను నిర్వహించారు. ఆ పత్రిక ఆ రోజుల్లో ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చింది. కాంగ్రెస్ సంస్థ అవినీతికి నెలవుగా మారిం దని భావించి దాన్నుంచి వైదొలిగి ప్రజా పార్టీ స్థాపించారు. 1952 ఎన్నికల్లో ఆంధ్ర దేశ మంతటా తిరిగి ప్రముఖులంద రినీ ఓడించారు. కర్నూలు రాజధా నిగా ఎంచుకోవడంలో పంతులు గారి దూరదృష్టి తొలుత అందరికీ అర్థం కాలేదు. కేవలం 13 నెలల కాలంలో అద్భుత నిర్ణయాలు అనేకం తీసుకు న్నారు. అందులో ముఖ్యమైనవి వెంకటేశ్వర విశ్వ విద్యాలయ స్థాపన, ప్రకాశం బ్యారేజీ, గుంటూ రులో హైకోర్టు స్థాపన, ఖైదీల విముక్తి, రైతులు, చేనేత కార్మికులపై పన్నుల ఎత్తివేత వీటిలో కొన్ని ఉదాహరణలు మాత్రమే. 1957 మే 20న ప్రకాశం కాలధర్మం చేసిన ప్పుడు ఆయన బద్ద విరోధిగా పేరుపడ్డ కళా వెంకట్రావు ‘నా తండ్రి ఈరోజు గతించాడు’ అనడం ఆ మహనీయుడి కరుణకు తార్కాణం. (నేడు టంగుటూరి ప్రకాశం 147వ జయంతి) టంగుటూరి శ్రీరాం, ప్రధానకార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ మొబైల్ : 99514 17344 -
మూడుకోట్ల జనం పేరు
ఆయన గుండెల మీద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడింది. కానీ స్వజాతి నాయకత్వం మాత్రం ఆయన గుండెలని పగలగొట్టాలని విశ్వ ప్రయత్నమే చేసింది. అయినా నమ్మినదే చేశారాయన. కుమిలిపోలేదు. విశ్వసించినదానినే గౌరవించారు. వైరాగ్యాన్ని దరి చేరనీయలేదు. తుది పైసా కూడా జాతి స్వేచ్ఛ కోసం అర్పించారు. తన కడుపులో పేగులు ఆకలితో గాండ్రిస్తున్నా వినిపించుకోకుండా, ప్రజల క్షుద్బాధనే పట్టించుకున్నారాయన. అందుకు, ఆయన ‘ఆంధ్రకేసరి’. కానీ, ఆయన అణువణువూ సింహమే, అన్నారు రాజాజీ. ఆయన ఏం చేసినా ఆంధ్రుల అభ్యుదయం కోసమే అన్నారు జవహర్లాల్. నిజమే, చరిత్రలో ఎక్కడో గాని తారసపడని ఓ కచ్చితమైన ప్రజల మనిషి. ఆయన– టంగుటూరి ప్రకాశంపంతులు. ఆంధ్రకేసరి జీవిత చరిత్ర మీద సింహావలోకనం చేసినా రోమాంచితం చేసే ఘట్టాలు కనిపిస్తాయి, అడుగడుగునా. ప్రకాశం (ఆగస్టు 23, 1872 – మే 20, 1957) చరిత్ర అంటే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రే అనకపోవచ్చు. టంగుటూరి ఉద్యమం అంటే ఆంధ్రుల ఉద్యమ చరిత్ర అని కూడా అనకపోవచ్చు. కానీ ప్రకాశం అంటే... దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్టు ‘మూడుకోట్ల జనం పేరు’. అంటే నాటి ముక్కోటి ఆంధ్రుల హృదయ స్పందన. ఒంగోలు సమీపంలోని కనపర్తి అనే గ్రామంలో మేనమామల ఇంట ప్రకాశం పుట్టారు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మగారు. పూర్వీకులది టంగుటూరు. తరువాత ప్రకాశం గారి తాతగారు వల్లూరు వచ్చేశారు. కాబట్టి మాది వల్లూరే అని ప్రకాశం గారు రాసుకున్నారు. అద్దంకి, వినోదరాయుడిపాలెం, నాయుడుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరాలలో ప్రకాశం బాల్యం గడిచింది. ప్రాథమిక విద్య కూడా ఆ ప్రాంతాలలోనే జరిగింది. ప్రకాశం గారి జీవితంలో ఒంగోలు ప్రయాణం, అక్కడ నుంచి గోదావరి గట్టున రాజమహేంద్రవరానికి చేరుకోవడం ఆకస్మికంగా, నాటకీయంగా జరిగాయి. అవే ప్రకాశాన్ని తీర్చిదిద్దాయి. 1884లో గోపాలకృష్ణయ్య హఠాత్తుగా కన్నుమూశారు. దీనితో సుబ్బమ్మగారు ఒంగోలు చేరుకుని చిన్న భోజనశాలను ఏర్పాటు చేసింది. గోపాలకృష్ణయ్య మరణించేనాటికి సుబ్బమ్మగారు గర్భిణి. తండ్రి పోయిన తరువాత ఈ భూమ్మీద పడినవాడే జానకిరామయ్య. ప్రకాశం తమ్ముడు. ఆ నాలుగు మాసాల పురిటికందుతోనే, పచ్చి బాలింతగానే ఆమె ఒంగోలు వచ్చి దారుణమైన శ్రమకోర్చి ఆ చిన్న భోజనశాల నిర్వహించారు.అప్పటికి ప్రకాశం వయసు పన్నెండేళ్లు. ఒంగోలు పాఠశాలలో ఆనాటి ప్రధానోపాధ్యాయుడు బాగా చదివే పిల్లలను ఇంటికి రప్పించుకుని మరీ చదువు చెప్పేవారు. అలాంటి అవకాశం ప్రకాశంగారికి కూడా దక్కింది. అలా అని ప్రకాశం బుద్ధిమంతుడైన విద్యార్థి మాత్రం కాదు. ఒకవైపు పోకిరి పిల్లలతో కలసి అల్లరి. ఇంకోవైపు నాటకాలు. చిలిపి అల్లరి కాస్తా నేరాల స్థాయికి పోకుండా తనను కాపాడినవి నాటకాలేనని ప్రకాశంగారు భావించారు. నాటక పరిచయం ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ప్రకాశం నిజ జీవితంలోకి ఒక గొప్ప పాత్రను ప్రవేశపెట్టింది రంగస్థలం. ఆయన మిడిల్ స్కూల్లో లెక్కల మాస్టారు.ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్ కూడా బాగా చెప్పేవారని ప్రతీతి. పేరు ఇమ్మానేని హనుమంతరావునాయుడు గారు. రాజమహేంద్రవరంలో మరో అంకం సాగడానికి కారకుడు కూడా నాయుడుగారే. నాయుడుగారు ముప్పయ్ రూపాయల జీతంతో పనిచేసే బతకలేని బడిపంతులే. ఆయనా, ప్రకాశం ఏ క్షణంలో కలుసుకున్నారో గాని, మానవ సంబంధాలలోనే అదొక మంచి ముహూర్తంగా చెప్పాలి. ఆయన శిష్యరికంలోనే ప్రకాశం మిడిల్ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కానీ ఆ పరీక్షకు మూడు రూపాయల రుసుము చెల్లించాలి. ఇందుకోసం ఒంగోలుకి పాతికమైళ్ల దూరంలో ఉన్న బావగారింటికి నడిచి వెళ్లారు ప్రకాశం. కానీ బావ కూడా డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. చివరికి సుబ్బమ్మగారే తన పట్టుబట్టను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కొడుక్కి ఇచ్చారు. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక కొత్త సమస్య వచ్చింది. మిడిల్ స్కూల్ పరీక్ష ఉత్తీర్ణత మెట్రిక్‌తో సమానం. అందుకే, ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది. అలా సుబ్బమ్మగారిని భోజనశాల పని నుంచి తప్పించాలన్నదే వారందరి కోరిక. కానీ ప్రకాశం జీవితాశయం న్యాయవాది కావడం. అదే చెప్పారు. ఆ తల్లి కూడా అందుకే మొగ్గారు. చదువు కొనసాగింది. ఆ సమయంలోనే హనుమంతరావునాయుడు తన భార్య కోరిన మీదట రాజమండ్రి యాత్రకు బయలుదేరారు. వారి వెంటే ప్రకాశం రాజమండ్రి వెళ్లారు. ఒంగోలు నుంచి బెజవాడ. అక్కడ నుంచి విజ్జేశ్వరానికి ఎడ్ల బండి. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవర పట్టణ ప్రవేశం. మొత్తం పదిరోజులు. అనుకోకుండా నాయుడుగారు, ప్రకాశం గారు కూడా అక్కడ పాఠశాలలోనే చేరారు. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారితో పరిచయం ఆ గోదావరి తీరంలోనే జరిగింది. గయోపాఖ్యానం, పారిజాతాపహరణ నాటకాలు నాయుడుగారు, ప్రకాశం గారి కోసమే చిలకమర్తి రాశారు. గయోపాఖ్యానంలో గయుని పాత్ర నాయుడుగారిది.గయుని భార్యగా ప్రకాశం నటించారు. కానీ నాటకాలతో ప్రకాశం చదువుకు మంగళం పాడకుండా అందుకయ్యే ఖర్చంతా నాయుడుగారే భరించేవారు. మెట్రిక్యులేషన్ ఇక్కడే పూర్తి చేశారు.అప్పుడే రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చిన్న గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు ప్రకాశం. జీతం నెలకి పద్నాలుగు రూపాయలు. అంత చిన్న వయసులోనే ప్రకాశం గారి తల వంచని తత్వం ఎంతటిదో బయటపడింది. ఆ చిన్న కొలువుకీ అర్హత పరీక్ష అన్నారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ ఉండగా మళ్లీ పరీక్ష ఏమిటి, ఈ ఉద్యోగం నాకు అక్కరలేదంటూ ప్రకాశం ఆ ఆఫీసుకి ఉత్తరం రాసి పడేశారు.అందుకే కాబోలు నాయుడుగారు ప్రకాశం గారిని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్‌ఎలో చేర్పించారు. నాటక ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రౌడీ గ్యాంగ్‌లతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఆయన తొడగొట్టి అవతలి వాళ్లని చావగొట్టిన సంఘటనలు, వాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్న దుర్ఘటనలు కూడా జరిగిపోతున్నాయి. తన కంటూ ఒక గుంపును నిలబెట్టుకునే పనిలో బెస్తవాడలకి వెళ్లడం, వాళ్లు కల్లు తాగుతూ ఉంటే పక్కనే నిలబడడం వంటివి కూడా జరిగాయి. అవన్నీ ఎలా ఉన్నా తన ఆశయం – న్యాయవాది కావడం– గురించి ప్రకాశం మరచిపోలేదు. మద్రాస్ వెళ్లారు అందుకు. ఇదొక కొత్త అంకం. దీనికి తెర లేపిన వారు కూడా నాయుడుగారే. కొణితివాడ జమిందారు దగ్గర 90 రూపాయలు అప్పు చేసి శిష్యుడికి ఇచ్చారాయన. 1894 సంవత్సరంలో ప్రకాశం గారు రాజమండ్రి తిరిగి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు. మంచి పేరొచ్చింది. ఆ వెనుకే డబ్బు కూడా ఉరుకుతూ వచ్చింది. 1901లో రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారాయన. కానీ మళ్లీ కొత్త కోరిక. చిన్న కోర్టులలో కాదు, పెద్ద కోర్టులలో, పెద్ద పెద్ద కేసులు వాదించాలి. అందుకు బారెట్లా అవ్వాలి. చాలా ప్రతిఘటనల మధ్య ఇంగ్లండ్ వెళ్లారు ప్రకాశం. లండన్ జీవితం, బారెట్లా చదువు ప్రకాశం గారికి ఒక కొత్త ఉషోదయాన్ని చూపించాయి. అంతవరకు ఆయన జీవిత గమనంలో కానరాని కొత్త కోణమది. ఈ పురాతన దేశం తనకు పడిన సంకెళ్ల బరువు, అవి తెచ్చిపెట్టిన న్యూనత ఎంత హీనమో, ఎంత అమానుషమో ఎలుగెత్తి ఘోషిçస్తున్న క్షణాలవి. జాతిలోని ఆ ఆక్రోశానికి పోరాట రూపం ఇస్తున్న స్వాతంత్య్రోద్యమ రూపశిల్పులతో యువ ప్రకాశానికి పరిచయం కలిగింది, అక్కడే.›అప్పుడే దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్‌కి పోటీ చేశారు. ప్రకాశం కూడా ప్రచారంలోకి దిగారు. ఇండియా సొసైటీతో పరిచయం ఏర్పడింది. భారత స్వాతంత్య్రోద్యమానికి విదేశాల నుంచి సాయం చేయడం, ఒక తరహా పోరాటాన్ని సమన్వయం చేయడం ఈ సొసైటీ ఉద్దేశం. అదే ‘ఇండియా’ పత్రికను కూడా వెలువరించేంది. సొసైటీ తరఫున గోపాలకృష్ణ గోఖలేని పిలిచి ఉపన్యాసం ఇప్పించారు.లాలా లజపతిరాయ్‌ని కూడా ప్రకాశం అక్కడే కలుసుకున్నారు. అందుకు వేదిక అయినది – శ్యాంజీ కృష్ణవర్మ నివాసం. ఈయన గదర్ వీరుడు. రమేశ్చంద్ర దత్తు, ఉమేశ్ చంద్ర బెనర్జీలు కూడా ప్రకాశం గారికి అక్కడే పరిచయమయ్యారు. బారెట్లా పూర్తి చేసిన తరువాత ఆయన మద్రాస్ హైకోర్టులో చేరారు. అక్కడ వద్దని ఎందరో నిరుత్సాహపరిచినా లెక్కచేయలేదు. పని చేసే చోటుతో కాదు, ఆ పని పట్ల ఉండే విశ్వాసం, అసలు మనిషికి ఉండవలసిన ఆత్మ విశ్వాసం విజయానికి సోపానాలవుతాయని ప్రకాశం భావించారు. అదే నిరూపించారు కూడా. న్యాయవాదిగా ఆయన ఎన్నోసార్లు న్యాయమూర్తులతో సంఘర్షణకు దిగారు. న్యాయమూర్తుల అవాంఛనీయ ధోరణులను విమర్శించడానికి ఆయన ‘లా టైమ్స్’ అన్న పత్రికను కూడా వెలువరించారు. భారతదేశంలో చిత్తరంజన్‌దాస్‌కు ఆరోజులలో యువతలో విశేషమైన ఆకర్షణ ఉండేది. ప్రకాశం కూడా ఆయనను ఎంతో అభిమానించారు. దగ్గరయ్యారు. ఇద్దరికీ మైత్రి ఏర్పడింది. ఒకసారి ఒక లక్షాధికారి కేసు కోసం బొంబాయి వెళ్లినప్పుడు పూనా కూడా Ðð ళ్లి బాలగంగాధర తిలక్‌ను ‘దర్శించుకుని’ వచ్చారు. అప్పుడే గోపాలకృష్ణ గోఖలే అతివాదిగా పేరొందిన తిలక్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అయినా గోఖలే పట్ల తిలక్ చూపుతున్న మర్యాద ప్రకాశాన్ని పరవశుడిని చేసింది. అందుకు గోఖలే స్పందన ఏవగింపు కలిగించింది. తన జీవితంలో అన్నీ ఆకస్మిక ఘటనలే అని రాసుకున్నారు ప్రకాశం. 1907లో బిపిన్ చంద్రపాల్ మద్రాస్ వచ్చారు. తెలుగునాట కాకినాడ మొదలుకొని మద్రాసు వరకు ఆయన సాగించిన ప్రయాణం జాతీయవాద జైత్రయాత్రగా మారిపోయింది. మెరీనా బీచ్‌లో ఆయన సభకు అధ్యక్షత వహించడానికి అంతా భయపడుతున్న సమయంలో అప్పుడే ప్రాక్టీస్ ప్రారంభించిన ప్రకాశం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కడు సాహసంతో ముందుకు వచ్చారు. తరువాత హోంరూల్ ఉద్యమంలో అనిబిసెంట్ వెంట నడిచారు. 1917 నాటి కలకత్తా సభలకు గాంధీతో పాటు ప్రకాశం కూడా పాల్గొన్నారు. అప్పటికి ఆయన ఏ మాత్రం వక్త కాదని తేల్చారు ప్రకాశం. కానీ జాతీయ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ప్రచురించడానికి హిందూతో సహా పత్రికలన్నీ సహకరించలేకపోయేవి. అందుకే 1921లో ప్రకాశం స్వరాజ్య పత్రికను స్థాపించారు. 1927లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు జరిగిన ఘట్టం ప్రకాశం అంటే ఏమిటో భారతదేశానికి తెలిసే అవకాశం ఇచ్చింది. మద్రాస్ నగరంలోని పారిస్ కార్నర్ దగ్గర సైమన్ గోబ్యాక్ ఉద్యమకారుల మీద కాల్పులు జరిగాయి. ఒక భారీకాయుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. అప్పుడే ప్రకాశం తెగించి ముందుకు వెళ్లారు. ‘మీరు బలవంతంగా వెళ్లదలిస్తే మేం కాల్చవలసి వస్తుంది’ అన్నాడు ఓ పోలీస్ ఆఫీసర్. అయితే అక్కడి గుంపులో ఉన్న ఒక మహమ్మదీయుడు ముందుకు వచ్చి, ‘ధైర్యం ఉంటే కాల్చు, మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం.ఆయన ఎవరో నీకు తెలియదల్లే ఉంది.’ అన్నాడు. అక్కడితో ఆ ఆఫీసర్ జులం తగ్గింది. ప్రకాశం ఆ యోధుడి భౌతికకాయాన్ని చూసి, సమీపంలోనే ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ మేజిస్ట్రేట్‌ను చూడ్డానికి వెళ్లారు. తరువాత గాంధీ పిలుపుననుసరించి (చాలా విషయాల్లో ఆయనతో విభేదించినా) లక్షలు ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు ప్రకాశం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.అంతకు ముందే సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్‌కి ఎన్నికయ్యారు. ఏఐసిసి కార్యదర్శి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ మత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయ్యారు. వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆయనే. కానీ అప్పటికే ఆయన తాను ఆర్జించిన సర్వం ప్రజలకు అర్పించేశారు. ఆయన దారిద్య్రం నుంచి వచ్చారు. ఈ పదవులు, ఆర్జనలు, హోదాలు ఒక భ్రమ అన్న రీతిలో తృణప్రాయంగా వదిలి పెటి మళ్లీ దారిద్య్రాన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. చినిగిన దుస్తుల్లో, చిల్లులు పడ్డ శాలువతో, తిండిలేక డస్సిపోయిన ముఖంతో విజయవాడ వీధులలో, రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనను చూసిన వారు ఆ దృశ్యాలను ఎప్పటికి మరచిపోలేకపోయారు. తల్లి సుబ్బమ్మగారు అంతిమక్షణాలలో కొడుకును పిలిచింది. ఒక చిన్న మూటను అప్పగించింది. ఎనిమిది వందల రూపాయలున్నాయి అందులో. ఆమె కష్టార్జితం. ‘తన అంత్యక్రియలకి’ అని చెప్పారావిడ. కన్నతల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా నాకు మా అమ్మ ఇవ్వలేదు అని విలపించారాయన. అయినా, దేశమాత రుణాన్ని ప్రకాశం గారు తీర్చుకున్న తీరు ఎప్పటికీ ఒక అద్భుతం. - డా. గోపరాజు నారాయణరావు -
ఆంధ్ర కేసరిని జెండాలతో ఉరితీస్తారా..?
గుడివాడ: ముఖ్యమంత్రి తనయుడు గుడివాడకు వస్తున్నాడని పార్టీ తోరణాలను ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం మెడకు ఊరిలాగా కడతారా? .. అంటూ భవిష్యత్ భద్రతా దళం కన్వీనర్ యలమంచిలి వెంకట మురళీకృష్ణ ఆగ్రహం చెందారు. గుడివాడలో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి లోకేష్ రాకతో పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం మెడకు తోరణాలు కట్టారు. దీనిపై వైవీ మురళీ కృష్ణ స్పందిస్తూ ఈరాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడికి ఇంత అవమానంపై ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని కానీ ఈనేతలు ఇలా అవమానించటం దారుణమన్నారు. ప్రజా ప్రతినిధులనే రాజ్యాంగ విరుద్ధంగా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన నేతలకు రాజ్యాంగ విలువలు ఎం ఉంటాయని ధ్వజమెత్తారు. కాగా ఈసంఘటనపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో పాటు సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం చేయటంతో మున్సిపల్ కహిషనర్ డాక్టర్ శ్యామ్యూల్ స్పందించి వాటిని పక్కనే ఉన్న పైపులకు కట్టించారు. బాధ్యులపై కేసులు పెట్టి శిక్షించాలని వైవీ మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
ప్రకాశం పంతులు గొప్ప సాహసి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఒంగోలు టౌన్ : ప్రకాశం పంతులు గొప్ప సాహసి, దూరదృష్టి కలిగిన నాయకుడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 144వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండూ ఇచ్చి రాష్ట్రాన్ని, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలన్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులు సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో అదేవిధంగా ప్రస్తుతం మనం ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. అనాలోచితంగా, అశాస్త్రీయంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ‘మేం ఇచ్చాం మీరు తీసుకురాలేదు’ అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రను గుర్తుచేస్తూ భారత రాజకీయాల్లో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి అని కొనియాడారు. ప్రకాశం పంతులకు ప్రధాన నగరాల్లో విలువైన స్థలాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని స్వాతంత్రోద్యమానికి అమ్మివేసి చివరకు గర్భదారిద్య్రాన్ని అనుభవించిన మహానుభావుడన్నారు. రాష్ట్ర రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రకాశం పంతులు త్యాగనిరతి, ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రకాశం పంతులు చిత్ర పటాలను ఏర్పాటు చేయాలని, అందుకు నిధులు అవసరమైతే జెడ్పీ నుంచి విడుదల చేస్తానని తెలిపారు. కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులని పేర్కొన్నారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రకాశం పంతులు విలక్షణమైన జాతీయ నాయకుడని కొనియాడారు. ప్రకాశం పంతులు స్వీయచరిత్ర పుస్తకాన్ని ప్రతి విద్యార్థి చదవాల్సి ఉందన్నారు. ప్రజాసేవ కోసం తన ఆస్తులన్నింటిని అమ్మేసిన త్యాగశీలన్నారు. కొండపి శాసన సభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాణించిన గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులని కొనియాడారు. అన్ని డివిజన్ కేంద్రాల్లో ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు అశ్వద్ధనారాయణ, డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్, అడిషనల్ ఎస్పీ రామనాయక్, జాయింట్ కలెక్టర్-2 ఐ.ప్రకాష్‌కుమార్‌తో పాటు ప్రకాశం పంతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అశ్వద్ధనారాయణతో పాటు ప్రకాశం పంతులు రెండవ కుమారుని కుమార్తె జానకమ్మను ఈ సందర్భంగా సన్మానించారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినోదరాయునిపాలెంలో.. నాగులుప్పలపాడు : టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాన్ని ఆయన పుట్టిన ఊరు వినోదరాయునిపాలెంలో ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో వేడుకలు నిర్వహించారు. సంతనూతలపాడు శాసన సభ్యుడు ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి తన మేథా సంపత్తితో ఇంగ్లాండ్‌లో బారిస్టర్ చదివి కోట్లు గడించారని తెలిపారు. అప్పట్లో మద్రాసు హైకోర్టుకు 7 గుర్రాల బండిపై వెళ్లిన జడ్జి కూడా లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తి దేశం మీద అభిమానంతో లాయర్ వృత్తికి కూడా సెలవు పెట్టి దేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరలపై పోరాడి తన ఆస్తినంత దేశ సేవ, ప్రజల కోసం వెచ్చించిన గొప్ప నాయకుడన్నారు. ప్రకాశంకు ఘన నివాళి ఒంగోలు కల్చరల్ : లాయరుపేట రైతు బజారు వద్దగల ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం కాంస్య విగ్రహానికి ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, రాష్ర్ట రోడ్లు, భవనాలు, రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, కొండపి శాసన సభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ సుజాతశర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇతర సంఘాల ఆధ్వర్యంలో.. బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, చీమలమర్రి వెంకట సుబ్బారావు, రాష్ట్ర దేవాదాయ శాఖ హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ప్రకాశం, గుంటూరు జిల్లాల సమన్వయకర్త, ఆంధ్రకేసరి సేవా పరివార్ ఆర్గైనె జింగ్ సెక్రటరీ ఆలూరు వెంకట రమణారావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకుడు టీవీ శ్రీరామమూర్తి, ఆంధ్ర కేసరి విగ్రహ కమిటీ అధ్యక్షుడు, ఆంధ్రకేసరి సేవా పరివార్ జనరల్ సెక్రటరీ పొన్నలూరి శ్రీనివాసఫణి, టంగుటూరి ప్రకాశం మునిమనుమడు టంగుటూరి సంతోష్, ధేనువకొండ వెంకట సుబ్బయ్య, ఎస్ఏటీ రాజేష్, కాళిదాసు శివరాం, పి.వెంకటేశ్వర్లు, జగద్గురు ఆదిశంకరాచార్య హిందూ ధర్మప్రచార ట్రస్టు అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస శాస్త్రి, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు శేషయ్య, సనాతన ధార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వయంపాకుల యలమందల కోటేశ్వర శర్మ తదితరులు ప్రకాశంకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
ధైర్యానికి ప్రతీకప్రకాశం
‘టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఒక ధైర్యం... దేశభక్తి... పట్టుదల ... నిస్వార్థ ప్రజాసేవకుడు. చిన్ననాటి నుండే ఒక లక్ష్యాన్ని, ధ్యేయాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలనుకునేవారికి ప్రకాశం పంతులు ఓ స్ఫూర్తి. - రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో నాగార్జునసాగర్, వెంకటేశ్వర యూనివర్శిటీలను స్థాపించారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో క్రమశిక్షణగా జీవించాలంటే ఇలాంటి పెద్దల జీవితాలను తెలుసుకోవాలి. - మంత్రి శిద్ధా రాఘవరావు నాటితరం నాయకులు ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసి ప్రాణాలు అర్పించారు, ప్రస్తుతం ఎక్కువ మందిలో స్వార్థం పెరిగి పోయింది. మొదటితరం నాయకుల మంచి లక్షణాలను ఇప్పుడున్న తరం అలవర్చుకోవాలి. - కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఒంగోలు టౌన్ : ‘టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఒక ధైర్యం. ప్రకాశం పంతులు అంటే ఒక దేశభక్తి. ప్రకాశం పంతులు అంటే పట్టుదల. ప్రకాశం పంతులు అంటే నిస్వార్థ ప్రజాసేవకుడు’ అని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. స్థానిక ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో శనివారం జరిగిన ప్రకాశం పంతులు 143వ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం పంతులు ఒక మహా మనీషి అని, ఆయన జన్మించిన ప్రాంతంలో పాదాభివందనంతోపాటు సాష్టాంగ నమస్కారం చేసేందుకు ఇక్కడకు వచ్చానని చెప్పారు. ప్రకాశం జీవన విధానం, నడవడిక, త్యాగనిరతి ప్రజలపై చెరగని ముద్ర వే శాయన్నారు. అన్ని వర్గాల బంధువుగా ఆయన నిలిచారని కొనియాడారు. ప్రకాశం పంతులు, ఎన్టీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతోందన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు, సదుపాయాలు, ఇంటర్నెట్, ప్రతి ఎకరాకు నాణ్యమైన విద్యుత్, ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రకాశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి శిద్దా టంగుటూరి ప్రకాశం పంతులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. పేదరికంలో పుట్టి మంచి నడవడికతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యమంత్రి అయ్యాక నాగార్జునసాగర్, వెంకటేశ్వర యూనివర్శిటీలను స్థాపించారన్నారు. ప్రకాశం బాటలో నడుద్దాం : కలెక్టర్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఘట్టం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ విజయకుమార్ చెప్పారు. ఆయన బాటలో నడిచేందుకు అందరూ ప్రయత్నించాలని కోరారు. నాటితరం నాయకుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించారని, నేటి తరంలో స్వార్థ పెరిగిందని చెప్పారు. జిల్లాపరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ త్యాగానికి మారుపేరు ప్రకాశం పంతులు అని అన్నారు. ప్రకాశం పంతుల జీవిత చరిత్రను జిల్లాపరిషత్ నిధులతో సంక్షిప్తంగా ముద్రించి జిల్లాలోని అన్ని జెడ్పీ పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీ శేషయ్య, జేసీ యాకూబ్ నాయక్, డీఆర్వో గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు కరవది వెంకటేశ్వర్లు, అశ్వద్ధనారాయణలను సన్మానించారు. వర్ధమాన గాయకుడు నూకతోటి శరత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, డీఆర్డీఏ పీడీ పద్మజ బృందం ఆలపించిన ‘వందనం వందనం మాతృభూమి’ గీతం ఆకట్టుకుంది. మంత్రి శిద్దా, ప్రభుత్వ సలహాదారు పరకాల చేతుల మీదుగా ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వివిధరకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. డీఆర్డీఏ, మెప్మా ద్వారా పలు పొదుపు సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ప్లానింగ్ లేకపోవడంతో గందరగోళం మధ్య సాగింది. కార్యక్రమంలో ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్, ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం నాగులుప్పలపాడు : దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. ప్రకాశం జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఒక పండగలా జరపాలని సూచించిందన్నారు. అందులో భాగంగానే ప్రకాశం పుట్టిన ఊరు వినోదరాయునిపాలెం జెడ్పీ పాఠశాల ఆవరణలో ప్రభుత్వం తరఫున వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పరకాల మాట్లాడుతూ పేదరికంలో పుట్టి తన మేధాసంపత్తితో ఇంగ్లండ్‌లో బారిష్టర్ చదివి కోట్లు గడించాడని తెలిపారు. అప్పట్లో మద్రాసు హైకోర్టుకు 7 గుర్రాలపై వెళ్లిన జడ్జి కూడా లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తి ఆ వృత్తికి సెలవుపెట్టి స్వాతంత్య్రం కోసం తెల్లదొరలపై పోరాడి తన ఆస్తినంతా దేశానికి పెట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రకాశం జీవిత విశేషాలను స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశంగా చేర్చాలన్న ఎంపీపీ ముప్పవరపు వీరయ్య అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని పరకాల హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్న రాజకీయ నాయకులు ప్రజలకు ఏమి చేస్తారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రకాశాన్ని ఆదర్శంగా తీసుకొని అలాంటి సంస్కృతికి సెలవు పలకాలని కోరారు. అనంతరం ప్రభాకర్, బాలాజీ, జెడ్పీ సీఈవో ప్రసాద్‌లు మొక్కలు నాటారు. తొలుత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లా రచయిత డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు రచించిన ప్రకాశం జిల్లా విశిష్ఠతను తెలియజేసే పాటకు వినోదరాయునిపాలెం విద్యార్థుల నృత్యం ఆకట్టుకుంది. నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడుకు చెందిన కరాటే కళాకారుడు హనుమంతరావు ఇనుప బండలను పగులకొట్టే ప్రదర్శన అబ్బురపరిచింది. ఎంపీడీఓ జాన్ శామ్యూల్, తహశీల్దార్ రమణయ్య, ఎంఈఓ ఈ.వి. రమణయ్య, వేటపాలెం సీడీపీఓ లిదియమ్మ, వినోదరాయునిపాలెం సర్పంచ్ ఉన్నం రవితో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆదర్శప్రాయులు ‘ఆంధ్రకేసరి’
విజయవాడ : తాను నమ్మిన సిద్ధాంతాలను అమలు చేయడంలో రాజీపడని ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు 142వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆంధ్రకేసరి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యక్తిత్వంలో హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎదిగిన ప్రకాశం పంతులు ధైర్యం, తెగువ, సాహసం యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉడా వీసీ పి.ఉషాకుమారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. సీనియర్ పాత్రికేయులు, ప్రకాశం పంతులు వద్ద కార్యదర్శిగా పని చేసిన తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమంలో బ్రిటిష్‌వారి తుపాకి గుళ్లకు ఎదురొడ్డి నిలిచిన ప్రకాశం పంతులుకు ఆంధ్రకేసరి బిరుదు లభించిందని వివరించారు. సీనియర్ పాత్రికేయులు సి.రాఘవాచారి మాట్లాడారు. సబ్ కలెక్టర్ డి.హరి చందన అధ్యక్షత వహించిన ఈ సభలో స్వాతంత్య్ర సమరయోధులు వేములపల్లి వామనరావు, సి.రాఘవాచారి, తుర్లపాటి కుటుంబరావులను సత్కరించారు. ఆంధ్రకేసరి జయంతిని పురస్కరించుకుని పాఠశాల, కళాశాల స్థాయిల్లో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తుర్లపాటి కుటుంబరావు రచించిన ‘ఆంధ్రకేసరి జీవితంలో అద్భుత ఘట్టాలు’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శిం చిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తొలుత ప్రకాశం బ్యారేజి వద్ద ఉన్న టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ కార్యాలయంలో.. కోనేరుసెంటర్(మచిలీపట్నం) : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎస్పీ జి.విజయ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అడిషనల్ ఎస్పీ బీడీవీ సాగర్, కార్యాలయ ఏవో ప్రసాద్, ఓఎస్డీ వృషికేశవరెడ్డి, బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ పి.మురళీధర్, డీసీఆర్బీ సీఐ బాలరాజు, ఆర్ఐ కృష్ణంరాజు, ఆర్ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఈడేపల్లి(మచిలీపట్నం) : తెలుగువాడి ఆత్మగౌరం, పౌరుషాలకు ప్రకాశం పంతులు ప్రతీక అని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యాన శనివారం మచిలీపట్నం హిందూ కళాశాల ఆడిటోరియంలో టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు నిర్వహించారు. కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య వెంకయ్య మాట్లాడుతూ ఆవేశం, స్వతంత్ర వ్యక్తిత్వం, ఆత్మగౌరవం విషయంలో ప్రకాశం పంతులుకు సాటిలేరని కొనియాడారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు, డీఎస్పీ డాక్టరు కేవీ శ్రీనివాసరావు ప్రసంగించారు. అనంతరం ప్రకాశం పంతులు జీవిత ఘట్టాలను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర’పై నిర్వహించిన వక్తృత్వ, క్విజ్ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డీఆర్వో ఆలపాటి ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతీదివాకర్, ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్ నారదముని, అంగలూరు డైట్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవీజీ ఆంజనేయులు, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ వి.ఉషారాణి, చరిత్ర అధ్యాపకుడు ఎస్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
నేటి తరం ‘ప్రకాశ’వంతం కావాలి
కష్టపడి రాజకీయాల్లో రాణించారు నెల రోజుల్లో పార్టీలోకి వచ్చి పదవులు పొందలేదు టంగుటూరి జయంత్యుత్సవంలో మంత్రి అయ్యన్న ఏయూ క్యాంపస్ : దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధపడిన టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు నేడు రాష్ట్రానికి, దేశానికి అవసరమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్. అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ఆంధ్రకేశరి ప్రకాశం పం తులు జయంత్యుత్సవంలో ముఖ్య అతి థిగా ప్రసంగించారు. ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. మంచి వ్యక్తులు రాజకీయాలలోకి రావలసిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సైమన్ కమిషన్‌కు ఎదురొడ్డి నిలచిన ధీశాలి టంగుటూరి నేటి తరానికి ఆదర్శప్రాయుడన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ కష్టపడి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిగా ప్రకాశం పంతులు నిలిచారన్నారు. జేసీ ప్రవీణ్‌కుమార్, ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు తోట నగేష్, ప్రభుత్వ అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వెల్లివిరిసిన తెలుగు దనం ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. స్వచ్ఛమైన నాయకుడు టంగుటూరి సిరిపురం : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. టంగుటూరి జ యంతి సందర్భంగా ఆశీల్‌మెట్ట వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి రాజకీయ నాయకుల్లా నెలరోజులు ముం దు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించలేదని, ప్రజ ల్లోంచి కష్టపడి పైకొచ్చిన రాజకీయనేత అని కొనియాడారు. కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహారావు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ జయరామిరెడ్డి, జోన్-3 కమిషనర్ వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.