సాక్షి, అమరావతి : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. సోమవారం(ఆగస్టు23వ తేదీ) టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించారు.
‘‘తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2021
చదవండి : నవ యుగానికి నాంది పలికిన జగన్
Comments
Please login to add a commentAdd a comment