నేటి తరం ‘ప్రకాశ’వంతం కావాలి
- కష్టపడి రాజకీయాల్లో రాణించారు
- నెల రోజుల్లో పార్టీలోకి వచ్చి పదవులు పొందలేదు
- టంగుటూరి జయంత్యుత్సవంలో మంత్రి అయ్యన్న
ఏయూ క్యాంపస్ : దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధపడిన టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు నేడు రాష్ట్రానికి, దేశానికి అవసరమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్. అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ఆంధ్రకేశరి ప్రకాశం పం తులు జయంత్యుత్సవంలో ముఖ్య అతి థిగా ప్రసంగించారు. ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. మంచి వ్యక్తులు రాజకీయాలలోకి రావలసిన అవసరం ఉందన్నారు.
కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సైమన్ కమిషన్‌కు ఎదురొడ్డి నిలచిన ధీశాలి టంగుటూరి నేటి తరానికి ఆదర్శప్రాయుడన్నారు. ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ కష్టపడి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిగా ప్రకాశం పంతులు నిలిచారన్నారు. జేసీ ప్రవీణ్‌కుమార్, ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు తోట నగేష్, ప్రభుత్వ అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
వెల్లివిరిసిన తెలుగు దనం
ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి.
స్వచ్ఛమైన నాయకుడు టంగుటూరి
సిరిపురం : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. టంగుటూరి జ యంతి సందర్భంగా ఆశీల్‌మెట్ట వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి రాజకీయ నాయకుల్లా నెలరోజులు ముం దు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించలేదని, ప్రజ ల్లోంచి కష్టపడి పైకొచ్చిన రాజకీయనేత అని కొనియాడారు. కలెక్టర్ ఎన్.యువరాజ్, జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహారావు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ జయరామిరెడ్డి, జోన్-3 కమిషనర్ వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.