
స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం..
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర సమరయోధులు, ధీశాలి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.
స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్.
స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2022