ప్రకాశం పంతులు విగ్రహానికి టీడీపీ తోరణాలు కట్టిన తీరును చూపిస్తున్న మురళీకృష్ణ
గుడివాడ: ముఖ్యమంత్రి తనయుడు గుడివాడకు వస్తున్నాడని పార్టీ తోరణాలను ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం మెడకు ఊరిలాగా కడతారా? .. అంటూ భవిష్యత్ భద్రతా దళం కన్వీనర్ యలమంచిలి వెంకట మురళీకృష్ణ ఆగ్రహం చెందారు. గుడివాడలో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి లోకేష్ రాకతో పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం మెడకు తోరణాలు కట్టారు.
దీనిపై వైవీ మురళీ కృష్ణ స్పందిస్తూ ఈరాష్ట్రం కోసం పోరాడిన మహనీయుడికి ఇంత అవమానంపై ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని కానీ ఈనేతలు ఇలా అవమానించటం దారుణమన్నారు. ప్రజా ప్రతినిధులనే రాజ్యాంగ విరుద్ధంగా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన నేతలకు రాజ్యాంగ విలువలు ఎం ఉంటాయని ధ్వజమెత్తారు. కాగా ఈసంఘటనపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో పాటు సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం చేయటంతో మున్సిపల్ కహిషనర్ డాక్టర్ శ్యామ్యూల్ స్పందించి వాటిని పక్కనే ఉన్న పైపులకు కట్టించారు. బాధ్యులపై కేసులు పెట్టి శిక్షించాలని వైవీ మురళీకృష్ణ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment