టంగుటూరి ప్రకాశం పంతులు
దాదాపు అర్ధశతాబ్ది పాటు దక్షిణాది చరిత్రను ప్రభావితం చేసిన ప్రజానేత టంగుటూరి ప్రకాశం పంతులుగారు దక్షిణాన యావత్ ప్రజానీకంతో ప్రకాశానికున్న చొరవ, చనువు, వాత్సల్యం మరె వరికీ లేదు. పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా, కొన్ని సందర్భాలలో పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టినా ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవిం చాడు. తిరుగుబాటుతనం, అన్యాయాన్ని ఎదిరిం చడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, మనసా క్షిగా వ్యవహరించడం ఆయనకు బాల్యంనుంచే అబ్బిన సహజ లక్షణాలు.లండన్‌లో బారిష్టరు చదువు తున్న రోజులలో సిగార్ తాగి చిన్న ఉపన్యాసం ఇవ్వమని చెప్తే తల్లికిచ్చిన వాగ్దానం కోసం ‘నేను పొగత్రాగి ఈ ఉపన్యాసం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పి ఆ దేశంలోనే చరిత్ర సృష్టిం చాడు.
రాజమండ్రిలో ఉద్దండులను ఓడించి ఛైర్మన్ కావడం, మద్రాస్‌లో జడ్జిలను సైతం అప సవ్యంగా వ్యవహరిస్తుంటే ఎదురుతిరిగి సవ్యమా ర్గాన తేవడం, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2,000 మంది ఖైదీలను రాష్ట్ర అవతరణ సంద ర్భంగా అందరినీ విడుదల చేయడం లాంటివి తన సాహసోపేతమైన పనులు. 1907 నుంచి 1921 వరకూ మద్రాస్ న్యాయస్థానంలో తొలి తెలుగు బారిష్టర్‌గా, అయ్యర్ల, అయ్యంగార్ల సామ్రాజ్యాన్ని ఛేదించి వారికి ధీటుగా నిలబడి ‘లాడమ్’ మ్యాగజైన్ కొని న్యాయస్థానంలో జరిగే వక్రమార్గాలను నిర్దాక్షిణ్యంగా విమర్శించి, ప్రచు రించి ప్రిన్స్ ఆఫ్ మద్రాస్‌గా ఖ్యాతి చెందాడు. 1921లో మద్రాస్‌లో లక్షలు సంపాదించే లాయరు వృత్తిని వదిలేసి స్వాతంత్య్రోద్యమంలో దూకిన మొట్టమొదటి ప్రఖ్యాత తెలుగు బారిష్టర్ ప్రకాశం కావడం గమనార్హం. జమీందారీ రద్దుకు ఆయన ఆద్యుడైనారు. తన సంపాదనను తృణప్రాయంగా వదులుకుని స్వరాజ్య పత్రికను నిర్వహించారు.
ఆ పత్రిక ఆ రోజుల్లో ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చింది. కాంగ్రెస్ సంస్థ అవినీతికి నెలవుగా మారిం దని భావించి దాన్నుంచి వైదొలిగి ప్రజా పార్టీ స్థాపించారు. 1952 ఎన్నికల్లో ఆంధ్ర దేశ మంతటా తిరిగి ప్రముఖులంద రినీ ఓడించారు. కర్నూలు రాజధా నిగా ఎంచుకోవడంలో పంతులు గారి దూరదృష్టి తొలుత అందరికీ అర్థం కాలేదు. కేవలం 13 నెలల కాలంలో అద్భుత నిర్ణయాలు అనేకం తీసుకు న్నారు. అందులో ముఖ్యమైనవి వెంకటేశ్వర విశ్వ విద్యాలయ స్థాపన, ప్రకాశం బ్యారేజీ, గుంటూ రులో హైకోర్టు స్థాపన, ఖైదీల విముక్తి, రైతులు, చేనేత కార్మికులపై పన్నుల ఎత్తివేత వీటిలో కొన్ని ఉదాహరణలు మాత్రమే. 1957 మే 20న ప్రకాశం కాలధర్మం చేసిన ప్పుడు ఆయన బద్ద విరోధిగా పేరుపడ్డ కళా వెంకట్రావు ‘నా తండ్రి ఈరోజు గతించాడు’ అనడం ఆ మహనీయుడి కరుణకు తార్కాణం.
(నేడు టంగుటూరి ప్రకాశం 147వ జయంతి)
టంగుటూరి శ్రీరాం, ప్రధానకార్యదర్శి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ
మొబైల్ : 99514 17344
Comments
Please login to add a commentAdd a comment