- నేడు గయ్యాళి అత్త సూర్యకాంతం 93వ జయంతి l
- కాకినాడ నుంచి చిత్రపరిశ్రమకు...
గడసరి గుండమ్మ
Published Fri, Oct 28 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
గయ్యాళి భార్యగా, రాచిరంపాన పెట్టే అత్తగా, చాడీలు చెప్పే ఆడపడుచులా, చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే పొరుగింటావిడిలా ఎవరైనా కనిపిస్తే చాలు.. ఎవరికైనా ఆమె పేరే ఠక్కున గుర్తొస్తుంది. బొద్దుగా ఉంటూ.. పెద్దగా అరుస్తూ ఎదుటి వారిపై విరుచుకుపడాలన్నా.. మానసికంగా వేధించాలన్నా వెండి తెరపై ఆమెకే సాధ్యమైంది. గయ్యాళి పాత్రల్లో ఆమె అంతగా ఒదిగిపోయింది. ఆమే తెలుగువారి గుండమ్మ.. సూర్యకాంతం. నేడు ఆమె 93వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– కంబాలచెరువు(రాజమహేంద్రవరం)
చిన్ననాటి నుంచి నాటకాలు వేస్తూ..
జిల్లాలోని కాకినాడ సమీపాన వెంకటకృష్ణాపురానికి చెందిన సూర్యకాంతం ఆమె తల్లిదండ్రులకు 14వ సంతానం. చిన్ననాటి నుంచే అల్లరిపిల్లగా ముద్రపడిన ఆమె ఏం మాట్లాడినా సూటిగా సుత్తితో మేకును దిగ్గొట్టినట్టే ఉండేది. కాకినాడలోని యంగ్‌మె¯Œ్స హ్యపీక్లబ్‌లో నాటకాలు వేసేది. ఆ సమయంలో నటులు అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు, రేలంగి వారు అక్కడకు వచ్చేవారు. ఆ క్రమంలో వీరితో సూర్యకాంతానికి పరిచయం ఏర్పడింది. వారి మాటల ద్వారా ఆమెకు వెండితెరపై ఆసక్తి కలిగింది. అయితే తొలుత చాలా సినిమాల్లో నృత్య సన్నివేశాల్లో గుంపులో కనిపించడం, కథానాయిక పక్కన చెలికత్తెగా నటించింది. ఆమె హీరోయి¯ŒS అవుదామనున్న కల తీరడంలేదు. అదే సమయంలో ’ధర్మంగద’ అనే చిత్రంలో మూగపాత్ర లభించింది. ఆ తర్వాత మరో సినిమాలో హీరోయి¯ŒS పాత్ర వేసే అవకాశం వచ్చి చేజారిపోయింది.
ఆమె బిరుదులు
గయ్యాళి అత్త, సహాజనట కళాశిరోమణి, హాస్యనట శిరోమణి, బహుముఖ నటన ప్రవీణ, రంగస్థల శిరోమణి, అరుంగలై మామణి(తమిళ్)
అవార్డులు : మహానటి సావిత్రి మోమోరియల్ అవార్డు, పద్మావతి మహిళా యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కారం
గయ్యాళి పాత్రలతో..
సాధన సంస్థ వారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు హీరోలుగా తీసిన ’సంసారం’(1950) కయ్యాలమారి పాత్ర. అంతే ఆ సినిమాతో గయ్యాళి గంప పాత్రలకు పేరుగా సూర్యకాంతం నిలిచింది. అదే ఏడాదిలో హైకోర్టు జడ్డి పెద్దిబొట్ల చలపతిరావును వివాహం చేసుకున్నారు ఆమె. సంసారం సినిమాలో పాత్రతో అప్పటి నుంచి ఇక ఆమెకు గయ్యాళి భార్యగా, రాచిరంపాన పెట్టే అత్తగా, చాడీలు చెప్పే ఆడపడుచులా, చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే పొరుగింటావిడి వంటి పాత్రలే ఆమెను వరించాయి.
మహానటుల సినిమాకు ఆమె పాత్రపేరుతో..
ఎన్టీర్, ఏఎన్నార్‌తో తీసిన హిట్ సినిమా ’గుండమ్మక£ýథ’. ఆ సినిమాలో నటదిగ్గజాలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావు నటించినా.. సూర్యకాంతం టైటిల్‌రోల్‌తో గుండమ్మ పేరుపెట్టి ఆ చిత్రాన్ని నిర్మించారంటే ఆమె స్థానం ఏమిటో ఊహించుకోవచ్చు. అటువంటి ఆ మహానటి సావిత్రి బిరుదాంకితురాలు షుగర్ వ్యాధితో 18 డిసెంబర్ 1994 మృతి చెందింది. ఆమె నటించిన చివరి చిత్రం ఎస్పీ పరశురామ్.
Advertisement
Advertisement