వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం | colleagues harassment, woman employee attempts suicide | Sakshi

వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

Oct 4 2014 9:00 AM | Updated on Sep 2 2017 2:20 PM

వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

టి ఉద్యోగుల వేధింపులు భరించలేక తిరుపతికి చెందిన అనసూయ అనే వికలాంగ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది.

చిత్తూరు: తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక తిరుపతికి చెందిన అనసూయ అనే వికలాంగ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. చిత్తూరు ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అనసూయ అధికారులు, తోటి ఉద్యోగులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్  రాసి నిద్రమాత్రలు మింగేసింది.

 

ప్రస్తుతం స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా వుంది. అధికారులు, తోటి ఉద్యోగుల వేధింపుల వల్లే తన బిడ్డ ఆత్మహత్యాయత్నం చేసిందని అనసూయ తల్లి జయమ్మ కన్నీరు పెట్టుకుంది. ఆమెను వేధించిన చిత్తూరు ట్రెజరీ కార్యాలయం సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement