
సెల్ టవర్‌పై రామచంద్ర
చిత్తూరు, వాల్మీకిపురం: ప్రియుడితో కలిసి భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని, ఇప్పటికే రెండు పర్యాయాలు తనపై దాడి చేసిందని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం అయ్యవారిపల్లి వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి నాలుగుగంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. పోలీసుల కథనం మేరకు... దండువారిపల్లికు చెందిన రామచంద్ర (40), గంగాదొడ్డికి చెందిన మంజుల (32)లకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమార్తె ఉంది. మంజుల మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆరు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని బాధితుడు పేర్కొన్నారు. మంజుల ఆమె ప్రియుడు కలిసి తనను చంపుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.
రెండు పర్యాయాలు ప్రియుడి, ఆతడి స్నేహితులతో కలసి తనపై దాడిచేయించిందని పోలీసులకు చెప్పాడు. మనస్తాపం చెందిన రామచంద్ర గురువారం ఉదయం అయ్యవారిపల్లి వద్ద నున్న మొబైల్ టవర్ ఎక్కి తాను దూకేస్తానంటూ కేకలు పెట్టాడు. సమీప రైతులు స్థానిక ఎస్‌ఐకి సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రామచంద్ర ఎంత నచ్చజెప్పినా రామచంద్ర కిందకు దిగలేదు. దాదాపు 4 గంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఇక చేసేది ఏమీలేక ఎస్‌ఐ చాకచక్యంగా నలుగురు గ్రామస్తులను టవర్ ఎక్కించాడు. రామచంద్రను తాడుతో కట్టేసి కిందకు దింపి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ రామచంద్ర వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment