సాక్షి, హైదరాబాద్ః దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అసెంబ్లీహాల్‌లోని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పిం చారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్‌విప్ దాస్యం వినయ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు, పలువురు ఎమ్మెల్యేలు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిం చారు.
శాసన మండలి ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, చీఫ్‌విప్ భానుప్రసాదరావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు నివాళులర్పిం చినవారిలో ఉన్నారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి కేటీ రామారావు అన్నారు.
జయశంకర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్రను నేతలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
మంత్రుల నివాస సముదాయంలో
జయశంకర్ జయంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment