Assembly Hall
-
ప్రొఫెసర్ జయశంకర్‌కు సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్ః దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అసెంబ్లీహాల్లోని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పిం చారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్‌విప్ దాస్యం వినయ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు, పలువురు ఎమ్మెల్యేలు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిం చారు. శాసన మండలి ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, చీఫ్‌విప్ భానుప్రసాదరావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు నివాళులర్పిం చినవారిలో ఉన్నారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి కేటీ రామారావు అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్రను నేతలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. మంత్రుల నివాస సముదాయంలో జయశంకర్ జయంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. -
సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గురువారం అసెంబ్లీ హాల్లో సీఎంను కలసి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత లాబీల్లోని సీఎం చాంబర్లోనూ కలిశారు. కాగా, ఈ భేటీ రాజకీయ చర్చకు దారితీసింది. సీఎంను కలసిన అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లా డుతూ తాను దొంగచాటుగా ముఖ్యమంత్రిని కలవలేదని పేర్కొన్నారు. తాను సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీ హాల్లోనే కలిశానని, ఆ తర్వాత ఆయన చాంబర్లో టైం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడానని జగ్గారెడ్డి చెప్పారు. ప్రధానమంత్రిని కాంగ్రెస్ ఎంపీలు కలుస్తారని, అలాగే ఎమ్మెల్యేగా తాను కూడా సీఎంను కలిశానని అన్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి, సదాశివపేట వరకు మెట్రో రైలు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చానని, దళితబంధు పథకం కోసం తన నియోజకవర్గంలోని 550 మంది అర్హుల జాబితా ఇచ్చానని, మహబూబ్ సాగర్ చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించాలని అడిగానని చెప్పారు. అలాగే సిద్ధాపూర్లో 5వేల మందికి, కొండాపూర్ ఆలియాబాద్‌లో 4వేల మందికి ఇళ్లను అప్పగించాలని కూడా సీఎంను కోరినట్టు చెప్పారు. ఇవే వినతిపత్రాలను మంత్రి కేటీఆర్‌కు కూడా ఇచ్చానని తెలిపారు. తన వినతులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పిన జగ్గారెడ్డి, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు మరోమారు టైం ఇవ్వాలని సీఎంను కోరానని, ప్రగతిభవన్‌లో సమయం ఇస్తే వచ్చి కలుస్తానని చెప్పానని వెల్లడించారు. చదవండి: టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs శ్రీధర్ బాబు హీటెక్కిన సభ -
అనంతపురం జిల్లా నాయకుల్ని అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శాసనసభ సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలో ఘనవిజం సాధించినందుకు మంత్రి శంకరనారాయణను, జిల్లా పార్టీ నేతలను సీఎం జగన్ అభినందించారు. కాగా, పెనుకొండ నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడిన, ప్రలోభపెట్టినా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారు. ఫలితంగా 20 వార్డులున్న నగర పంచాయతీలో ఏకంగా 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ జిల్లా నేతలంతా పెనుకొండలోనే మకాం వేసి కుట్ర రాజకీయాలు చేసినా ఆ పార్టీ రెండు స్థానాల (1,3వార్డులు)ను మాత్రమే దక్కించుకోగలిగింది. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన సీఎం జగన్) చదవండి: (అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు: సీఎం జగన్) -
దిక్కులేకే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా: జేసీ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో హల్చల్ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేం ముఖ్యమంత్రి అవుతామంటే, మేం ముఖ్యమంత్రి అవుతామని పోటీ పడి, మొత్తం మీద అందరు కలసి కాంగ్రెస్‌ను నాశనం చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాధాకరం.. మా ఉన్నతికి కారణం కాంగ్రెస్ పార్టీ.. మన పార్టీ గురించి బాధపడుతున్నా. త్వరలో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మూతపడుతుంది. కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. రాహుల్ విదేశాలకు వెళ్తాడు. సోనియా జపం చేసుకుంటుంది. సీతారామ ప్రాజెక్టు కింద భట్టి సాగు చేసుకుంటారు’అని జేసీ వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన జేసీ అక్కడే ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పిచ్చాపాటీగా గంటకుపైగా సంభాషించారు. ‘పందెం కాస్తా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. కేసీఆర్ వీపు పగలగొడతారు. 2023–24 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఉండదు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి సొంతంగా గెలవాల్సిందే. పోటీ చేసేందుకు ఆయన కుమారుడు రఘువీర్ ముందుకు రావాలి. ప్రతిదానికీ కొంతకాలం జీవకళ ఉంటుంది. మేం పుట్టి పెరిగిన పార్టీకి కాలం చెల్లిపోయింది. టీడీపీ లో ఉన్నా కాంగ్రెస్ నాకు మాతృపార్టీ. దానిని నేను మరచిపోలేను. కానీ, కాంగ్రెస్‌ను తిడితే ద్రోహులం అవుతాం. అక్కడ మేం బతికే చాన్స్ లేదు. గతి లేక టీడీపీలో కొనసాగుతున్నా’అని అన్నారు. రాజధాని విశాఖలో అయితే బాగుండేది.. ‘రాజధాని విశాఖలో బాగుంటుందని అప్పట్లో చంద్రబాబుకు చెప్పాం. లేదంటే నాగార్జునసాగర్ (ఏపీ సరిహద్దువైపు ప్రాంతం) గానీ, దొనకొండగానీ అయితే బాగుంటుందనుకున్నాం. దొనకొండలో 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నాగార్జున సాగర్‌లో కొండలు, తుప్పలతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో ఉంటుంది. త్వరగా అభి వృద్ధి జరుగుతుందన్నాం’అని వ్యాఖ్యానించారు. నిజానికి నాకు దివంగత వైఎస్ కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉండేది. ఒకరి కుటుంబ విషయాలు ఇంకొకరం చెప్పుకునేవాళ్లం. స్వతహాగా నేను చంద్రబాబు ద్వేషిని’అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను గద్దెదించే వరకు నిద్రపోం.. ‘56 ఏండ్ల ఉమ్మడి ఏపీలో 50 ఏండ్లు మీరే పాలించారు. చెన్నారెడ్డి, అంజయ్య.. ఇలా ఎవరినీ సీఎంలుగా పూర్తికాలం పనిచేయకుండా దించేశారు. తెలంగాణలో మహిళలను మంత్రులుగా చేసి ఇక్కడి బలమైన నాయకత్వాన్ని అణచివేశారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతల మీద ప్రజలకు నమ్మకం పోయింది. తెలంగాణ రావడం కేసీఆర్ గొప్పతనం కాదు. వైఎస్ జగన్‌ను సీఎం చేస్తే తెలంగాణ వచ్చి ఉండేది కాదు. జైపాల్‌రెడ్డి లేదా జానారెడ్డిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయమని అడిగాం. జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్‌రెడ్డిని సీఎం చేసింది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించే వరకు నిద్రపోం’అని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ కాంగ్రెస్ వీడటం గురించి మాట్లాడుతూ ‘మీరు రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. మేం తల్లిపాల మీద ఆధారపడ్డామ’ని జీవన్‌రెడ్డి.. ‘మిమ్ములను పంపకపోతే మా ఇల్లు లాక్కునే వాళ్లు’అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 2023–24లో టీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వస్తాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించగా.. ఆల్ ది బెస్ట్ అంటూ జేసీ అక్కడ నుంచి కదిలారు. -
టీడీఎల్పీకి గదులను కొనసాగించరూ..
స్పీకర్‌కు రేవంత్‌రెడ్డి తదితరుల వినతి సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో టీడీఎల్పీకి కేటాయించిన గదులను యథావిధిగా కొనసాగించాలని స్పీకర్ మధుసూదనాచారిని టీడీపీ నాయకులు కోరారు. మంగళవారం బీఏసీ సమావేశం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. అయితే సభ ముగిశాక తనను కలవాలని స్పీకర్ వారికి సూచించడంతో రేవంత్‌రెడ్డి, వీరయ్యలతోపాటు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు మరోసారి స్పీకర్‌ను కలసి ఈ అంశంపై విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా శాసనసభ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించేందుకు స్పీకర్ కార్యాలయం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో స్పీకర్‌ను మళ్లీ కలసి గదుల కేటాయింపును కొనసాగించేలా కోరాలనే ఆలోచనతో టీడీపీ నాయకులున్నారు. గతంలో టీడీఎల్పీకి కేటాయించిన గదులను ఆయా అసెంబ్లీ కమిటీల చైర్మన్లకు కేటాయిస్తూ కొంతకాలం కిందట అసెంబ్లీ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే తమ పార్టీకి ఎమ్మెల్యేలున్నందున టీడీఎల్పీ కార్యాలయం కోసం వాటిని కొనసాగించాల్సిందిగా టీడీపీ నాయకులు కోరుతున్నారు. ‘మహా’ ఒప్పందంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసే యోచన అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేయాలనే యోచనలో టీటీడీపీ ఉంది. ఈ ఒప్పందాలు తెలంగాణకు నష్టదాయకమని, వాటిని రద్దు చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్‌కు వినతిపత్రాన్ని సమర్పించాలని భావి స్తోంది. వినతిపత్రం సమర్పణకు సమ యం ఇవ్వాల్సిందిగా గవర్నర్ కార్యాలయాన్ని టీడీపీ నాయకులు కోరినట్లు సమాచారం. గవర్నర్ అపాయింట్మెంట్ దొరకగానే ఆ మేరకు వినతిపత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు.