Prof. Jayashankar
-
ప్రొఫెసర్ జయశంకర్‌కు సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్ః దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అసెంబ్లీహాల్లోని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పిం చారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, చీఫ్‌విప్ దాస్యం వినయ భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు, పలువురు ఎమ్మెల్యేలు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిం చారు. శాసన మండలి ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, చీఫ్‌విప్ భానుప్రసాదరావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు నివాళులర్పిం చినవారిలో ఉన్నారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మంత్రి కేటీ రామారావు అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ పాత్రను నేతలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. మంత్రుల నివాస సముదాయంలో జయశంకర్ జయంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆయన చిత్రపటం వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవిత కాలం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. -
జయశంకర్ సార్ స్ఫూర్తి ప్రదాత
నివాళ్లుర్పించిన స్పీకర్, మంత్రి, డిప్యూటీ స్పీకర్ సిద్దిపేటలో జయశంకర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ సిద్దిపేట జోన్: తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, మార్గనిర్దేశకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయన ఉద్యమ సారధి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముస్తాబాద్ చౌరస్తా వద్ద నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ దేశంలో జాతిని ప్రభావితం చేయగల వ్యక్తుల్లో జయశంకర్ రెండవ వారన్నారు. చరిత్రలో జాతిని ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరేనని వారిలో ఒకరు జాతిపిత మహాత్మాగాంధీ కాగా మరొకరు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. సాధారణ జీవితం గడిపిన జయశంకర్ సార్ నిరాంబడరుడు, గొప్ప మేధావి అని ఆయనతో తనకు సాన్నిహిత్యం ఉండేదన్నారు. గురువుగా, మార్గదర్శకునిగా విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జయశంకర్ అని స్పీకర్ కొనియాడారు. ఉద్యమంలో నిరాశానిస్పృహలతో ఉన్న సమయంలో ఉద్యమ సారధి కేసీఆర్ ధైర్యం నూరిపోసి ముందుకు నడిపించారన్నారు. రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎంత ముఖ్యమో బంగారు తెలంగాణ నిర్మించుకోవడం అంతే ముఖ్యమని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించరన్నారు. వరంగల్, సిద్దిపేట , ప్రాంతాలకు చెందిన వారు ఎంతో అదృష్టవంతులని జయశంకర్, కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తులు ఈ గడ్డపై జన్మించారన్నారు. అంతకు ముందు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం జయశంకర్‌సార్ జీవించి ఉంటే ఎంతో సంతోషించేవారన్నారు. దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యలో లేడన్నారు. జయశంకర్ కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అదిశగా బంగారు తెలంగాణ నిర్మాణానికి కంకణబద్ధులమై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామన్నారు. 1330 టీఎంసీల గోదావరి , కృష్టా నది జాలాల్లో నీటి వాటాను వాడుకోని తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధికి 45 శాతం నిధులు కూడా బడ్జెట్లో కేటాయించలేదని గడిచిన రెండేళ్లలో వేలాది కోట్లతో రాష్ట్రం అభివృద్ధివైపు పరుగులు తీస్తోందన్నారు. జయశంకర్ సార్ గుర్తుగా సిద్దిపేటలో నిర్మించిన మినీ స్టేడియానికి ఆయన పేరు పెడుతున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్పవ్యక్తి జయశంకర్‌సార్ అన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, ఉన్నత విద్యామండలి సభ్యులు పాపయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ కౌన్సిలర్ మచ్చవేణుగోపాల్‌రెడ్డి, సాకి అనంద్, ప్రవీణ్, దీప్తి నాగరాజు లోక లక్ష్మిరాజం. , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, టీఎన్జీవో నాయకులు శ్రీహరి, అశ్వక్, టీపీటీఎప్ రాష్ట్రనాయకులు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీ.భవన్లో ప్రొ.జయశంకర్ జయంతి వేడుకలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉద్యోగులు ఘనంగా అంజలి ఘటించారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రొఫెసర్ జయశంకర్‌కు పలు రాజకీయ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. -
హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయి: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫ్రొఫెసర్ జయశంకర్ కంటే గొప్పోళ్లు ఎవరూ లేరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్జీరంగా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. చట్టప్రకారం ఆంధ్ర విద్యార్థులకు 15% అడ్మిషన్లు కల్పిస్తామని అన్నారు. ఎన్జీరంగా యూనివర్సిటీ పేరును కేసీఆర్ ఫ్రొఫెసర్ జయశంకర్ వర్సిటీగా నామకరణం చేశారు. హైదరాబాద్‌లో పేర్లు మార్చాల్సినవి చాలా ఉన్నాయని కేసీఆర్ అన్నారు.