అభివృద్ధి ప్రదాత బాలయోగి
అభివృద్ధి ప్రదాత బాలయోగి
Published Sat, Oct 1 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
అమలాపురం టౌన్ :
లోక్ సభ స్పీకర్‌గా జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన లోక్ సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి జిల్లా అభివృద్ధి ప్రదాతగా నేటికీ జిల్లా గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బాలయోగి జయంతి సందర్భంగా స్థానిక బాలయోగి ఘాట్‌లో ఆయన శనివారం ఘనంగా నివాళులర్పించారు. బాలయోగితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు ఘాట్‌పై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
బాలయెగి జీవిత చరిత్రపై పీహెచ్‌డీ : ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ
సాధారణ వ్యక్తి నుంచి జాతీయ స్థాయిలో అత్యున్నత పదవికి ఎదిగిన లోక్ సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగిని ఈ సీమ ఎప్పటికీ మరచిపోదని ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కారెం శివాజీ అన్నారు. స్థానిక బాలయోగి ఘాట్‌లో ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ నన్నయ్య వర్శిటీలో బాలయోగి జీవిత చరిత్రపై పీహెచ్‌డీ డిగ్రీని త్వరలోనే ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు.
బాలయోగికి ఎంపీ నివాళి
ఢిల్లీ పార్లమెంటు భవనంలోని బాలయోగి చిత్రపటానికి ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది.
Advertisement
Advertisement