హాస్యానికి చిరునామా రాజబాబు | comedian rajabau jayanthi | Sakshi
Sakshi News home page

హాస్యానికి చిరునామా రాజబాబు

Published Thu, Oct 20 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

అచ్చ తెలుగు హాస్యానికి చిరునామా రాజబాబు అని వక్తలు కొనియాడారు. ప్రముఖ హాస్యనటుడు రాజబాబు 81వ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు, ఆత్మీయులు గురువారం రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున ఉన్న రాజబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాజమహేంద్రవరం కల్చరల్‌ :
అచ్చ తెలుగు హాస్యానికి చిరునామా రాజబాబు అని వక్తలు కొనియాడారు. ప్రముఖ హాస్యనటుడు రాజబాబు 81వ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు, ఆత్మీయులు గురువారం రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున ఉన్న రాజబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజబాబు మేనల్లుడు వాసు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన హాస్యానికి రాజబాబు ప్రాణం పోశారన్నారు. ఆ రోజుల్లో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న రాజబాబు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవారన్నారు. కార్యక్రమంలో బాబుల్‌ స్టూడియో అధినేత ముసిని బాబూరావు, కాశీ లక్ష్మీనారాయణ, కె.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement