దశాబ్ధాల పాటు వెండితెర మీద ఎన్నో అద్భుతపాత్రల్లో నటించిన మెప్పించిన అలనాటి నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బెంగళూరులో ఉంటున్న ఆమె కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో బంధువులు బెంగళూరులోని సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పూర్తి చికిత్సకు తగిన ఏర్పాట్లు లేకపోవటంతో వైధ్యుల సూచన మేరకు విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.