
సీనియర్ నటి జయంతి (ఫైల్ ఫొటో)
దశాబ్ధాల పాటు వెండితెర మీద ఎన్నో అద్భుతపాత్రల్లో నటించిన మెప్పించిన అలనాటి నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బెంగళూరులో ఉంటున్న ఆమె కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో బంధువులు బెంగళూరులోని సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పూర్తి చికిత్సకు తగిన ఏర్పాట్లు లేకపోవటంతో వైధ్యుల సూచన మేరకు విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
ప్రస్తుతం జయంతికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. 1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment