
సీనియర్ నటి జయంతి(ఫైల్)
సాక్షి, బెంగళూరు : అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటి జయంతి క్రమంగా కోలుకుంటున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎవరూ నమ్మద్దని ఆమె కుమారుడు కృష్ణకుమార్ తెలిపారు.
మంగళవారం సాయంత్రం జయంతి చికిత్స పొందుతున్న విక్రమ్ హాస్పిటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... సోషల్ మీడియాలో జయంతి మరణించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ వార్తలను ఎవరు నమ్మవద్దని అన్నారు. అయితే ఆమె మరణించినట్లు కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. వాటిని ఆయన తోసిపుచ్చారు. దీంతో ఆమె ఆరోగ్యంపై గందరగోళం నెలకొంది.
1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment