పెళ్లికి రమ్మని ఆహ్వానించా.. దర్శన్‌ అమాయకుడు.. నిరపరాధిగా తిరిగొస్తాడు! | I Invited Darshan For My Wedding: Tharun Sudhir | Sakshi
Sakshi News home page

నా కోసం పెళ్లి వాయిదా వేసుకోకు.. నటుడిని వారించిన దర్శన్‌

Published Sat, Jul 20 2024 6:27 PM | Last Updated on Sat, Jul 20 2024 6:34 PM

Tharun Sudhir: I Invited Darshan For My Wedding

చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనను దర్శక నటుడు తరుణ్‌ సుధీర్‌ శుక్రవారం కలిశాడు. కొన్ని రోజుల్లో తన వివాహానికి ముహూర్తం పెట్టినందున పెళ్లికి రమ్మని ఆహ్వానించడానికి జైలుకు వెళ్లినట్లు తెలిపాడు.

అనారోగ్యం?
తరుణ్‌ మాట్లాడుతూ.. 'దర్శన్‌ ఎప్పటిలాగే చిరునవ్వుతో పలకరించాడు. అయితే కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేనట్లుంది. ఇప్పుడు కాస్త కోలుకున్నాడు. ఆయన అరెస్ట్‌ అయినప్పటి నుంచి మనమంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా బలహీనమైపోయినట్లే అనిపిస్తోంది.

పెళ్లికి ఆహ్వానం
నా పెళ్లి కుదిరిన సంగతి దర్శన్‌కు తెలుసు. వెడ్డింగ్‌కు ఆహ్వానించడానికి వెళ్లాను. తన కోసం పెళ్లి వాయిదా వేసుకోవడం లాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించాడు. ఆయన ఏ పాపం చేయలేదని నేనిప్పటికీ నమ్ముతున్నాను. త్వరలోనే తను నిరపరాధిగా తిరిగొస్తాడు. నా పెళ్లికి హాజరవుతాడు అని చెప్పుకొచ్చాడు.

కాంబినేషన్‌లో రెండు సినిమాలు
కాగా తరుణ్‌, నటి సోనాల్‌ మాంటెరియోను వివాహం చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి వేడుకలు ఆగస్టు 10, 11 రోజుల్లో జరగనున్నాయి. ఇకపోతే తరుణ్‌ సుధీర్‌ దర్శకుడిగా.. దర్శన్‌తో కాటేర, రాబర్ట్‌ చిత్రాలు చేశాడు. వీరి కాంబినేషన్లో సింధూర లక్ష్మణ అనే చారిత్రాత్మక ప్రాజెక్టు రానున్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి.

సంచలనంగా రేణుకాస్వామి హత్య కేసు
హీరో దర్శన్‌ పదేళ్లుగా నటి పవిత్రగౌడతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ప్రియురాలిపై అనుచిత కామెంట్లు చేశాడన్న కోపంతో అభిమాని రేణుకాస్వామిని దర్శన్‌ గ్యాంగ్‌ అతడిని దారుణంగా చంపేశారు. ఈ కేసులో దర్శన్‌, పవిత్ర గౌడ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే న్యాయస్థానం.. వీరి జ్యుడీషియల్‌ కస్టడీని ఆగస్టు 1 వరకు పొడిగించింది.

చదవండి: 2024 OTT ఫస్టాఫ్‌: ఎక్కువమంది చూసిన సిరీస్‌, సినిమాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement