![Malayalam Actress Kanakalatha suffering from Alzheimers and Parkinson - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/9/Malayalam-Actress-Kanakalatha.jpg.webp?itok=T6CtikIq)
ఒకప్పుడు తన సినిమాలతో అభిమానులను అలరించిన నటి కనకలత. ఆమె సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ తనదైన నటనతో మెప్పించింది. మలయాళ చిత్రాలైన ప్రియం, అధ్యతే కన్మణి చిత్రాలతో ఆమెకు గుర్తింపు లభించింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మలయాళం, తమిళంలో ఇండస్ట్రీలో కొనసాగారు.
(ఇది చదవండి: యాత్ర 2.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!)
అయితే ప్రస్తుతం కనకలత పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆమెకు అల్జీమర్స్‌తో పాటు పార్కిన్సన్స్ వ్యాధి సోకింది. తాజాగా కనకలత అనారోగ్యం గురించి ఆమె సోదరి విజయమ్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
ప్రస్తుతం ఆమె ఆహారం తీసుకునే పరిస్థితిలోనే లేరని సోదరి చెబుతోంది. కేవలం లిక్విడ్ ఫుడ్‌తోనే కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపింది. ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతోందని.. డైపర్లు ఉపయోగించాల్సి వస్తోందని వివరించింది. తన పేరు కూడా గుర్తు లేదని ఆమె సోదరి వాపోయింది. ప్రస్తుతం విజయమ్మ, ఆమె మేనల్లుడు కనకలత వద్దే ఉంటున్నారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న నటి 16 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు.
(ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!)
ప్రస్తుతం ఆమెకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి నెలకు రూ. 5000 అందుతోంది. ఆమెకు సంస్థ బీమా కూడా ఉంది. ఆమె అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ (ATMA), ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందుకుంటోంది. కనకలత తన కెరీర్‌లో 360కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె చివరిసారిగా పూక్కలం అనే చిత్రంలో కనిపించింది. నాటకాల ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది
Comments
Please login to add a commentAdd a comment