alzemers
-
మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !
ఒకప్పుడు తన సినిమాలతో అభిమానులను అలరించిన నటి కనకలత. ఆమె సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ తనదైన నటనతో మెప్పించింది. మలయాళ చిత్రాలైన ప్రియం, అధ్యతే కన్మణి చిత్రాలతో ఆమెకు గుర్తింపు లభించింది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మలయాళం, తమిళంలో ఇండస్ట్రీలో కొనసాగారు. (ఇది చదవండి: యాత్ర 2.. ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్.. ఒక్కటి గుర్తుపెట్టుకోండి!) అయితే ప్రస్తుతం కనకలత పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఆమెకు అల్జీమర్స్‌తో పాటు పార్కిన్సన్స్ వ్యాధి సోకింది. తాజాగా కనకలత అనారోగ్యం గురించి ఆమె సోదరి విజయమ్మ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆహారం తీసుకునే పరిస్థితిలోనే లేరని సోదరి చెబుతోంది. కేవలం లిక్విడ్ ఫుడ్తోనే కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపింది. ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతోందని.. డైపర్లు ఉపయోగించాల్సి వస్తోందని వివరించింది. తన పేరు కూడా గుర్తు లేదని ఆమె సోదరి వాపోయింది. ప్రస్తుతం విజయమ్మ, ఆమె మేనల్లుడు కనకలత వద్దే ఉంటున్నారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న నటి 16 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడిపోయింది. అయితే ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు. (ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ప్రస్తుతం ఆమెకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి నెలకు రూ. 5000 అందుతోంది. ఆమెకు సంస్థ బీమా కూడా ఉంది. ఆమె అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ (ATMA), ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందుకుంటోంది. కనకలత తన కెరీర్లో 360కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె చివరిసారిగా పూక్కలం అనే చిత్రంలో కనిపించింది. నాటకాల ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది -
రక్తపోటు నియంత్రణతో ఆ రిస్క్‌కు చెక్
లండన్ : అధిక రక్తపోటుతో గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు, కిడ్నీ వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో బీపీని నియంత్రణలో ఉంచితే అల్జీమర్స్, డిమెన్షియా ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనంస్పష్టం చేసింది. రక్తపోటును అదుపులో ఉంచుకునే వారిలో మతిమరుపు రిస్క్ 19 శాతం తక్కువగా ఉన్నట్టు 50 సంవత్సరాల పైబడిన 9000 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఇక వీరిలో డిమెన్షియా ముప్పు 15 తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. రక్తపోటును పూర్తి అదుపులో ఉంచుకోవడం ద్వారా డిమెన్షియా ముప్పును తగ్గించవచ్చని పరిశోధనలో తేలని క్రమంలో ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు మార్గం సుగమమైందని అల్జీమర్స్ అసోసియేషన్‌కు చెందిన చీఫ్ సైన్స్ అధికారి డాక్టర్ మారియా కరిల్లో చెప్పుకొచ్చారు. రక్తపోటును మూడేళ్ల పాటు పూర్తిగా అదుపులో ఉంచుకుంటే అది గుండె, మెదడు ఆరోగ్యాలపై సానుకూల ప్రభావం చూపినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్ కరోలినాకు చెందిన వేక్ ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అథ్యాపకుడు ప్రొఫెసర్ జెఫ్ విలియమ్సన్ వెల్లడించారు. -
అధిక రక్తపోటుతో అల్జీమర్స్ ముప్పు
లండన్ : రక్తపోటు నియంత్రణలో లేకుంటే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పుపై వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా, అధిక రక్తపోటుతో అల్జీమర్స్ ముప్పు పొంచిఉందని తాజామ అథ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినాకు చెందిన వేక్ ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డేటా బీపీతో అల్జీమర్స్ రిస్క్ ఉందనే సంకేతాలు పంపింది. రక్తపోటును నియంత్రించుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యకర బరువును మెయింటెన్ చేయడం ద్వారా అల్జీమర్స్ ముప్పును నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు 67 సంవత్సరాల సగటు వయసు కలిగిన వృద్ధుల్లో ఆరోగ్యకర రక్తపోటును మెయింటెన్ చేసే వారిలో అల్జీమర్స్ ముప్పు తక్కువగా ఉందని చికాగోలో జరిగిన అల్జీమర్స్ అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది. బీపీ నియంత్రణలో ఉన్న వారిలో అధిక రక్తపోటు కలిగిన వారితో పోలిస్తే డిమెన్షియా,అల్జీమర్స్ రిస్క్ 19 శాతం తక్కువగా ఉన్నట్టు వేక్‌ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. గుండె జబ్బుల నివారణకు ఏ జాగ్రత్తలు పాటిస్తారో వాటినే అల్జీమర్స్ ముప్పును తగ్గించేందుకు పాటించవచ్చని అల్జీమర్స్ అసోసియేషన్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ మరియా కరిలో తెలిపారు. -
నిద్రలేమితో అల్జీమర్స్ ముప్పు
లండన్ : నిద్రలేమితో కునుకుపాట్లు పడేవారికి అల్జీమర్స్ బారిన పడే ముప్పు మూడు రెట్లు అధికమని జాన్స్ హాకిన్స్, యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ పరిశోధకులు వెల్లడించారు. పగటిపూట నిద్ర పాట్లతో సతమతమయ్యేవారిలో అల్జీమర్స్ రిస్క్ అధికంగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.మన ఆరోగ్యంపై నిద్ర ప్రభావం మనం ఊహించిన దాని కంటే అధికంగా ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని వారు చెప్పారు. 123 మంది వాలంటీర్లపై 16 ఏళ్ల పాటు పరిశీలించిన మీదట ఈ వివరాలు రాబట్టామని తెలిపారు. నిద్రలేమి, ఒత్తిడి ఇతరత్రా కార ణాలతో పగటిపూట కునికిపాట్లు పడితే అల్జీమర్స్ వ్యాధి బారినపడే అవకాశం అధికమని గుర్తించామన్నారు. అల్జీమర్స్ నియంత్రణకు వ్యాయామం, పోషకాహారం, మానసిక ఉత్తేజం వంటివి ఉపకరిస్తాయని వెల్లడైనా నిద్రతో ఈ వ్యాధికి నేరుగా ఉన్న సంబంధం తమ అథ్యయనంలో తేలిందని జాన్స్ హాకిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఆడమ్ పీ స్పైరా చెప్పారు. సరైన నిద్రకు ఉపక్రమించడం ద్వారానే అల్జీమర్స్‌కు చెక్ పెట్టవచ్చని అన్నారు. -
కుంగుబాటుతో జ్ఞాపకశక్తి సమస్యలు
న్యూయార్క్ : డిప్రెషన్‌తో బాధపడే రోగులు క్రమంగా జ్ఞాపకశక్తి సమస్యలతో సతమతమవుతారని తాజా అథ్యయనం వెల్లడించింది. కుంగుబాటుకు గురైన వారి మెదడు త్వరగా వయసు మీరడంతో మెమరీ సమస్యలు చుట్టుముడతాయని మియామి యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. తీవ్ర కుంగుబాటుకు లోనైన వారికి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమవుతుందని, వారి మెదడు కుచించుకుపోయి..వయసు మీరే ప్రక్రియ వేగవంతమవుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని చెప్పారు. కుంగుబాటు అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీయకముందే చికిత్స చేయించుకోవాలని పరిశోధకులు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు, అల్జీమర్స్ తీవ్రంగా పెరుగుతున్నాయని వీటికి కారణాలు, చికిత్సపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. అల్జీమర్స్‌తో బాధపడే రోగులు కుంగుబాటుతోనూ సతమతమవుతున్నట్టు తాజా అథ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. కుంగుబాటుకు సత్వర చికిత్స తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి సమస్యలు, అల్జీమర్స్ ముప్పు నుంచి బయటపడవచ్చని సూచించారు. మెదడుపై డిప్రెషన్ పెను ప్రభావం చూపకముందే చికిత్సకు ఉపక్రమించాలని చెబుతున్నారు. కుంగుబాటుతో ఇబ్బందిపడుతున్న 1000 మందిపై మియామీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అథ్యయనం నిర్వహించారు. -
ఎక్కువ గంటలు కూర్చునే వారికి పెనుముప్పు
లండన్ : ఎక్కువ సేపు డెస్క్ పనుల్లో కుర్చీలో కూరుకుపోవడం, సోఫోకు అతుక్కుని టీవీ చూడటంలో నిమగ్నమవడం తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు తక్కువగా ఉన్నవారి మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసకునే ప్రదేశం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చిచెప్పారు. ఎక్కువ గంటలు కూర్చునే వారికి పెనుముప్పు తప్పదని అథ్యయనాన్ని చేపట్టిన లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు. బద్ధకంగా గడిపే వారికి గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల క్యాన్సర్లు వంటి జీవన శైలి వ్యాదులు ముంచుకొస్తాయని ఇప్పటికే వెల్లడవగా తాజా అథ్యయనం మరికొన్ని వ్యాధులూ చురుకైన జీవన శైలి లేని వారిని చుట్టుముడతాయని పేర్కొంది. వీరి మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకునే ప్రదేశం చిన్నగా ఉండటంతో అల్జీమర్, డిమెన్షియా వంటి వ్యాధులు ప్రబలవచ్చని తెలిపింది. అల్జీమర్ ముప్పు అధికంగా ఉన్న వారిలో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చురుకైన జీవనశైలిని అలవరుచుకోవడం కీలకమని బయోస్టాటిస్టీషియన్ డాక్టర్ ప్రభా సిద్ధార్ధ్ సూచించారు. -
పగటి నిద్రతో ముంచుకొచ్చే అల్జీమర్స్
లండన్ : పగటిపూట కునికిపాట్లు భవిష్యత్‌లో అల్జీమర్స్ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. పదవీవిరమణ చేసిన 300 మందిపై చేసిన అథ్యయనంలో పగటిపూట నిద్రించిన వారి మెదడులో అల్జీమర్‌కు దారితీసే కారకాలు ప్రేరేపితమయ్యాయని వెల్లడైంది. దీంతో రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టని వారు పగటిపూట కునికిపాట్లతో సతమతమైతే అల్జీమర్ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. వృద్ధులు పగలు అతిగా నిద్రించడం మంచిది కాదని అథ్యయనం చేపట్టిన మయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. 2009 నుంచి 2016 వరకూ 70 ఏళ్లు పైబడిన దాదాపు 300 మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు పగటిపూట వారు నిద్రించే సమయాన్ని విశ్లేషించారు. వారి బ్రెయిన్ స్కాన్స్‌ను పరిశీలించగా పగటిపూట నిద్రించని వారితో పోలిస్తే బాగా నిద్రపోయిన వారి మెదడులో అల్జీమర్స్ కారకాలు పెరిగాయని స్పష్టం చేశారు. జామా న్యూరాలజీ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. -
ఇలా నిద్రపోతే అల్జీమర్స్ దరిచేరదు!
న్యూయార్క్: వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేదు. అందుకే అది రాకుండా ముందుగానే జాగ్రత్త వహించడం మేలు. దీనికోసం నిపుణులు ఓ సలహా ఇస్తున్నారు. పడుకునేటప్పుడే ఏదైనా ఓ పక్కకు తిరిగిపడుకుంటే అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చని వారి అధ్యయనంలో తేలింది. వెల్లకిలా, లేదా బోర్లా పడుకోవడం కన్నా ఏదైనా ఓ పక్కకు తిరిగి పడుకుంటే అల్జీమర్స్, పార్కిన్సన్, ఇతర నరాల సంబంధిత సమస్యలు దరిచేరకుండా నిరోధించవచ్చని అధ్యయనం సూచించింది. మెదడునుంచి విడుదలయ్యే కొన్ని హానికర, వ్యర్థ రసాయనాలు అల్జీమర్స్, ఇతర నరాల వ్యాధులకు కారణమవుతాయి. దీనివల్ల నిద్రలేమి సమస్యలు కూడా చుట్టుముడతాయి. అయితే పక్కకు తిరిగి పడుకోవడం వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ఈ రసాయనాలు తొలగిపోయే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని న్యూయార్క్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ పరిశోధకులు తెలిపారు. నిద్ర పోయే విధానం కూడా అల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడుతుందని తాము గుర్తించామని మైకెన్ అనే పరిశోధకుడు అన్నాడు. ఎంఆర్ఐ విధానాన్ని ఉపయోగించి సాగించిన అధ్యయనం ద్వారా వారు ఈ విషయాన్ని కనుగొన్నారు.