లండన్ : రక్తపోటు నియంత్రణలో లేకుంటే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పుపై వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా, అధిక రక్తపోటుతో అల్జీమర్స్ ముప్పు పొంచిఉందని తాజామ అథ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినాకు చెందిన వేక్ ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డేటా బీపీతో అల్జీమర్స్ రిస్క్ ఉందనే సంకేతాలు పంపింది. రక్తపోటును నియంత్రించుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యకర బరువును మెయింటెన్ చేయడం ద్వారా అల్జీమర్స్ ముప్పును నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు
67 సంవత్సరాల సగటు వయసు కలిగిన వృద్ధుల్లో ఆరోగ్యకర రక్తపోటును మెయింటెన్ చేసే వారిలో అల్జీమర్స్ ముప్పు తక్కువగా ఉందని చికాగోలో జరిగిన అల్జీమర్స్ అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది. బీపీ నియంత్రణలో ఉన్న వారిలో అధిక రక్తపోటు కలిగిన వారితో పోలిస్తే డిమెన్షియా,అల్జీమర్స్ రిస్క్ 19 శాతం తక్కువగా ఉన్నట్టు వేక్‌ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. గుండె జబ్బుల నివారణకు ఏ జాగ్రత్తలు పాటిస్తారో వాటినే అల్జీమర్స్ ముప్పును తగ్గించేందుకు పాటించవచ్చని అల్జీమర్స్ అసోసియేషన్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ మరియా కరిలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment