ప్రముఖ మలయాళ నటి పార్వతి ఆర్ కృష్ణ అలాంటి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇటీవల తన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను కొందరు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు మిస్‌యూజ్ చేయడంపై ఆమె స్పందించింది. తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోషూట్ చిత్రాలను అసభ్యకరమైన రీతిలో ప్రదర్శిస్తే చర్యలు తప్పవని వెల్లడించింది. ఈ విషయంపై ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.
వీడియోలో పార్వతి ఆ కృష్ణ మాట్లాడుతూ.. 'నాపై వచ్చిన ఒక తీవ్రమైన సమస్యపై మాట్లాడేందుకుందుకే ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నా. నా వృత్తిలో భాగంగా నేను తరచుగా ఫోటోషూట్‌లలో పాల్గొంటాను. ఎక్కడైనా కానీ నా అందాన్ని ప్రదర్శించడంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నా బీచ్ ఫోటోషూట్ సమయంలోనూ ఎక్కడ కూడా హద్దులు మీరి అందాలను ప్రదర్శించలేదు. కానీ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు మాత్రం నా ఫోటోలను వారికిష్టమొచ్చినట్లు ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. నా అనుమతి లేకుండా నా వీడియోలు, చిత్రాలను అసభ్యంగా చూపిస్తే మీ ఛానెల్ మూసేవరకు పోరాటం చేస్తా. ఇలాంటి సమస్యలపై ఇతరులు ఎందుకు స్పందించలేదో నాకు అర్థం కావడం లేదు. నా ఫోటోలను దుర్వినియోగం చేసేవారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. నా వ్యక్తిగత జీవితంలోకి మీరు అడుగుపెడితే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూస్తారు' అంటూ హెచ్చరించింది నటి. కాగా.. పార్వతి ఆర్ కృష్ణ పలు మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment