మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఆర్య ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా మలయాళ బిగ్‌బాస్ సీజన్-2లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్‌తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై స్పందించింది.
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్‌కి పంపాడా అనే అనుమానం ఉంది. ముఖ్యంగా షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. నాకు ఓ కుమార్తె ఉంది. మా నాన్న చనిపోయి చాలా కాలం కూడా కాలేదు. బిగ్‌బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్‌పోర్టులో దింపారు. నాకు అక్కడ బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ పరిచయం లేదు. నేను హౌస్ నుంచి వచ్చేలోగా నాకు దూరం కావాలనేది అతని ప్లాన్ అని తెలీదు. కానీ ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నా' అని తెలిపింది.
కొవిడ్ వల్ల నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చి నా భర్తకు చాలాసార్లు కాల్ చేశా. కానీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ఏకైక నంబర్ అతనిదే. అతను ఫోన్ తీయకపోవడంతో.. నేను అతని సోదరికి ఫోన్ చేశా. ఆమె జరిగిన విషయమంతా నాకు చెప్పింది. అతని మరో మహిళ వివాహేతర సంబంధంలో ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది. దీంతో అతన్ని కాల్చి చంపాలన్నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడైతే అలాంటి కోపం లేదు. కానీ అతనికి ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం సంతోషిస్తా.' అంటూ తన కోపాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో అతను దుబాయ్‌లో ఉన్నందున.. కొవిడ్ వల్ల అతన్ని కలిసేందుకు వీలు కాలేదని ఆర్య తెలిపింది.
కాగా.. ఆర్య చివరిగా మలయాళ కామెడీ చిత్రం క్వీన్ ఎలిజబెత్‌లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం పద్మకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్వేతా మీనన్, నరేన్, జానీ ఆంటోనీ, మీరా జాస్మిన్, నీనా కురుప్ ప్రముఖ పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment