Actress Shelly Kishore Acts In Bold Scenes In Shaitan Web Series - Sakshi
Sakshi News home page

'సైతాన్' వెబ్ సిరీస్.. ఆ సీన్స్ చేసిన నటి గురించి తెలుసా?

Published Sat, Jul 1 2023 7:29 PM | Last Updated on Sun, Jul 2 2023 7:19 AM

Shelly Kishore Acts In Bold Scenes In Shaitan Web Series - Sakshi

ఇటీవలే మహీ వీ రాఘవ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సరీస్ సైతాన్. అయితే ఈ సిరీస్‌లో అంతా బోల్డ్ కంటెంట్‌తో సరికొత్త సంచలనం సృష్టించింది. గతంలో బోల్డ్ కంటెంట్ అనగానే చాలామందికి 'మీర్జాపుర్' గుర్తొస్తుందేమో. కానీ ఇప్పుడు దాన్ని తలదన్నే రీతిలో 'సైతాన్' తెరకెక్కించారు. ఎందుకంటే ఈ సిరీస్ లో బూతులు, అడల్ట్ సీన్స్ లెక్కకు మించి ఉన్నప్పటికీ.. ఎమోషన్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది. దీంతో సిరీస్ సూపర్ హిట్ అయింది. అయితే ఈ సిరీస్‌లో బోల్డ్ సీన్లలో నటించిన నటి ఎవరో తెలుసా? ఇంతకు ముందు ఆమె ఎన్ని సినిమాలు చేసింది? అసలు ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటనే దానిపై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

(ఇది చదవండి: 'సైతాన్' దర‍్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!)

మహీ వి రాఘవ వెబ్ సిరీస్‌ సైతాన్‌లో హీరో తల్లిగా సావిత్రి పాత్రలో నటించింది. ఆమె అసలు పేరు షెల్లీ నబుకుమార్ అలియాస్ షెల్లీ కిశోర్. ఆమె 1983 ఆగస్టు 18న దుబాయ్‌లో జన్మించింది. మలయాళంలో సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కుంకుమపువ్వు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. మిన్నల్ మురళి, తంగ మీన్‌కల్ లాంటి మలయాళ చిత్రాల్లోనూ నటించింది. ఆమెకు 2006లో ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది.

ఇటీవల తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్‌ సైతాన్‌లో ఆమె నటించింది. ఇందులో ముగ్గురు పిల్లలకు తల్లిగా ఆమె నటించింది. ఈ సిరీస్‌లో ఆమె నటన మరింత బోల్డ్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఈ సిరీస్‌తో ఒక్కసారిగా తెలుగులోనూ పాపులర్ అయిన షెల్లీ కిశోర్  ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

(ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement