చిట్టెం నర్సిరెడ్డి జయంతి, ఎమ్మెల్యే డీకే అరుణ, నివాళి
ధన్వాడ : మక్తల్ నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి జయంతిని శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిట్టెం రాంమోహన్‌రెడ్డి వేర్వేరుగా నర్సిరెడ్డి విగ్రహానికి, సీఎన్‌ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నిరంజన్‌రెడ్డి, సుదర్షన్‌రెడ్డి, అబ్దుల్‌రహ్మన్, బసంత్, నరహరి, జుట్ల ఆనంద్‌గౌడ్, కష్ణయ్య, శ్రీనివాస్‌గౌడ్, ఆశిరెడ్డి, లింగారెడ్డి, హన్మంతు, చిన్నబాలు తదితరులు పాల్గొన్నారు.